‘థ్రెడ్స్’ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. సాంకేతిక రంగంలో మరో విప్లవం. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కు పోటీగా.. మెటా ఇప్పుడు కొత్త ‘థ్రెడ్స్’ ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. థ్రెడ్స్ అందుబాటులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే మిలియన్ల మంది యూజర్లు దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. కేవలం 2 గంటల్లోనే 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. సాధారణ పౌరులే కాకుండా.. సెలబ్రిటీలు సైతం ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోలు సైతం ఒక్కొక్కరిగా ఈ థ్రెడ్స్ యాప్ లో చేరుతున్నారు. మరి వారిలో ఈ యాప్ లోకి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
థ్రెడ్స్.. సాంకేతిక ప్రపంచంలో ఇప్పుడు ఇదొక సంచలనం. ఈ యాప్ తీసుకొచ్చిన కొన్ని గంటల్లోనే ట్విట్టర్ ను షేక్ చేసింది. కేవలం నాలుగు గంటల్లోనే 50 లక్షల మంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నట్లు మెటా సంస్థ సీఈఓ జూకర్ బర్గ్ అధికారికంగా ప్రకటించాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే? అతడు సుమారు 11 సంవత్సరాల తర్వాత ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ ఎలాన్ మస్క్ ను ఉద్దేశించే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ థ్రెడ్స్ యాప్ లోకి ఒక్కొక్కరుగా టాలీవుడ్ హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ థ్రెడ్స్ యాప్ లో చేరి ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు.
అయితే రామ్ చరణ్ కంటే ముందుగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ లో చేరి.. ఈ యాప్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి టాలీవుడ్ హీరోగా నిలిచాడు. దాంతో ఫ్యాన్స్ కూడా వారిని ఫాలో అవుతూ.. పెద్ద ఎత్తున ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దాంతో అతి తక్కువ టైమ్ లోనే మిలియన్ల కొద్ది డౌన్లోడ్స్ నమోదు అవుతున్నాయి. ఇక ఈ థ్రెడ్స్ యాప్ పై తన లాయర్ ద్వారా కేసు వేశాడు ఎలాన్ మస్క్. తన మేథో సంపత్తిని జూకర్ బర్గ్ కాపీ కొట్టాడని కేసు వేశాడు. అలాగే ట్విట్టర్ లో పనిచేసిన మాజీ సీఈఓలను తన కంపెనీలో చేర్చుకుని, కంపెనీకి సంబంధించిన రహస్యాలను తెలుసుకుంటున్నాడని ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు మస్క్.