మైన్ స్వీపర్ గేమ్‌ని లాంఛ్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌.. యాడ్స్, ఎక్స్‌ట్రా ఛార్జీలు లేవు

Minesweeper Game On Netflix: నెట్ ఫ్లిక్స్ అంటే కేవలం వెబ్ సిరీస్ లు, సినిమాలు చూసేందుకు మాత్రమే కాదు.. వీడియో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ సంస్థ మోస్ట్ పాపులర్ గేమ్ ని లాంఛ్ చేసింది.  

Minesweeper Game On Netflix: నెట్ ఫ్లిక్స్ అంటే కేవలం వెబ్ సిరీస్ లు, సినిమాలు చూసేందుకు మాత్రమే కాదు.. వీడియో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ సంస్థ మోస్ట్ పాపులర్ గేమ్ ని లాంఛ్ చేసింది.  

సినిమాలు, వెబ్ సిరీస్ లు అందించే నెట్ ఫ్లిక్స్ యాప్ లో వీడియో గేమ్స్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్ యాప్ లో దాదాపు వంద గేమ్స్ ని అందుబాటులో ఉంచింది. నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు తన గేమింగ్ పోర్ట్ ఫోలియోలో క్లాసిక్ పీసీ పజిల్ గేమ్ అయిన మైన్ స్వీపర్ రీఇమాజిన్డ్ వెర్షన్ ని లాంఛ్ చేసింది. ఈ గేమ్ ని నెట్ ఫ్లిక్స్ యాప్ ద్వారా ఆడచ్చు. జపాన్, ఆస్ట్రేలియా, మెక్సికో, ఈజిప్టు ఇలా పలు దేశాలను ఇంక్లూడ్ చేస్తూ వాటర్ లో ఉన్న మైన్స్ ని స్వీప్ చేసే ఫీచర్స్ ఈ గేమ్ లో ఉన్నాయి. ఈ మైన్ స్వీపర్ పీసీ గేమ్ అనేది ఎంతోమందికి ఇష్టమైన లెజెండరీ గేమ్. ఒకప్పుడు పర్సనల్ కంప్యూటర్స్ లో ఉండేది. చాలా మంది ఆడలేక బుర్రలు బద్దలుకొట్టుకున్నారు. అయినప్పటికీ ఈ గేమ్ అంటే ఒక అడిక్షన్.

అలాంటి గేమ్ ని తమ యాప్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. దీనికి సంబంధించి గేమ్ ట్రైలర్ ని కూడా విడుదల చేసింది. ఒకప్పటి మైన్ స్వీపర్ గేమ్ కి ఇదొక రీమేక్ వెర్షన్ లా ఉంది. ఒకప్పటి గేమ్ తో పోలిస్తే ఇది చాలా అడ్వాన్స్డ్ గా, ఆకర్షణీయంగా ఉంది. ఈ గేమ్ ని ఫ్రీగా ఆడుకోవచ్చునని.. ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జీలు ఉండవని నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. అలా అని గేమ్ మధ్యలో యాడ్స్ కూడా రావని తెలిపింది. యాప్ లో ప్రత్యేకించి ఈ గేమ్ ని కొనుక్కోవాల్సిన అవసరం లేదని తెలిపింది. 50 కంటే ఎక్కువ గేమ్స్ ని అన్ లిమిటెడ్ యాక్సెస్ ని పొందవచ్చునని తెలిపింది. ఈ గేమ్ నెట్ ఫ్లిక్స్ మెంబర్ షిప్ తో పాటే వస్తుందని.. ఆండ్రాయిడ్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ఐఫోన్, ఐపాడ్, ఐపాడ్ టచ్ డివైజెస్ లో డౌన్ లోడ్ చేసుకుని ఆడుకోవచ్చునని తెలిపింది.         

ఇదొక్కటే కాదు.. దీంతో పాటు నెట్ ఫ్లిక్స్ లో ఇంకా చాలా వీడియో గేమ్స్ ఉన్నాయి. మనీ హేస్ట్ అల్టిమేట్ ఛాయిస్ గేమ్ కూడా ఉంది. బ్రైడ్, సోనిక్ మ్యానియా, డెత్స్ డోర్, డస్ట్ & నియాన్, గ్రాండ్ తెఫ్ట్ ఆటో 3, గ్రాండ్ తెఫ్ట్ ఆటో వైస్ సిటీ, గ్రాండ్ తెఫ్ట్ ఆటో శాన్ ఆండ్రియాస్, ఇన్ టూ ది డెడ్ 2 అన్ లీష్డ్, టాంబ్ రైడర్ రీలోడెడ్ వంటి యాక్షన్ గేమ్స్ ఉన్నాయి. వీటితో పాటు అడ్వెంచర్ గేమ్స్, రేసింగ్ గేమ్స్, రోల్ ప్లేయింగ్ గేమ్స్, ఆర్కేడ్ గేమ్స్, కార్డు గేమ్స్, ఎడ్యుకేషనల్ అండ్ మ్యూజిక్ రిలేటెడ్ గేమ్స్, పజిల్ గేమ్స్, సిమ్యులేషన్ గేమ్స్ ఇలా వంద వరకూ గేమ్స్ ఉన్నాయి. మరి మీకు బోర్ కొడితే కనుక నెట్ ఫ్లిక్స్ లోకి వెళ్లి మీకు ఇష్టమైన గేమ్స్ ని ఆడేయండి.

Show comments