nagidream
Nasa Warning: ఇక్కడున్న మనుషుల వల్లే కాదు.. అంతరిక్షంలో ఉన్న గ్రహశకలాల వల్ల కూడా భూమిని ముప్పు పొంచి ఉంది. ఎప్పటికైనా ఈ భూమ్మీద ఉన్న మానవాళికి, సమస్త జీవరాశులకు భారీ ప్రమాదం అయితే ఉంది. అయితే ఆ ముప్పు మరీ 14 ఏళ్లలో వచ్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ నాసా ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఒక ప్రమాదకర గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతుందని తెలిపింది.
Nasa Warning: ఇక్కడున్న మనుషుల వల్లే కాదు.. అంతరిక్షంలో ఉన్న గ్రహశకలాల వల్ల కూడా భూమిని ముప్పు పొంచి ఉంది. ఎప్పటికైనా ఈ భూమ్మీద ఉన్న మానవాళికి, సమస్త జీవరాశులకు భారీ ప్రమాదం అయితే ఉంది. అయితే ఆ ముప్పు మరీ 14 ఏళ్లలో వచ్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ నాసా ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఒక ప్రమాదకర గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతుందని తెలిపింది.
nagidream
2012లో యుగాంతం వస్తుంది అని చెప్పి నానా హడావుడి సృష్టించారు. ఆ తర్వాత అలాంటిదేమీ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరోసారి నాసా షాకింగ్ విషయం వెల్లడించింది. అయితే యుగాంతం అని కాదు కానీ.. ఒక గ్రహశకలం భూమిని ఢీకొడుతుందని.. అయితే దాని ప్రభావాన్ని అంచనా వేయలేకపోతున్నామని.. జరగబోయే నష్టాన్ని ఊహించలేకపోతున్నామని.. ఎలా ఎదుర్కోవాలో కూడా ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి వ్యూహం లేదని తెలిపింది. ఇప్పటికిప్పుడు ఏదైనా గ్రహశకలం (ఆస్ట్రాయిడ్) భూమిని ఢీకొడితే ఏంటి పరిస్థితి? దీన్నుంచి ఎలా తప్పించుకోవాలి? దీన్ని ఎదుర్కునే సామర్థ్యం మానవాళికి ఉందా? అనే విషయాలపై నాసా ఇటీవల ఒక ఎక్సర్ సైజ్ ని నిర్వహించింది.
అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవల హైపోథెటికల్ ఎక్సర్ సైజ్ ని నిర్వహించింది. ప్లానిటరీ డిఫెన్స్ ఇంటర్ ఏజెన్సీ టేబుల్ టాప్ ఎక్సర్ సైజ్ పేరుతో ఏప్రిల్ నెలలో ఒక సమీక్షను నిర్వహించింది. గ్రహశకలం (ఆస్ట్రాయిడ్) భూమిని ఢీకొడితే ఏంటి పరిస్థితి అనే అంశం మీద కొంతమంది బృందంతో కలిసి ఒక విచారణను జరిపింది. 72 శాతం గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని నాసా చెబుతోంది. అయితే దాన్ని ఆపడానికి తాము సిద్ధంగా లేనందుకు ఆందోళనలో ఉన్నట్లు నాసా తెలిపింది. అమెరికా ప్రభుత్వ ఏజెన్సీల నుంచి దాదాపు వందల మంది ప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు ఈ ఎక్సర్ సైజ్ లో పాల్గొన్నారు. మేరీల్యాండ్ లోని జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబోరేటరీలో ఈ ఎక్సర్ సైజ్ జరిగింది. జూన్ 20న ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ ఎక్సర్ సైజ్ లో భాగంగా గ్రహశకలం భూమిని ఢీకొడితే.. జరిగే ప్రమాదాల గురించి సమాచారం, ఎదుర్కునే శక్తి, అంతర్జాతీయ సహకారం కోసం సంభావ్యత వంటి అంశాల గురించి చర్చించారు. ఇటీవల గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు 72 శాతం ఉన్నాయని.. 14 ఏళ్లలో ఇది జరిగే ఛాన్స్ ఉందని నాసా అంచనా వేసింది. ఆ తేదీని కూడా ఫిక్స్ చేసింది. జూలై 12 2038లో ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉందని తెలిపింది. అయితే ఆ గ్రహశకలానికి సంబంధించి పరిమాణం గురించి గానీ, అందులో ఉండే మిశ్రమం గురించి గానీ, ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి సంబంధించి గానీ తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.
నిర్ణయం తీసుకునే విధానాలు, అంతరిక్ష యాత్రలను వెంటనే నిర్వహించడానికి సిద్ధంగా లేకపోవడం ప్రధాన సమస్య అని తెలిపింది. గ్రహశకలాలు భూమిని ఢీకొడితే ఎలాంటి విపత్తు నిర్వహణ చర్యలు తీసుకోవాలో అనే దానిపై స్పష్టత లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య అని నాసా నొక్కి చెప్పింది. అయితే గ్రహశకలం భూమి వైపు వస్తున్నప్పుడు దాని దిశను.. నాసా యొక్క డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) మిషన్ ఆపగలదని.. కైనెటిక్ ప్రభావంతో గ్రహశకలం దిశ మారుస్తుందని నాసా వెల్లడించింది. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో వచ్చే గ్రహశకలాల నుంచి భూమిని కాపాడుతుందని.. దాన్ని డెవలప్ చేస్తున్నామని తెలిపింది. అందుకోసం నాసా నియో సర్వేయర్ (నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ సర్వేయర్) టెక్నాలజీని డెవలప్ చేస్తుంది.
ఈ అంతరిక్ష టెలిస్కోప్ ఇన్ఫ్రారెడ్ సామర్థ్యంతో భూమికి దగ్గరలో ఉన్న ప్రమాదకర ఆబ్జెక్ట్స్ ని అవి భూమిని ఢీకొట్టడానికి చాలా సమయం ముందే గుర్తిస్తుంది. భూమికి దగ్గరలో ఉన్న గ్రహశకలాలను గుర్తించి.. ప్రమాదాన్ని అంచనా వేసి దాన్ని తగ్గించడానికి.. అలానే నాసా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ నియో సర్వేయర్ టెక్నాలజీని 2028లో జూన్ నెలలో ప్రారంభిస్తున్నట్లు నాసా తెలిపింది. ఇంకో 4 ఏళ్లలో భూమికి గ్రహశకలాలతో పొంచి ఉన్న ముప్పును నివారించడానికి.. వాటి దిశ మార్చడానికి కొత్త టెక్నాలజీని అయితే నాసా తీసుకొస్తుందన్నమాట.
LIVE: We’re discussing the results of our latest biennial tabletop exercise to simulate responses to a hypothetical asteroid impact threat. Tune in for more info on our findings and recommendations: https://t.co/cfGgS5d9yr
— NASA (@NASA) June 20, 2024