iDreamPost
android-app
ios-app

Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. కేవలం 6,999 కే

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్ ను కేవలం 6,999కే స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. క్రేజీ ఫీచర్లతో వస్తుంది.

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్ ను కేవలం 6,999కే స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. క్రేజీ ఫీచర్లతో వస్తుంది.

Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. కేవలం 6,999 కే

స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. మార్కెట్ లోకి ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు తరచుగా కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మోటరోలా నుంచి మోటో జీ4ఎస్ సేల్ కు సిద్ధమవుతోంది. అతి తక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్ ను దక్కించుకోవచ్చు. కేవలం 6,999కే కొనుగోలు చేయొచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో జూన్ 5 నుంచి సేల్స్ ప్రారంభంకానున్నాయి. కెమెరా పర్ఫామెన్స్, బ్యాటరీ కెపాసిటీ ఇంకా ఇతర క్రేజీ ఫీచర్లను కలిగి ఉంది మోటో జీ4ఎస్ స్మార్ట్ ఫోన్.

మోటో జీ4ఎస్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో అసలు ధర రూ. 9,999గా ఉంది. అయితే సేల్ లో భాగంగా 3 వేలు తగ్గింపు లభిస్తోంది. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను 6,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 5,000ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్ సదుపాయాన్ని కలిగి ఉంది. ఈ మొబైల్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజీ వేరియంట్ తో వస్తుంది. 50 మెగా పిక్సెల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇది ఆక్టా కోర్ యూనిసోక్ టీ606 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మోటోరోలా మోటో జీ4ఎస్ ఫోన్ కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

Motorola

మోటోరోలా G04ఎస్ స్మార్ట్‌ఫోన్ 1,612 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల హెచ్ డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఈ మోటో G04ఎస్ ఫోన్ ఆండ్రాయిడ్ 14ఓఎస్ కి కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ లో మైక్రో ఎస్డీ కార్డ్ ఉపయోగించి 1 టీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. 15వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది 3.5ఎంఎం ఆడియో జాక్‌తో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి