Jio: చైనాను మడతపెట్టి.. వరల్డ్‌ నంబర్‌ వన్‌గా జియో!

Jio, China Mobile: ఇండియాలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన జియో.. ఇప్పుడు చైనాను కూడా వెనక్కి తోసేసింది. తాజా నివేదికల ప్రకారం జియో సాధించిన రికార్డు గురించి వివరంగా తెలుసుకుందాం..

Jio, China Mobile: ఇండియాలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన జియో.. ఇప్పుడు చైనాను కూడా వెనక్కి తోసేసింది. తాజా నివేదికల ప్రకారం జియో సాధించిన రికార్డు గురించి వివరంగా తెలుసుకుందాం..

ఇండియా టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జియో దెబ్బకు కొన్ని కంపెనీలే మూతపడ్డాయి. ప్రారంభంలో కస్టమర్లకు ఉచితంగా సేవలు అందించిన జియో.. తన మార్కెట్‌ను భారీగా విస్తరించుకుంది. జియో ధాటికి తట్టుకోలేక చాలా కంపెనీలు ఇండియాలో తన కార్యకలాపాలను నిలిపివేశాయి. ఎయిర్‌ టెల్‌ ఒక్కటే జియోను తట్టుకుని నిలబడిందని చెప్పవచ్చు. విదేశీ కంపెనీ అయిన ఒడాఫోన్‌ సైతం జియో నుంచి పోటీని తట్టుకోలేక.. ఐడియా కంపెనీతో మెర్చ్‌ అయింది. అయితే.. ఇప్పుడు జియో తన సత్తాను మరింత చాటింది. ఏకంగా చైనాను మడతబెట్టేసింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌ ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఎవరు వాడుతున్నారు. ఏ కంపెనీ మొబైల్‌ ఇంటర్నెట్‌ను, డేటాను కస్టమర్లు ఎక్కువ యూజ్‌ చేస్తున్నారు లాంటి విషయాలను టెఫిషీయంట్‌ అనే లెక్కిస్తూ ఉంటుంది. అయితే.. తాజాగా ఈ టెఫిషీయంట్‌ అనే కంపెనీ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌లో జియో ఏకంగా చైనా టెలికాం కంపెనీ.. చైనా మొబైల్‌ను దాటేసింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. జియో కంపెనీకి చెందిన మొబైల్‌ డేటానే కస్టమర్లు ఎక్కువ వాడుతున్నారు. గతంలో చైనా మొబైల్‌ అనే కంపెనీ ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉండేది. కానీ, జియో ఇప్పుడు దాన్ని దాటేసింది.

చైనా మొబైల్‌ సిమ్‌ యూజ్‌ చేస్తూ.. ఆ కంపెనీ కస్టమర్లు ఎక్కువ డేటా వినియోగించే వారు. కానీ, ఇప్పుడు జియో టాప్‌ ప్లేస్‌లోకి వెళ్లింది. జియో సిమ్‌ వాడుతున్న మొబైల్‌ యూజర్లు అత్యధిక డేటాను వాడి రికార్లు క్రికెట్‌ చేశారు. 2016 తొలి క్వార్డర్‌ నుంచి.. 2024 తొలి క్వార్డర్‌ వరకు చూసుకుంటే.. జియో టాప్‌ ప్లేస్‌లో ఉంది. తర్వాత చైనా మొబైల్‌ ఉంది. అలాగే చైనా టెలికామ్‌ అనే కంపెనీ మూడో స్థానంలో, మన ఎయిర్‌ టెల్‌ నాలుగో స్థానంలో, చైనా యూనికామ్‌ ఐదో స్థానంలో, వీఐ(ఒడాఫోన్‌, ఐడియా) ఆరోస్థానంలో నిలిచాయి. ఇండియా, చైనా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలు కావడంతో ఈ దేశాల్లో ఉండే టెలికామ్‌ సంస్థ యూజర్లే ఎక్కువ డేటాను వినియోగిస్తుంటారు. మరి జియో సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments