iDreamPost
android-app
ios-app

OLA నుంచి మరో బడ్జెట్ బైక్.. 80 వేలకే రోడ్ స్టర్ EV..

OLA Sankalp 2024- OLA Roadster Series Bikes Price And Specifications: ఓలా సంకల్ప్ కార్యక్రమంలో భవీష్ అగర్వాల్ పలు కీలక ప్రకటనలు చేశారు. వాటిలో కొన్ని బైక్స్ ని కూడా లాంఛ్ చేశారు. అందులో రోడ్ స్టర్ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

OLA Sankalp 2024- OLA Roadster Series Bikes Price And Specifications: ఓలా సంకల్ప్ కార్యక్రమంలో భవీష్ అగర్వాల్ పలు కీలక ప్రకటనలు చేశారు. వాటిలో కొన్ని బైక్స్ ని కూడా లాంఛ్ చేశారు. అందులో రోడ్ స్టర్ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

OLA నుంచి మరో బడ్జెట్ బైక్.. 80 వేలకే రోడ్ స్టర్ EV..

ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్తను అందిచింది. బడ్జెట్ లో ఎలక్ట్రిక్ స్కూటీలను తీసుకురావడం మాత్రమే కాదు.. ఇప్పుడు బడ్జెట్ లోనే ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొస్తున్నారు. ఓలా సంకల్ప్ 2024 సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే ఓలా కంపెనీ బైక్ సిరీస్ రోడ్ మ్యాప్ ని కూడా భవీష్ అగర్వాల్ స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా.. ఓలా నుంచి తీసుకొస్తున్న రోడ్ స్టర్ సిరీస్ ని వినియోగదారులకు పరిచయం చేశారు. ఆ సిరీస్ లో బేసిక్ వర్షన్ ను కేవలం రూ.79,999 ఎక్స్ షోరూమ్ ధరలోనే తీసుకువస్తుండటం భారీ శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే రోడ్ స్టర్ లుక్స్ చూస్తే ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే వాటి ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

రోడ్ స్టర్ సిరీస్ లో మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. రోడ్ స్టర్, రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్ ప్రో మోడల్స్ ను తీసుకొస్తున్నారు. ఈ మూడు మోడల్స్ లో లుక్స్ మాత్రం దాదాపుగా ఒకేలా ఉంటాయి. కానీ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర, మైలేజ్ మాత్రమే మారుతూ ఉంటుంది. అలాగే ఈ బైక్స్ మీరు ఇప్పుడే రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. ఓలా అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి మీరు మీకు నచ్చిన బైక్ ని రిజర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ కి వెళ్లి.. వర్చువల్ గా మీరు ఈ బైక్ ఫీల్ కూడా అవ్వచ్చు అని భవీష్ అగర్వాల్ వెల్లడించారు. ఓలా ప్రో మోడల్ ని మాత్రం డెలివరీలు నెక్ట్స్ దీపావళికి ప్రారంభం అవుతాయి. కానీ, రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్ మోడల్స్ డెలివరీలు జనవరి 2025 నుంచే ప్రారంభం అవుతాయని వెల్లడించారు.

Another budget bike from OLA

రోడ్ స్టర్ సిరీస్ లో బేసిక్ మోడల్ గా రోడ్ స్టర్ ఎక్స్ ని తీసుకొస్తున్నారు. ఈ రోడ్ స్టర్ ఎక్స్ లో 3 వేరియంట్స్ ఉంటాయి. 2.5kwh ఎక్స్ షోరూమ్ ధర రూ.74,9900గా నిర్ణయించారు. అలాగే 3.5kwh వేరియంట్ ధర రూ.84,999గా ఉంది. ఇంక 4.5kwh ఎక్స్ షోరూమ్ ధర రూ.99,999గా డిసైడ్ చేశారు. ఈ మోడల్ డెలివరీలు జనవరి 2025 నుంచే ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఇంక రోడ్ స్టర్ మోడల్ లో కూడా మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. రోడ్ స్టర్ 3.5kwh వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.05 లక్షలుగా నిర్ణయించారు. అలాగే రోడ్ స్టర్ 4.5kwh వేరియంట్ ధరను రూ.1.20 లక్షలుగా నిర్ణయించారు. ఇంక రోడ్ స్టర్ 6kwh వేరియంట్ ధరను రూ.1.49 లక్షలుగా డిసైడ్ చేశారు.

రోడ్ స్టర్ ప్రో మోడల్ 4680 భారత్ సెల్ తో వస్తోంది. ఇందులో రెండు వేరియంట్స్ ఉన్నాయి. 8kwh వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.99 గా నిర్ణయించారు. అలాగే 16kwh వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.2.49 లక్షలుగా డిసైడ్ చేశారు. ఈ ప్రో మోడల్ డెలివరీలను నెక్ట్స్ ఇయర్ దివాళీ నుంచి ప్రారంభం చేస్తామని వెల్లడించారు. ఇవి ఇంట్రడక్షనరీ ధరలు మాత్రమే అని వెల్లడించారు. అంటే ఈ ధరల్లో మోడల్స్ ఎక్కువ రోజులు అందుబాటులో ఉండవు. కానీ, తర్వాత కూడా ధరల్లో పెద్దగా మార్పులు ఉండవు అని వెల్లడించారు.