iDreamPost
android-app
ios-app

త్వరలో మార్కెట్‌లోకి జీయో 5జీ ఫోన్‌.. మరి ఇంత తక్కువ ధరకా?

  • Published Feb 28, 2024 | 6:54 PM Updated Updated Feb 28, 2024 | 6:54 PM

మార్కెట్ లోని అతి త్వరలో జీయో 5జీ ఫోన్స్ అనేవి అతి తక్కువ ధరకే అందుబాటులోకి రావాడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక వాటి ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు.

మార్కెట్ లోని అతి త్వరలో జీయో 5జీ ఫోన్స్ అనేవి అతి తక్కువ ధరకే అందుబాటులోకి రావాడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక వాటి ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Feb 28, 2024 | 6:54 PMUpdated Feb 28, 2024 | 6:54 PM
త్వరలో మార్కెట్‌లోకి జీయో 5జీ ఫోన్‌.. మరి ఇంత తక్కువ ధరకా?

ఈ మధ్యకాలంలోని మార్కెట్ లో రకరకాల సంస్థలు కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ అనేవి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక వాటి ధరలు కూడా కస్టమర్లకు ఆకర్షణీయంగా ఉండటంతో మార్కెట్ లోని వాటి డిమాండ్ మరింత పెరిగిపోతున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ కొనుగోలు విషయానికి వచ్చినప్పుడు కస్టమర్లు ఎప్పటికప్పుడు కొత్తదనాని కోరుకుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్ లో ఇప్పుడు 5జీ నెట్‌వర్క్‌, బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తున్నారు. ఇక వీటిని కొనుగులు చేయడానికి కస్టమర్లు ఎప్పుడు ముందంజులో ఉంటారు. మరి ఇలాంటి అత్యున్నత సేవలతో పాటు బెస్ట్ ఫీచర్లను అందించడానికి  జియో స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ ధరకే అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉంది.

దేశంలో మరికొన్ని రోజుల్లో 5జీ నెట్‌వర్క్‌ కలిగిన స్మార్ట్ ఫోన్స్ అనేవి అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక టెలికం కంపెనీలు ఈ 5జీ సేవలతో కూడిన స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. క్వాల్కమ్, రిలయన్స్ జియోతో కలిసి భారతీయ మార్కెట్ కోసం కొత్త 5G-స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయడానికి కృషి చేస్తున్నట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.అయితే, దేశంలో 2G వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందరిని ఈ 5G నెట్‌వర్క్‌కి మార్చాలని క్వాల్కమ్, జియో తో కలిసి పనిచేయాలని ఆలోచనలో ఉంది. మరి, ఇలాంటి సమయంలో యుఎస్ ఆధారిత చిప్‌మేకర్ మన దేశంలో ఎంట్రీ-లెవల్ 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి కొత్త చిప్‌సెట్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిసింది.

అయితే క్వాల్కమ్ ఎంట్రీ లెవల్ 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి జియోతో భాగస్వామి అవుతుంది, దీని ధర రూ. 10,000 కంటే తక్కువగా ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా 2024 చివరి నాటికి ఈ 5G మొబైల్ ని అతి తక్కువ ధరకే అందించబోతుంది. కాగా, ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేయడానికి క్వాల్కమ్ సంస్థ వివిధ OEM లతో (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మేకర్స్) కలిసి పని చేస్తోంది. దీనితో పాటు జియో తన నెట్‌వర్క్‌తో అందించే 5G స్టాండ్‌లోన్ ఆర్కిటెక్చర్‌కు స్మార్ట్‌ఫోన్ మద్దతు ఇస్తుందని తెలుస్తోంది.

ఇక ఈ విషయం పై క్వాల్కామ్ ఎస్ వీపీ, హ్యాండ్ సెట్స్ జనరల్ మేనేజర్ క్రిస్ పాట్రిక్ మాట్లాడుతూ.. అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న వినియోగాదారులకు పూర్తి 5G అనుభవాన్ని ఇవ్వాలని చూస్తున్నమని, ఈ క్రమంలోనే.. మేము 4జీ నుంచి 5జీ మార్పుపై చాలా ఎక్కువ దృష్టి పెడుతున్నామని ఆయన వెల్లడించారు. కాగా, భారతదేశంలో 2జీ వినియోగదారులు ఇక నుంచి 5జీ ఫోన్లకు మారాలని మరింతగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అలాగే చిప్ సెట్ అభివృద్ధి చేయడంలో ప్రస్తుతం భారత ఆర్ అండ్ డీ టీమ్స్ మరింత కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలా కృషి చేయడం వలన భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.8 బిలియన్ల మందికి 5G నెట్‌వర్క్‌ను తీసుకురావడానికి సహాయపడుతుంది.పైగా ఈ ఫోన్ లాంచ్ తో, భారతదేశంలో 5G వాడకం మరింత దూసుకుపోతుంది అన్నారు.

కాగా,క్వాల్కామ్ రిలయన్స్ జియో నుంచి తక్కువ ధరకే 5G స్మార్ట్‌ఫోన్‌ల ధరలను చూడటమనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ ప్రారంభ ధర రూ. 7,000. అయితే, ఈ ధర వద్ద ప్రస్తుతం ఏ ఫోన్ కూడా 5G సేవలను అందించడం లేదు. అలాంటిది రూ.8,000 కింద ఈ 5G హ్యాండ్‌సెట్‌ను తీసుకురావడం,  దేశ మార్కెట్ లో సంచలనం సృష్టించడంతో పాటు వినియోగదారులు 2G-ప్రారంభించబడిన ఫీచర్ ఫోన్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు మారడంలో సహాయపడవచ్చు. మరి,  అతి తక్కువ ధరకే త్వరలో అందుబాటులోకి రానున్న జియో 5జీ ఫోన్ లపై మీ అభిప్రాాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.