iDreamPost
android-app
ios-app

తక్కువ ధరలో 5జీ ఫోన్‌ కావాలా?.. 10వేలకే Moto కొత్త 5జీ ఫోన్‌.. క్రేజీ ఫీచర్లు

Moto G45: స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. తక్కువ ధరలోనే 5జీ ఫోన్ కావాలనుకునే వారికి మోటరోలా నుంచి న్యూ 5జీ ఫోన్ రిలీజ్ అయ్యింది. 10 వేలకే సొంతం చేసుకోవచ్చు.

Moto G45: స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. తక్కువ ధరలోనే 5జీ ఫోన్ కావాలనుకునే వారికి మోటరోలా నుంచి న్యూ 5జీ ఫోన్ రిలీజ్ అయ్యింది. 10 వేలకే సొంతం చేసుకోవచ్చు.

తక్కువ ధరలో 5జీ ఫోన్‌ కావాలా?.. 10వేలకే Moto కొత్త 5జీ ఫోన్‌.. క్రేజీ ఫీచర్లు

ఒకప్పుడు చేతిలో ఫీచర్ ఫోన్ ఉంటేనే ఎంతో గ్రేట్ గా ఫీలయ్యే వారు. టెక్నాలజీ డెవలప్ మెంట్ తో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ సర్వసాధారణం అయిపోయింది. దాదాపు అందరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అడ్వాన్డ్స్ టెక్నాలజీతో సరికొత్త ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలన్నీ 5జీ స్మార్ట్ ఫోన్లను రూపొందించే పనిలో పడ్డాయి. స్మార్ట్ ఫోన్ కావాలంటే కనీసం 15-20 వేలు అయిన వెచ్చించాల్సి ఉంటుంది. కంపెనీల మధ్య పోటీతో 5జీ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. మీరు తక్కువ ధరలో మంచి ఫీచర్లతో 5జీ ఫోన్ కావాలనుకుంటున్నారా? తాజాగా మోటరోలా కొత్త మెటో జీ45 5జీ ఫోన్ ను లాంచ్ చేసింది.

టెలికాం సంస్థలు 5జీ నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో 5జీ స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. 5జీ ఫోన్లను కొనేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బడ్జెట్ ధరలోనే 5జీ ఫోన్లు లభిస్తున్నాయి. మీరు 10 వేల లోపు బెటర్ పోన్ కావాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. మోటోరొలా ‘జీ’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మెటో జీ45 5జీ పేరిట రిలీజ్ చేసింది. 50 ఎంపీ డ్యూయల్‌ రియర్‌ కెమెరా, ఐపీ52 రేటింగ్‌తో కంపెనీ ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది.

మోటో జీ45 5జీ రెండు వేరియంట్లో లభిస్తుంది. 4జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.10,999కాగా.. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. బ్రిలియంట్‌ బ్లూ, బ్రిలియంట్‌ గ్రీన్‌, వివా మెజెంటా కలర్ ఆప్షన్లలో లభించనుంది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే వస్తోంది. ఇందులో 120హెచ్ జెడ్ రిఫ్రెష్‌ రేట్ తో వస్తుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6ఎస్‌ జనరేషన్‌ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14తో పనిచేస్తుంది. వెనకవైపు 50 ఎంపీ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌, ముందువైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 20వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వస్తుంది. ఆగస్టు 28 మధ్యాహ్నం 12 గంటన నుంచి సేల్ ప్రారంభమవుతుంది.