iDreamPost
android-app
ios-app

80 వేలలోపే EV.. సింగిల్ ఛార్జ్ తో 170 km రేంజ్

ఎలక్ట్రిక్ వాహన ప్రియులను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ఆటోమొబైల్ కంపెనీలు ఈవీ బైక్ లను, స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా 80 వేలలోపే మరో సరికొత్త ఈవీ లాంఛ్ అయ్యింది.

ఎలక్ట్రిక్ వాహన ప్రియులను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ఆటోమొబైల్ కంపెనీలు ఈవీ బైక్ లను, స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా 80 వేలలోపే మరో సరికొత్త ఈవీ లాంఛ్ అయ్యింది.

80 వేలలోపే EV.. సింగిల్ ఛార్జ్ తో 170 km రేంజ్

ఇటీవల వరల్డ్ వైడ్ గా ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు డిమాండ్ పెరిగిపోతున్నది. పెట్రోల్ ఖర్చులను తగ్గించుకునేందుకు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఆధునిక టెక్నాలజీతో రూపొందుతున్న ఈవీల్లో అద్భుతమైన ఫీచర్లు ఉండడంతో వాహనదారులు ఈవీల కొనుగోలుకు ప్రియారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈవీ స్కూటర్లు, బైక్ లు మార్కెట్ లో సత్తాచాటుతున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థలు వైరైటీ డిజైన్, కళ్లు చెదిరే ఫీచర్లతో ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో వాహన ప్రియులకు మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఇవోమి జీటెక్స్ జెడ్‌ఈ పేరుతో ఈవీ స్కూటర్‌ను విడుదల చేసింది.

ఈవీ స్కూటర్లకు, బైక్ లకు మంచి ఆధరణ లభిస్తోంది. సౌండ్ పొల్యూషన్ బాధ ఉండదు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు వంద కిలోమీటర్లకు పైగానే ప్రయాణించే వీలుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. ఇక తాజాగా విడుదలైన జీటెక్స్ జెడ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈవీ ప్రియులను టెంప్ట్ చేస్తోంది. జీటెక్స్ జెడ్ ఈ ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 79,999. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 2.1 కేడబ్ల్యూహెచ్, 2.5కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్. జీటెక్స్ జెడ్ ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 170 కి.మీల వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది.

ఈ స్కూటర్ నార్డో గ్రే, ఇంపీరియల్ రెడ్, అర్బన్ గ్రీన్, పెర్ల్ రోజ్, ప్రీమియం గోల్డ్, సెరూలియన్ బ్లూ, మార్నింగ్ సిల్వర్, షాడో బ్రౌన్ వంటి రి ప్రీమియం రంగులను ఎంచుకోవచ్చు.జీటెక్స్ జెడ్ ఈ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే.. క్రేజీ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్ ను పొందుపరిచారు. బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉండడం వల్ల కాల్ మాట్లాడేందుకు, మెసేజ్ నోటిఫికేషన్లను చూసుకోవచ్చు. ఇక లాంచ్ సందర్భంగా ఛాసిస్, బ్యాటరీ, పెయింట్ పై ఐదేళ్ల వారంటీని అందిస్తున్నట్లు ఇవోమీ ప్రకటించింది. ఈవీ స్కూటర్ కొనాలనే ప్లాన్ లో ఉన్నవారికి ఇవోమి జీటెక్స్ జెడ్‌ఈ స్కూటర్ బెస్ట్ అంటున్నారు మార్కెట్ నిపుణులు.