Venkateswarlu
వాట్సాప్ తీసుకువస్తున్న కొత్త కొత్త ఫీచర్లు, అప్‌డేట్ల కారణంగా యూజర్లకు కొన్ని విషయాల్లో పని భారం భారీగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను....
వాట్సాప్ తీసుకువస్తున్న కొత్త కొత్త ఫీచర్లు, అప్‌డేట్ల కారణంగా యూజర్లకు కొన్ని విషయాల్లో పని భారం భారీగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను....
Venkateswarlu
వాట్సాప్ అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మందికి నిత్యావసరంగా మారిపోయింది. రోజులో కనీసం ఓ పది సార్లైనా వాట్సాప్ ఓపెన్ చేయకుండా ఉండలేని వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే తమ కస్టమర్లను ఖుషీ చేయడానికి వాట్సాప్ ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్ తీసుకువస్తున్న కొత్త కొత్త ఫీచర్లు, అప్‌డేట్ల కారణంగా యూజర్లకు కొన్ని విషయాల్లో పని భారం భారీగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.
వాట్సాప్ వాయిస్ నోట్స్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండిటిలోనూ వాయిస్ నోట్స్‌కు సంబంధించి వ్యూ వన్స్ ఆప్చన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఫొటోలు, వీడియోలతో పాటు మెసేజ్‌లకు వ్యూ వన్స్ ఆప్చన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు అందుబాటులోకి రానున్న అప్‌డేట్‌తో వాయిస్ నోట్‌ను ఒకసారి మాత్రమే చదివే వీలుంటుంది. వాయిస్ నోట్‌ను పంపే ముందే ఈ ఆప్చన్ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.
ప్రస్తుతం బిటీ టెస్టర్‌లకు మాత్రమే ఈ వాయిస్ నోట్ వ్యూ వన్స్ ఆప్చన్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. వూ వన్స్ ఆప్చన్‌ను ఎంచుకున్న వాయిస్ నోట్‌ను ఒకసారి వినటం మాత్రమే కుదురుతుంది. దాన్ని సేవ్ చేసుకోవటానికి గానీ, ఇతరులకు సెండ్ చేయటం గానీ, కుదరదు. వాట్సాప్ అతి త్వరలో వీటిని ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తేనుంది. మరి, వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తేనున్న వాయిస్ నోట్ వ్యూ వన్స్ ఆప్చన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.