iDreamPost
android-app
ios-app

మార్కెట్ లోకి ఒప్పో కొత్త 5జీ ఫోన్.. ఫీచర్స్ మాత్రం చాలా స్పెషల్!

OPPO F27 Pro Plus 5G SmartPhone Price And Specifications: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునే వారికి ఇది బిగ్గెస్ట్ గుడ్ న్యూస్. ఎందుకంటే బడ్జెట్లో ఒక బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. దాని ఫీచర్స్ చూస్తే మైండ్ గిర్రున తిరుగుతుంది.

OPPO F27 Pro Plus 5G SmartPhone Price And Specifications: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునే వారికి ఇది బిగ్గెస్ట్ గుడ్ న్యూస్. ఎందుకంటే బడ్జెట్లో ఒక బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. దాని ఫీచర్స్ చూస్తే మైండ్ గిర్రున తిరుగుతుంది.

మార్కెట్ లోకి ఒప్పో కొత్త 5జీ ఫోన్.. ఫీచర్స్ మాత్రం చాలా స్పెషల్!

మాములుగా ఏ ఫోన్ కంపెనీ అయినా ముందు ఇండియన్ మార్కెట్ లోకి రావాలి అనుకుంటుంది. ఎందుకంటే మన దేశంలో జనాభా చాలా ఎక్కువ కాబట్టి. కాలేజీ ఫీజు కట్టకపోయినా పర్లేదు కాని స్మార్ట్ ఫోన్ మాత్రం కాస్ట్లీ ది మైంటైన్ చెయ్యాలి. అలాంటి మైండ్ సెట్ ఉండే యువత ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి టెక్ కంపెనీస్ ఇండియన్ మార్కెట్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తాయి. ఇప్పుడు ఇండియాలో IP69 రేటింగ్ కలిగిన మొదటి స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ అలాగే బలమైన బాడీ, లెదర్ ఫినిష్ తో రాబోతోంది. దీని విడుదల తేదీ, అంచనా ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పుడు విడుదల?:

జూన్ 13, మధ్యాహ్నం 12:00 ISTకి ఒప్పో F27 ప్రో+ 5Gని తన ఆఫిషియల్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైవ్ స్ట్రీమ్ ద్వారా ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నారు. రియల్ టైమ్ అప్‌డేట్లు కంపెనీ యొక్క సోషల్ మీడియాలో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ ఖచ్చితమైన ధర ఇంకా భయటకి చెప్పలేదు, కానీ లీకైన వివరాల ప్రకారం ఇది రూ. 30,000 కంటే తక్కువ ఉండవచ్చు. కానీ సరైన ధర మాత్రం రిలీజ్ రోజే తెలుస్తుంది.

స్పెసిఫికేషన్లు:

డిజైన్: మిడ్‌నైట్ నేవీ, డస్క్ పింక్ అనే రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ప్రీమియం డిజైన్‌ను ఎక్ష్పెక్ట్ చెయ్యొచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ IP69, IP68 మరియు IP66 రేటింగ్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో MIL-STD-810H రేటింగ్లు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. డిస్ప్లే: F27 ప్రో+ 5G 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, దీని డిస్ప్లే సైజు 6.7 అంగుళాలు ఉండి, ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అలాగే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుందని అంచానా వేస్తున్నారు.

పెర్ఫార్మెన్స్- OS: ఆక్టా-కోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 7050 ప్రాసెసర్, మాలి G68 MC4 GPU ద్వారా పవర్ తీసుకుని ఈ ఫోన్ స్మూత్ పెర్ఫార్మెన్స్ ను అందిస్తుంది. ఇది 8GB RAM + 128GB స్టోరేజ్ మరియు 8GB RAM + 256GB స్టోరేజ్ ఇలా రెండు వేరియంట్ లలో ఉంటుంది. Android 14 ఫోన్ కు, ColorOS 14 స్క్రీన్ కు వర్తిచేలా డిజైన్ చేసారు. క్లియర్ గా వివరాలు లేనప్పటికీ, లీకుల ప్రకారం 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అలాగే 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కలిగిన డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది అని భావిస్తున్నారు.

బ్యాటరీ- ఇతర ఫీచర్లు:

డివైస్ 5,000mAh బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, బ్లూటూత్ 5.3, Wi-Fi 6 మరియు USB టైప్-C పోర్ట్ ఉండవచ్చు. అదనంగా, సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ని కూడా ఇంటిగ్రేట్ చెయ్యొచ్చు. మొత్తానికి, ఒప్పో F27 ప్రో+ 5G ప్రీమియం డిజైన్, బలమైన పెర్ఫార్మెన్స్ అలాగే ఇన్నోవేటివ్ ఫీచర్లను పోటీ ధరలో అందించడానికి సిద్ధంగా ఉందని అనిపిస్తోంది. ఇది కచ్చితంగా ఇండియా మార్కెట్ ని షెక్ చెయ్యొచ్చు అని అంచనాలు వస్తున్నాయి.