P Venkatesh
Moto G85: మొబైల్ యూజర్లకు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మోటరోలా కంపెనీ మోటో జీ85 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ధర ఎంతంటే?
Moto G85: మొబైల్ యూజర్లకు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మోటరోలా కంపెనీ మోటో జీ85 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ధర ఎంతంటే?
P Venkatesh
లేటెస్ట్ ఫీచర్లు ఉండే ఫోన్ కోసం తరచుగా ఫోన్లను మారుస్తుంటారు యూజర్లు. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు యూజర్ల అభిరుచులకు తగ్గట్టుగా స్టన్నింగ్ డిజైన్, క్రేజీ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త స్మార్ట్ ఫోన్ల కోసం వెయిట్ చేస్తున్న మొబైల్ యూజర్లకు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటరోలా నుంచి న్యూ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ఇటీవల మోటో కంపెనీ ప్రీమియం, బడ్జెట్ రేంజ్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నది. తాజాగా మోటో జీ85 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేసింది.
మోటరోలా కంపెనీ నుంచి విడుదలయ్యే ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నది. ఇక కొత్తగా రిలీజ్ చేసిన మోటో జీ85 5జీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉండనున్నది. మోటో జీ85 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. ఆలివ్ గ్రీన్, కోబాల్ట్ బ్లూ, అర్బన్ గ్రే కలర్స్ లో అందుబాటులో ఉండనున్నది.
మోటో జీ85 5జీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హెలోయూఐతో ఈ ఫోన్ వస్తోంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ పీఓఎల్‌ఈడీ స్క్రీన్ ఇచ్చారు. ఎండ్ లెస్ ఎడ్జ్ డిజైన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటుతో పాటు 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. సేఫ్టీ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3 పవర్ ఫుల్ ప్రాసెసర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 50 ఎంపీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ముందువైపు 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఐపీ 52 రేటింగ్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ తో ల్యాప్ టాప్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్, మోటోరొలా వెబ్‌సైట్లతో పాటు ఇతర రిటైల్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ లభిస్తుంది. జులై 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.