P Venkatesh
మీరు ఆన్ లైన్ పేమెంట్స్ చేసే సమయంలో ఇంటర్నెట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. నెట్ లేకున్నా.. స్లోగా ఉన్నా పేమెంట్స్ చేయొచ్చు.
మీరు ఆన్ లైన్ పేమెంట్స్ చేసే సమయంలో ఇంటర్నెట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. నెట్ లేకున్నా.. స్లోగా ఉన్నా పేమెంట్స్ చేయొచ్చు.
P Venkatesh
డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల ప్రక్రియ సులభతరం అయిపోయింది. చిన్న కిరాణా దుకాణాల దగ్గర్నుంచి మొదలుకుని పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఆన్ లైన్ పేమెంట్స్ మాత్రమే చేస్తున్నారు. నగదు చెల్లింపులు చేయడం అరుదుగా కనిపిస్తోంది. గూగుల్ పే, ఫోన్ పే వంటి పేమెంట్స్ యాప్స్ ద్వారా కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే ఆన్ లైన్ పేమెంట్స్ చేయాలంటే మీ ఖాతాలో డబ్బు ఉన్నప్పటికీ మీ స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. నెట్ స్లోగా ఉన్నా.. పూర్తిగా డేటా అయిపోయినా పేమెంట్స్ చేయలేరు. కానీ ఫోన్ లో నెట్ లేకపోయినా ఆన్ లైన్ పేమెంట్స్ చేయొచ్చు. అదెలా అంటారా?
డిజిటల్ పేమెంట్స్ చేసేటప్పుడు కొన్ని సందర్బాల్లో బ్యాంక్ సర్వర్ డౌన్ ఉండడం వల్ల పేమెంట్స్ చేయలేరు. అత్యవసర సమయాల్లో ఇది మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే బ్యాంకులో టెక్నికల్ సమస్యలు చేతుల్లో లేని పని కానీ ఇంటర్ నెట్ లేకపోయినా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. దీనికోసం ఏం చేయాలంటే?.. 080 4516 3666 లేదా, 6366 200 200 లేదా, 080 4516 3581 ఈ నంబర్లలో ఏదో ఒక నంబర్‌కు రిజిస్టర్ మొబైల్ ఫోన్ నంబర్ అనగా యూపీఐతో లింక్ చేయబడిన నెంబర్ నుంచి కాల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది.
అదేంటంటే.. ఇప్పుడు మీరు ఎవరికైనా యూపీఐ ద్వారా డబ్బులు పే చేయవచ్చు అని.. ఆ తర్వాత మీరు షాప్ ఓనర్ నెంబర్ తీసుకొని అతనికి ఇవ్వాల్సిన డబ్బును చెల్లించవచ్చు. ఇంటర్నెట్ లేకపోయినా లేదా స్లోగా ఉన్నా ఈ విధంగా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. నిత్య జీవితంలో తప్పనిసరి అయిపోయాయి యూపీఐ పేమెంట్స్.. డిజిటల్ పేమెంట్ యాప్స్. ప్రతి ఒక్కరి ఫోన్ లో ఆన్ లైన్ పేమెంట్స్ యాప్స్ ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరు కూడా ఎప్పుడైనా ఇంటర్నెట్ లేక పేమెంట్స్ చేయలేక ఇబ్బంది పడినట్లైతే ఈ విధానంలో ఈజీగా చెల్లింపులు చేసుకోవచ్చు.