iDreamPost
android-app
ios-app

లక్షలోపే అదిరిపోయే EV.. ఒక్క ఛార్జ్ తో 100కు పైగా కిలోమీటర్ల రేంజ్..!

Kinetic Green Zulu Price And Specifications: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. అందరూ సిటీల్లో ఈవీలను కొనేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు మార్కెట్లో ఒక బడ్జెట్ ఈవీ విడుదల అయ్యింది.

Kinetic Green Zulu Price And Specifications: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. అందరూ సిటీల్లో ఈవీలను కొనేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు మార్కెట్లో ఒక బడ్జెట్ ఈవీ విడుదల అయ్యింది.

లక్షలోపే అదిరిపోయే EV.. ఒక్క ఛార్జ్ తో 100కు పైగా కిలోమీటర్ల రేంజ్..!

ప్రస్తుతం అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. పెట్రోలు ధరలు ఎక్కువగా ఉండటం, పెట్రోలు వాహనాలు వల్ల పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది కాబట్టి ఈవీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు పెట్రోలు బైకులు కూడా ధరలు లక్షకు పైగా ఉంటున్నాయి. ఇంక ఈవీల ధరలు అయితే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి తరుణంలో మార్కెట్ లోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. అదికూడా రూ.లక్షలోపు ధరతోనే రావడం విశేషం. మరి.. ఆ బైక్ ఏది? దాని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం.

ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో కెనెటిక్ గ్రీన్ కంపెనీకి మంచి పేరే ఉంది. వారి నుంచి టీవీలర్స్ మాత్రమే కాకుండా.. 3 వీలర్స్, ఎలక్ట్రిక్ బగ్గీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి 3 రకాల ఎలక్ట్రిక్ స్కూటీలో మార్కెట్లో ఉన్నాయి. వాటికి అదనంగా ఇప్పుడు మరో మోడల్ ని కెనటిక్ గ్రీన్ కంపెనీ లాంఛ్ చేసింది. అది కూడా కేవలం రూ.లక్షలోపు ధరతోనే తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్లు రిలీజ్ చేసిన మోడల్ పేరు కెనెటిక్ గ్రీన్ జులు. ఈ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర ఫేమ్ టూ సబ్సిడీ పోయిన తర్వాత రూ.95 వేలుగా ప్రకటించారు. లుక్స్ పరంగా కూడా ఈ జులు మోడల్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. యాప్రాన్ మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఉంటుంది.

లుక్స్ కూడా అటు ఫ్యామిలీ, ఇటు స్పోర్ట్స్ బైక్ ని మిక్స్ చేస్తూ డిజైన్ చేశారు. ఈ బైక్ బ్యాటరీ విషయానికి వస్తే.. 2.27 కిలో వాట్ పర్ అవర్ కెపాసిటీ లీథియమ్ ఇయాన్ బ్యాటరీతో వస్తోంది. 2.8 బీహెచ్పీ పీక్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బ్యాటరీ ఛార్జ్ కూడా ఈవీలో ఒక రెవల్యూషన్ అవుతంది. 15 యాంప్ సాకెట్ తో మీరు కేవలం అరగంటలోనే 80 శాతం బ్యాటరీని ఛార్చ్ చేయచ్చు. ఇది సింగిల్ ఛార్జ్ తో 104 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ 60 కిలీమీటర్లుగా ఉంది. నిజానికి ఇది తక్కువ అని భావన కలగచ్చు. కానీ, సిటీల్లో మీరు 50 కిలోమీటర్ల కంటే కూడా ఎక్కువ ప్రయాణించలేరు.

ఈ జులు డైమెన్షన్స్ కూడా ఆకట్టుకుంటున్నారు. ఇది 1,830mm పొడవు, 715mm వెడల్పు, 1,135mm ఎత్తుతో వస్తోంది. ఇంక దీని వీల్ బేస్ కూడా 1,360mmతో వస్తోంది. దీనికి మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. 160mm గ్రౌండ్ క్లియరెన్స్ తో ఈ కెనెటిక్ గ్రీన్ జులు ఎలక్ట్రిక్ స్కూటీ వస్తోంది. ఈ బైక్ గరిష్టంగా 150 కిలోల వరకు క్యారీ చేయగలదు. ఈ బైక్ ని పూర్తిగా ఇండియాలోనే తయారు చేస్తున్నట్లు ఆ సంస్థ తెలియజేస్తోంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే జింగ్ హెచ్ఎస్ఎస్, జింగ్, ఫ్లెక్స్, జూమ్ అనే మోడల్స్ ఉన్నాయి. అలాగే 3 వీలర్స్ లో ప్యాసెంజర్ ఆటోలు, క్యాబిన్ ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్ బగ్గీలు కూడా విక్రయిస్తున్నారు. మరి.. ఈ కెనెటిక్ గ్రీన్ కంపెనీ లాంఛ్ చేసిన జులు అనే ఎలక్ట్రిక్ స్కూటర్  గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.