iDreamPost
android-app
ios-app

మార్కెట్ లోకి అదిరిపోయే Lava Yuva Star స్మార్ట్ ఫోన్.. ధర 7 వేలలోపే..!

  • Published Aug 08, 2024 | 9:41 PM Updated Updated Aug 08, 2024 | 9:41 PM

Lava Yuva Star SamrtPhone Price And Specifications: భారత మార్కెట్ లోకి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ లుక్స్ పరంగా అదిరిపోయింది. ఇంక ధర చూస్తే కేవలం రూ.7 వేలలోపే ఉండటం విశేషం.

Lava Yuva Star SamrtPhone Price And Specifications: భారత మార్కెట్ లోకి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ లుక్స్ పరంగా అదిరిపోయింది. ఇంక ధర చూస్తే కేవలం రూ.7 వేలలోపే ఉండటం విశేషం.

  • Published Aug 08, 2024 | 9:41 PMUpdated Aug 08, 2024 | 9:41 PM
మార్కెట్ లోకి అదిరిపోయే Lava Yuva Star స్మార్ట్ ఫోన్.. ధర 7 వేలలోపే..!

స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు అందరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ పరిస్థితి వచ్చేసింది. మంచి ఫీచర్స్ కావాలి.. ధర మాత్రం బడ్జెట్ లోనే ఉండాలి అనుకునే వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మన ఇండియన్ మార్కెట్ లో ప్రీమియం ఫోన్లకంటే బడ్జెట్ ఫోన్లకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కంపెనీ లావా ఒక అదిరిపోయే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని ఇండియాలో లాంఛ్ చేసింది. అది కూడా అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఫోన్ కేవలం రూ.7 వేల కంటే తక్కువకే రావడం విశేషం. చాలామంది ఇంట్లో పెద్ద వాళ్లకు ఒక స్మార్ట్ ఫోన్ కొనివ్వాలి అనుకుంటారు. అలాంటి వారికి ఇది బెస్ట్ ఛాయిస్ కూడా అవుతుంది.

లావా కంపెనీ ఫీచర్ ఫోన్లు ఉన్నప్పుడు ఇండియాలో లీడింగ్ బ్రాండ్ అని అందరికీ తెలిసిందే. కానీ, ఎప్పుడైతే స్మార్ట్ పోన్స్ స్టార్ట్ అయ్యాయో అప్పుడు రేసులో కాస్త వెనుకబడిపోయింది. కానీ, ఇప్పుడు మాత్రం లావా బ్రాండ్ నుంచి ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అదే లావా యువ స్టార్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ కేవలం 4జీ నెట్ వర్క్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.6,499గా కంపెనీ నిర్ణయించింది. ఇది కేవలం ఒకే ఒక్క వేరియంట్లో అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్+ 6 జీబీ స్టోరేజ్ వేరియంట్ ని మాత్రమే తీసుకొచ్చారు. ఈ లావా యువ స్టార్ స్మార్ట్ ఫోన్ 6.75 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఇందులో UniSoc 9863A ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14గో ఓఎస్తో పనిచేస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. 13 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 5 ఎంపీ కెమెరా అమర్చారు. ఇంక అన్నీ స్మార్ట్ ఫోన్స్ తరహాలోనే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి 10 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ధరకు.. చెప్పిన ఫీచర్స్ కు కచ్చితంగా పైసా వసూల్ అనే చెప్పాలి. అలాగే లుక్స్ పరంగా ఈ పోన్ కి మంచి మార్కులు పడతాయి. ఈ ఫోన్ యూత్ కి కాకపోయినా.. ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు సరిగ్గా సరిపోతుంది. వారికి సోషల్ మీడియా, వాట్సాప్, వీడియో కాల్స్ కోసం ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటే బడ్జెట్ ధరలో ఇది బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఎంపిక అవుతుంది. మరి.. లావా యువ స్టార్ స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom