iDreamPost

భవిష్యత్తులో ఫోన్‌లు కనుమరుగు.. కేవలం న్యూరాలింక్‌లు మాత్రమే.. ఎలాన్ మస్క్

స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ట్వీట్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఫోన్స్ ఉండవు. ఫ్యూచర్ అంతా న్యూరాలింక్స్ మాత్రమే ప్రపంచాన్ని శాసిస్తాయని తెలిపారు.

స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ట్వీట్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఫోన్స్ ఉండవు. ఫ్యూచర్ అంతా న్యూరాలింక్స్ మాత్రమే ప్రపంచాన్ని శాసిస్తాయని తెలిపారు.

భవిష్యత్తులో ఫోన్‌లు కనుమరుగు.. కేవలం న్యూరాలింక్‌లు మాత్రమే.. ఎలాన్ మస్క్

స్మార్ట్ ఫోన్ మానవ జీవన శైలిలో భాగమైపోయిన విషయం తెలిసిందే. క్షణం కూడా ఫోన్ లేకుండా గడపలేని పరిస్థితి ఉంది. ఏ పని కావాలన్నా, ఏదైనా సమాచారం కోసమైనా క్షణాల్లో స్మార్ట్ ఫోన్ తో తెలుసుకునే వెసులుబాటు ఉండడంతో ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. భవిష్యత్తులో ఫోన్లు ఉండవంటే ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. కానీ ఫ్యూచర్లో ఫోన్లు కనుమరుగు కానున్నట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలిపారు. టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఫ్యూచర్ లో ఫోన్లకు బదులుగా న్యూరాలింక్స్ మాత్రమే రాజ్యమేలుతాయంటూ మస్క్ వెల్లడించారు.

స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఓ సంచలనం. టెస్లా కార్ల దగ్గర్నుంచి, స్పేస్ ఎక్స్ ప్రయోగాల వరకు ఏం చేసినా సంచలనమే. ఏకంగా మానవ మెదడులో చిప్ అమర్చే ప్రయోగానికి కూడా శ్రీకారం చుట్టారు ఎలాన్ మస్క్. ఇటీవలి కాలంలో మస్క్ న్యూరాలింక్ మెదడు చిప్ ను ఫస్ట్ టైమ్ మానవునికి విజయవంతంగా అమర్చారు. ఇప్పుడు మరో సంచలనమైన ప్రకటన చేశారు మస్క్. ప్రపంచాన్ని శాసిస్తున్న స్మార్ట్ ఫోన్ ఇక భవిష్యత్తులో ఉండదంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఫ్యూచర్ లో న్యూరాలింక్స్ మాత్రమే ప్రపంచంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తాయని తెలిపారు. దీనికి సంబంధించి మస్క్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

Elon Musk

మస్క్ తన ట్విట్టర్ (X) అకౌంట్లో భవిష్యత్తులో ఫోన్‌లు ఉండవు. కేవలం న్యూరాలింక్‌లు మాత్రమే అని పోస్టు చేశారు. ఈ సందర్భంగా మస్క్ తన చేతిలో ఫోన్ పట్టుకుని ఉన్న ఫొటోను న్యూరాలింక్ షేర్ చేసింది. ఆ ఫొటోలో మస్క్ నుదిటిపై న్యూరల్ నెట్‌వర్క్ ఉన్నట్లుగా సూచిస్తుంది. న్యూరాలింక్ తమ సూపర్ కంప్యూటర్‌తో పాటు ఫోన్‌ను వారి మనస్సుతో కంట్రోల్ చేసేలా మెదడు చిప్‌ను అమర్చేందుకు రెండో పార్టిసిపెంట్ కోసం వెతుకుతోంది. ఇప్పటికే “న్యూరాలింక్ రెండో పార్టిసిపెంట్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి