iDreamPost
android-app
ios-app

బడ్జెట్ లో వరల్డ్స్ స్లిమ్మెస్ట్ ఫోన్.. మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో

Motorola Edge 50: మొబైల్ మార్కెట్ లో మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ కంపెనీ తీసుకొచ్చిన ఈ మొబైల్ వరల్డ్ లోనే స్లిమ్మెస్ట్ ఫోన్.. మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో వస్తుంది.

Motorola Edge 50: మొబైల్ మార్కెట్ లో మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ కంపెనీ తీసుకొచ్చిన ఈ మొబైల్ వరల్డ్ లోనే స్లిమ్మెస్ట్ ఫోన్.. మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో వస్తుంది.

బడ్జెట్ లో వరల్డ్స్ స్లిమ్మెస్ట్ ఫోన్.. మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో

స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో కొత్త ఫోన్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. యూజర్ల అభిరుచులకు తగిన విధంగా ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు స్మార్ట్ ఫోన్లను రూపొందించి రిలీజ్ చేస్తున్నాయి. లేటెస్ట్ ఫీచర్స్, స్టన్నింగ్ డిజైన్ తో మొబైల్ ఫోన్స్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. కొత్త ఫోన్ కొనాలనుకునే వారు మెయిన్ గా చూసేది ఫీచర్లు, ధర. ఇక బడ్జెట్ ధరలో సూపర్ ఫీచర్లతో మొబైల్ ఉందంటే చాలు కొనేందుకు అస్సలు వెనకాడరు. కాగా క్రేజీ ఫీచర్లతో మోటరోలా నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్ లోకి లాంఛ్ అయ్యింది. మోటరోలా ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీని స్పెషాలిటీ ఏంటంటే? వరల్డ్స్ స్లిమ్మెస్ట్ ఫోన్.. మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో వస్తుంది.

మోటరోలా కంపెనీ వరసగా కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నది. కళ్లు చెదిరే ఫీచర్లతో వస్తున్న మొబైల్స్ యూజర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మోటరోలా లాంఛ్ చేసిన మోటరోలా ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్ కర్వ్డ్ డిస్ల్పేతో వస్తుంది. ఈ సెగ్మెంట్ లో వస్తున్న అత్యంత సన్నని ఎంఐఎల్ 810హెచ్ రేటెడ్ కర్వ్డ్ స్మార్ట్ ఫోన్. మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో అంటే ఏ వాతావరణంలోనైనా యూజ్ చేసుకోవచ్చు. ఐపీ68 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్,+256జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.27,999గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన సేల్ ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. యాక్సిస్ బ్యాంకు లేదా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అప్పుడు మీరు ఈ ఫోన్ ను రూ.25,999కే సొంతం చేసుకోవచ్చు.

జంగిల్ గ్రీన్, పాంటోన్ పీచ్ బజ్, కోలా గ్రే కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 700సీ సెన్సార్ను ప్రధాన కెమెరాగా అందించారు. దీంతోపాటు 10 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ కూడా ఉంది. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 7 జెన్ 1 యాక్సెలరేటెడ్ ఎడిషన్ 4ఎన్ఎం చిప్ సెట్ తో వస్తుంది. ఇందులో 6.7 అంగుళాల 1.5కే సూపర్ హెచ్డీ పీఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెచ్ జెడ్ గా ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హలో యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్. 68వాట్ టర్బో ఛార్జింగ్, 15వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.