సూపర్ టెక్నాలజీతో అత్యధిక మైలేజీ ఇవ్వబోతోన్న Maruti Fronx!

Maruti Fronx: మారుతి సుజికి కార్లకి మంచి ప్రేక్షకాదరణ ఉంది. మధ్యతరగతి ప్రజలకు మారుతీ సుజుకి కార్లు బడ్జెట్ ధరకే అందుబాటులో ఉంటాయి. హైబ్రిడ్ టెక్నాలజీతో SUV ఫ్రాంక్స్‌ మోడల్ ని విడుదల చేయడానికి మారుతి రెడీ అవుతుంది.

Maruti Fronx: మారుతి సుజికి కార్లకి మంచి ప్రేక్షకాదరణ ఉంది. మధ్యతరగతి ప్రజలకు మారుతీ సుజుకి కార్లు బడ్జెట్ ధరకే అందుబాటులో ఉంటాయి. హైబ్రిడ్ టెక్నాలజీతో SUV ఫ్రాంక్స్‌ మోడల్ ని విడుదల చేయడానికి మారుతి రెడీ అవుతుంది.

ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజికి కార్లకి మంచి ప్రేక్షకాదరణ ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు మారుతీ సుజుకి కార్లు ఓ వరం అని చెప్పాలి. ఇవి బడ్జెట్ ధరలో ఉంటాయి. పైగా సర్వీస్ సెంటర్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అధిక మైలేజ్ ఇస్తాయి. ఈ మూడు అంశాలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే చాలా మంది ఈ కార్లని కొనడానికి ఇష్టపడుతున్నారు. అందుకే మారుతి సుజుకి కార్ల అమ్మకాలు ఎప్పుడు రికార్డు స్థాయిలో ఉంటాయి. ఇదిలా ఉండగా మారుతి కంపెనీ ఇప్పుడు హైబ్రిడ్ కార్లపై దృష్టి పెడుతోంది. అందుకే ప్రస్తుతం మారుతి సుజుకి హైబ్రిడ్ టెక్నాలజీతో రాబోతోంది. ఈ టెక్నాలజీతో SUV ఫ్రాంక్స్‌ మోడల్ ని విడుదల చేయడానికి రెడీ అవుతుంది. ఇది వచ్చే ఏడాది ప్రారంభించబడుతుందట. ఈ కార్ దేశంలోనే అత్యధిక మైలేజీని ఇచ్చే కారుగా నిలుస్తుందట. ఏకంగా 37 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని సమాచారం తెలుస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో రన్ అవుతున్న మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో Z12E సిరీస్1.2 లీటర్ హైబ్రిడ్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 3 సిలిండర్‌లను కలిగి ఉంటుంది.. ఈ కార్ 1.2L K-సిరీస్ అడ్వాన్స్‌డ్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT పెట్రోల్ ఇంజన్, 1.0L పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్లో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ కలిగి ఉంటుంది. ఇది స్టార్ట్ స్టాప్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఈ కార్ CNG ఆప్షన్లో కూడా అందుబాటులో ఉంది. CNG మోడ్‌లో ఈ కార్ 28.51 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కార్ పెట్రోల్ వెర్షన్ అయితే 22.89 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారులో స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇందులో 5 మంది దాకా సౌకర్యంగా కూర్చోవచ్చు.

ఈ కారులో హెడ్‌అప్ డిస్‌ప్లే, టర్న్ బై టర్న్ నావిగేషన్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 9 ఇంచెస్ HD స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్డు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కార్ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.51 లక్షల నుండి రూ.13.04 లక్షల వరకు ఉంది. ఇక హైదరాబాద్ ఎక్స్-షోరూమ్ ధర అయితే 8.92 లక్షల నుంచి 15.95 లక్షల దాకా ఉంటుంది. అయితే ఈ కారు హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చినప్పుడు దీని ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది.

Show comments