iDreamPost
android-app
ios-app

Ola నుంచి మరో కొత్త EV.. ఏకంగా 190 కి.మీల రేంజ్‌తో..

మంచి బ్యాటరీ సామార్థ్యంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం చూసే వారికి ఓలా గుడ్ న్యూస్ అందించింది. ఎస్‌1 ఎక్స్‌ శ్రేణిలో 4kWh బ్యాటరీతో ఈ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఏకంగా 190 కిమీల రేంజ్ తో ఈ స్కూటర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

మంచి బ్యాటరీ సామార్థ్యంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం చూసే వారికి ఓలా గుడ్ న్యూస్ అందించింది. ఎస్‌1 ఎక్స్‌ శ్రేణిలో 4kWh బ్యాటరీతో ఈ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఏకంగా 190 కిమీల రేంజ్ తో ఈ స్కూటర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Ola నుంచి మరో కొత్త EV.. ఏకంగా 190 కి.మీల రేంజ్‌తో..

ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో దూసుకెళ్తోంది. ఓలా ఈవీలకు వినియోగదారుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ఓలా స్కూటర్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఆధునిక ఫీచర్లతో కస్టమర్ల అభిరుచులకు తగినట్లు బైక్ లను రూపొందించి మార్కెట్లోకి విడుదల చేస్తోంది ఓలా. ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ ను ప్రవేశపెడుతూనే ఉంది ఓలా. తాజాగా ఓలా మరో సరికొత్త ఈవీని లాంచ్ చేసింది. ఎస్‌1 ఎక్స్‌ శ్రేణిలో 4kWh బ్యాటరీతో ఈ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఏకంగా 190 కిమీల రేంజ్ తో ఈ స్కూటర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సింగిల్ ఛార్జ్ తోనే 190 కి. మీలు ప్రయాణించొచ్చు.

ఇప్పటికే ఓలా రూపొందించిన మోడళ్లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. పెట్రోల్ ధరలు పెరగడం, పొల్యూషన్ కారణంగా వినియోగదారులు ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలవైపే మొగ్గు చూపుతున్నారు. డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఓలా సరికొత్త మోడళ్లను రూపొందిస్తుంది. ఇక తాజాగా లాంచ్ చేసిన ఎస్‌1 ఎక్స్‌ 4kWh స్కూటర్‌ ధరను రూ.1.09 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఓలా ఎస్1 ప్రో, ఎస్ 1 ఎయిర్ కు మంచి స్పందన వచ్చింది. ఎస్‌1 ఎక్స్‌ 4kWh కొత్త ఈవీ కేవలం 3.3 సెకన్లలోనే 0-40 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుందని కంపెనీ వెల్లడించింది.

ఎస్‌1 ఎక్స్‌ 4kWh రెడ్‌ వెలాసిటీ, మిడ్‌నైట్‌, వోగ్‌, స్టీలర్‌, ఫంక్‌, పోర్స్‌లెయిన్‌ వైట్‌, లిక్విడ్‌ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. ఫిజికల్‌ కీ అన్‌లాక్‌ ఉంటుంది. స్మార్ట్‌ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో పొందుపర్చలేదు. ఏప్రిల్‌ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నట్టు ఓలా ప్రకటించింది. బ్యాటరీ విషయంలో ఓలా కొత్త వారెంటీ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్‌ పై 8 సంవత్సరాలు /80,000కిలోమీటర్ల వరకూ వారంటీ అందిస్తున్నామని, అదనంగా 5000 చెల్లిస్తే లక్ష కిలో మీటర్ల వరకు వారంటీ ఉంటుందని వెల్లడించారు.