Arjun Suravaram
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖగోళ చరిత్రలో అనేక కీలక ఘటనలు నాసానే ఆవిష్కరించింది. మరోసారి కూడ తన మార్క్ ను చూపించింది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖగోళ చరిత్రలో అనేక కీలక ఘటనలు నాసానే ఆవిష్కరించింది. మరోసారి కూడ తన మార్క్ ను చూపించింది.
Arjun Suravaram
విశ్వం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనకు తెలిసినది కొంతే.. ఇంకా తెలియాల్సింది ఎంతో ఉంది. ఇక అంతరిక్షంలోని అనేక రహస్యాలను వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారు. ఎన్నో పరిశోధనలు చేస్తూ కొత్త కొత్త విషయాలను కనిపెడుతున్నారు. అలానే అనేక ప్రయోగాలు చేసి.. అద్భుతాలను సృష్టిస్తున్నాయి. అమెరికాకు చెందిన నాసా ఇలాంటి వాటిల్లో ముందుకు ఉంటుంది. ఇప్పటికే ఎన్నో మైలు రాళ్లను అందుకున్న నాసా.. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. నాసాకు చెందిన ఓ స్పేస్ క్రాఫ్ట్ 22.5 కోట్ల కిలో మీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్ పంపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖగోళ చరిత్రలో అనేక కీలక ఘటనలు నాసానే ఆవిష్కరించింది. మరోసారి కూడ తన మార్క్ ను చూపించింది. నాసాకు చెందిన ‘సైకి’ స్పేస్ క్రాఫ్ట్ అనేది డీప్ స్పేస్‌లో 22.53 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ సందేశాన్ని పంపింది. ఈ విషయాన్ని నాసానే స్వయంగా వెల్లడించింది. 2023 అక్టోబర్‌లో ‘సైక్ 16’ అనే ఆస్టరాయిడ్ వైపు నాసా ఓ స్పేస్ క్రాఫ్ట్ ను పంపింది. అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ఆస్టరాయిడ్ బెల్ట్ లో సైక్ 16 గ్రహశకలం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ ఆస్టరాయిడ్ పేరునే నాసా పంపిన స్పేస్ క్రాఫ్ట్ కు ‘సైకి’ అని పేరు పెట్టారు. దీనిని లేజర్ కమ్యూనికేషన్లను పరీక్షించడానికి నాసా ప్రయోగించింది. అక్టోబర్ 13న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. నవంబర్ 14న కాలిఫోర్నియాలోని పాలోమర్ అబ్జర్వేటరీ వద్ద ఉన్న హేలీ టెలిస్కోప్‌తో ‘సైక్ స్పేస్’కమ్యూనికేషన్ సంబంధాన్ని ఏర్పరచుకుందని నాసా వివరించింది. డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ సిస్టమ్ తో సైక్ క్రాఫ్ట్ ను రూపొందించారు. సైక్ లో రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ వాడినప్పటికీ.. 22.53 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి ఇంజినీరింగ్ డేటాను ట్రాన్స్ మిట్ చేసి డీఎస్ఓసీ సాంకేతికత తన సత్తా చాటుకుంది.
భూమిపై ఉన్న సైక్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ మిట్టర్ తో స్పేస్ లో ఉన్నా సైకి క్రాఫ్ట్ కమ్యూనికేట్ అయింది. గత నెల 8న పది నిమిషాల డూప్లికేటెడ్ స్పేస్ క్రాఫ్ట్ డేటాను డౌన్ లింక్ చేశామని నాసా అధికారులు తెలిపారు. డీప్ స్పేస్ నుంచి నాచురల్ సిస్టమ్ కన్నా మెరుగ్గా లేజర్ కమ్యూనికేషన్లు జరుగుతాయో లేదో కనిపెట్టేందుకు సైకి ప్రయోగం చేశామని తెలిపారు. తాజాగా వచ్చిన లేజర్ మెసేజ్ దూరం.. భూమి, చంద్రుడి మధ్య దూరానికి 40 రెట్లకు సమానమని, అత్యంత దూరం నుంచి భూగ్రహానికి అందిన ఆప్టికల్ కమ్యూనికేషన్ ఇదేనని పేర్కొన్నారు.