iDreamPost

ఒకే సారి మోటో నుంచి 3 సూపర్ ఫోన్స్.. 2 మాత్రం చాలా స్పెషల్!

Motorola Releasing 3 New Super SmartPhones: మోటరోలా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫీచర్ ఫోన్ల సమయంలో మార్కెట్ ని ఏలింది. కానీ, స్మార్ట్ ఫోన్ యుగంలో మొన్నటి వరకు వెనుకపడింది. మళ్లీ తిరిగి పుంజుకుని మార్కెట్ ని శాసించే దిశగా అడుగులు వేస్తోంది.

Motorola Releasing 3 New Super SmartPhones: మోటరోలా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫీచర్ ఫోన్ల సమయంలో మార్కెట్ ని ఏలింది. కానీ, స్మార్ట్ ఫోన్ యుగంలో మొన్నటి వరకు వెనుకపడింది. మళ్లీ తిరిగి పుంజుకుని మార్కెట్ ని శాసించే దిశగా అడుగులు వేస్తోంది.

ఒకే సారి మోటో నుంచి 3 సూపర్ ఫోన్స్.. 2 మాత్రం చాలా స్పెషల్!

మనిషికి ఊపిరి పీల్చడం ఎంత ఇంపార్టెంటో, ఫోన్ వాడడం కూడా అంతే ఇంపార్టెంట్ అయిపొయింది. పది మంది ఫ్రెండ్స్ పక్క పక్కనే ఉన్నా కూడా, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వీలు లేనంత బిజీగా ఫోన్ లో మునిగిపోతున్నాం. దానికి కారణం అందరి ఫోన్స్ లో ఎక్కువ ఫీచర్స్ ఉండడమే. మొబైల్ కంపెనీస్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ని యాడ్ చేస్తూ, కొత్త కొత్త మోడల్స్ ని ఒక దాని తరవాత మరో దాన్ని మార్కెట్ లోకి లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ఇలా ఎక్కువ మొబైల్స్ మార్కెట్ లోకి దింపే కంపెనీస్ లో మోటరోలా కూడా ఒకటి. దాదాపు పది సంవత్సరాలు ఎలాంటి ఫోన్ ని మార్కెట్ లోకి లాంచ్ చెయ్యకపోయినా కూడా, ఆ తరవాత రిలీజ్ చేసిన మోడల్స్ అన్ని టాప్ సేల్స్ లో ఉన్నాయి. దానికి కారణం మార్కెట్ లో ఉన్న ఫోన్స్ తో కంపేర్ చేస్తే, చాలా తక్కువ రేటుకే, ఎక్కువ ఫీచర్స్ ఇవ్వడం. అలానే స్టైలిష్ లుక్ లో ఫోన్స్ డిజైన్ ఉండడమే. ఇప్పటికీ ఆ సేల్స్ ని అలానే కంటిన్యూ చేస్తూ, అనేక మోడల్స్ ని స్పీడ్ గా లాంచ్ చేసిన బ్రాండ్ కూడా మోటరోలా అని చెప్పొచ్చు.

మోటరోలా రీసెంట్ గా మోటో ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో పవర్‌ఫుల్ ఫీచర్స్ మాత్రమే కాకుండా ఫోన్ డిజైన్‌ కూడా సూపర్ ఉంది. ఈ మోడల్ తో పాటు మోటరోలా కొత్త ఫ్లిప్ ఫోన్‌లను కూడా ఈ నెల (జూన్) 25న గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తుంది. ఆ రెండు ఫ్లిప్ ఫోన్స్ ఏంటి అంటే, ఒకటి మోటరోలా రాజర్ 50, ఇంకోటి రాజర్ 50 అల్ట్రా. ఈ రెండు కూడా ఫోల్డబుల్ ఫోన్‌ లు. ఇప్పటికే రెండు మోడల్స్ ని బ్యాక్ టు బ్యాక్ మార్కెట్ లోకి దింపినా కూడా మోటరోలా కంపెనీ సాటిస్ఫై అవ్వలేదు. S50 Neo అనే పేరుతో మరో కొత్త ఫోన్ ను చైనాలో లాంచ్ చెయ్యాలని డిసైడ్ అయ్యింది. అయితే త్వరలో ఇదే ఫోన్ ని మోటో G85 5G పేరుతో వరల్డ్ వైడ్ లాంచ్ చేస్తుంది. దీని బట్టి చూస్తుంటే ఒకే సారి మోటరోలా మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్ తో మార్కెట్ మీద దండయాత్ర చెయ్యడానికి రెడీగా ఉంది. లాంచ్ కి ముందే ఈ ఫోన్స్ స్పెసిఫికేషన్‌లు, ధరల గురించి ఇన్ఫర్మేషన్ బయటకి వచ్చింది.

మోటరోలా రాజర్ 50- రాజర్ 50 అల్ట్రా:

మోటరోలా రాజర్ 50, దీని ధర 899 యూరోలు (సుమారు రూ. 80,572) ఇందులో 8GB RAM+ 256GB తో ఫోన్ వస్తుంది. అలాగే రెండో మోడల్ మోటరోలా రాజర్ 50 అల్ట్రా దీని ధర 1199 యూరోలు (సుమారు రూ. 1,07,460) ఇందులో 12GB RAM +512GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఫోన్ వస్తుంది. ఈ రెండు ఫోన్ లలో మొదటిది Razr 50, ఇది మొత్తం మూడు కలర్స్ తో వస్తుంది. ఒకటి గ్రే, రెండు ఆరెంజ్, మూడు సాండ్ కలర్స్ ఆప్షన్లలో ఉన్నాయి. రెండో ఫోన్ అయిన Razr 50 Ultra కూడా మూడు కలర్స్ తో వస్తుంది. ఒకటి బ్లూ, రెండు గ్రీన్, మూడు పీచ్ కలర్ ఆప్షన్లలో ఉన్నాయి.

మోటరోలా రాజర్ 50, రాజర్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్స్:

ఈ రెండు ఫోన్ లలో ఉన్న మొదటి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ రెండు ఫోన్స్ ఫోల్డబుల్ ఫోన్‌లు. పైగా 6.9 ఇంచెస్ ఫుల్ HD + OLED డిస్‌ప్లేతో వస్తున్నాయి. అలాగే ఫోన్ ని ఫోల్డ్ చేసినప్పుడు ఇంకో చిన్న స్క్రీన్ ఉంటుంది. దాని సైజు 3.6 ఇంచెస్ ఉంటుంది. రాజర్ 50 డైమెన్షన్ 7300x ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే రాజర్ 50 అల్ట్రా స్నాప్ డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్ తో రన్ అవుతుంది. రాజర్ 50 33W 3950mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్‌ ఫెసిలిటీ తో వస్తుంది. కాని అల్ట్రా వేరియంట్‌లో 4000mAh బ్యాటరీ ఉన్నప్పటికీ, 68 వాట్ ఛార్జింగ్ తోనే వస్తుంది. ఈ రెండు ఫోన్‌లు కూడా 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ తో ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న ఫ్రంట్ కెమెరా మాత్రం 32 మెగాపిక్సెల్ లెన్స్ తో ఉంటుంది.

మోటో G85 5G ధర:

మోటో G85 5G 349 యూరోలకు వస్తుంది (సుమారు రూ. 31,299). ఇందులో కూడా త్రీ కలర్స్ ఉంటాయి ఒకటి గ్రే, రెండోది ఆలివ్, మూడోది బ్లూ కలర్ ఆప్షన్‌లలో ఉన్నాయి. ప్రస్తుతం మోటరోలా దీని లాంచ్ డేట్ ని ఇంకా అఫిషియల్‌గా అనౌన్స్ చెయ్యలేదు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే. ఇది వరల్డ్ వైడ్ G85 అయినా కూడా, చైనాలో ముందు లాంచ్ అయ్యే Moto S50 Neoకి రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఇందులో 6.6-ఇంచెస్ OLED డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్ తో వస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా మాత్రం 32 మెగాపిక్సెల్ లెన్స్ తో ఉంది. ప్రస్తుతానికి మనకి ఉన్న సమాచారం ప్రకారం ఇవే ఈ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్ల ఇంకా ధరలు. ఈ మూడు ఫోన్ లలో మీ బడ్జెట్ లో ఏ ఫోన్ ఉందొ, మీకు నచ్చిన స్పెసిఫికేషన్ల ఎందులో ఉన్నాయో కామెంట్ చెయ్యండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి