iDreamPost
android-app
ios-app

వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇంటర్నెట్ లేకపోయినా ఫొటోలు పంపొచ్చు..

Share Media In Whatsapp Offline: వాట్సాప్ లో తరచూ కొత్త ఫీచర్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా వాట్సాప్ తీసుకొస్తున్న ఫీచర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అదేంటంటే.. ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ లో మీడియా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు.

Share Media In Whatsapp Offline: వాట్సాప్ లో తరచూ కొత్త ఫీచర్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా వాట్సాప్ తీసుకొస్తున్న ఫీచర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అదేంటంటే.. ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ లో మీడియా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇంటర్నెట్ లేకపోయినా ఫొటోలు పంపొచ్చు..

ప్రస్తుతం సోషల్ మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ కు ప్రత్యేక స్థానం, ఆదరణ ఉంది. వరల్డ్ వైడ్ గా కూడా దాదాపుగా యూజర్స్ మెసేజింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కోసం ఈ ప్లాట్ ఫామ్ నే వాడుతున్నారు. ఇలాంటి మెసేజింగ్ యాప్ తమ యూజర్స్ కోసం తరచూ ఏవో ఒక కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూనే ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లు, ఐవోఎస్ యూజర్స్ కి విడివిడిగా అనేక అప్ డేట్లను తీసుకొచ్చారు. ఇంకా యూజర్ ఎక్స్ పీరియన్స్ ని బెటర్ చేసేందుకు కొత్త ఫీచర్స్ తెస్తూనే ఉంటారు. అందులో భాగంగా తాజాగా ఒక సూపర్ ఫీచర్ ని తీసుకొచ్చారు. ఇది చూస్తే వాట్సాప్ ని ఆన్ ఇన్ వన్ ప్లాట్ ఫామ్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సాధారణంగానే వాట్సాప్ అంటే మల్టీ పర్పస్ యూజింగ్ యాప్ గా మారిపోయింది. కేవలం మేసేజెస్ మాత్రమే కాకుండా.. వాట్సాప్ లో మీరు ఆడియో కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే మీరు వాట్సాప్ ని పేమెంట్స్ కోసం కూడా వాడచ్చు. అంతేకాకుండా ఇమేజెస్, వీడియోలను షేర్ చేసుకోవచ్చు. అయితే వీటిలో ఏ ఒక్క సేవను మీరు వాడుకోవాలి అనుకున్నా మీ దగ్గర మొబైల్ డేటా ఉండాలి. కానీ, డేటా లేకుండా మీడియా ఫైల్స్, డాక్యుమెంట్స్ షేర్ చేసుకునేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ ని తీసుకొస్తోంది.

సాధారణంగా బ్లూటూత్ ద్వారా మీరు మీడియా ఫైల్స్ షేర్ చేయాలి అంటే గతంలో షేర్ మీ, షేర్ ఇట్ వంటి యాప్స్ ని వాడే వాళ్లు. ఇప్పుడు వాట్సాప్ కూడా అలాంటి కొన్ని సేవను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ తరహాలో మీరు ఫైల్స్ షేర్ చేసుకోవాలి అంటే మీరు మొదట మీ ఫైల్స్ ని యాక్సెస్ చేసేందుకు వాట్సాప్ కి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఫైల్ సెండ్ చేయాలి అనుకున్న వ్యక్తి కూడా మీకు బ్లూటూత్ కనెక్టెవిటీకి సాధ్యమైనంత దూరంలోనే ఉండాలి. మీరు బ్లూటూత్ ఆన్ చేసి సెండ్ చేయాలి అనుకన్న ఫైల్స్ సెలక్ట్ చేసి చెక్ చేస్తే దగ్గర్లో ఉన్న వాట్సాప్ యూజర్స్ కనిపిస్తారు. వారిలో మీరు ఎవరికి సెండ్ చేయాలో సెలక్ట్ చేసుకుని సెండ్ చేయచ్చు.

అయితే మీరు ఎవరికైతే ఫైల్స్ పంపారో.. వాళ్లు కూడా ఆ ఫైల్స్ ని రిసీవ్ చేసుకునేందుకు అనుమతి ఇస్తేనే ఫైల్స్ సెండ్ అవుతాయి. అలాగే ఫేవరెట్ అనే కొత్త ఫీచర్ ని కూడా తీసుకురాబోతున్నారు. అంటే మీకు నచ్చిన, ఇష్టమైన, తరచూ మాట్లాడే వాళ్లను ఒక గ్రూప్ గా సెలక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ప్రతిసారి వారి కాంటాక్ట్ వెతుక్కునే పని లేకుండా ఫేవరెట్ లిస్ట్ లో ఉంచుకోవచ్చు. ఈ రెండు ఫీచర్స్ ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు వాబీటా ఇన్ఫో వెల్లడించింది.