iDreamPost
android-app
ios-app

50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో బడ్జెట్ లో 5జీ స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?

  • Published May 11, 2024 | 9:59 PM Updated Updated May 11, 2024 | 9:59 PM

ఐకూ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన మోడల్స్ అన్నీ 15 వేల లోపు ఉన్నవే. తాజాగా ఐకూ కంపెనీ మరో 5జీ స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేయనుంది. దీని ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే అన్నట్టున్నాయి.

ఐకూ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన మోడల్స్ అన్నీ 15 వేల లోపు ఉన్నవే. తాజాగా ఐకూ కంపెనీ మరో 5జీ స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేయనుంది. దీని ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే అన్నట్టున్నాయి.

50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో బడ్జెట్ లో 5జీ స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?

50 ఎంపీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో బడ్జెట్ లో ఫోన్ వస్తుందంటే వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. మే 16న ఐకూ బ్రాండ్ ఫోన్ ఒకటి విడుదల కాబోతుంది. ఐకూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని కంపెనీ షేర్ చేసింది. ఫుల్ డే, ఫుల్లీ లోడెడ్ కాన్సెప్ట్ తో ఈ స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ చేయనుంది. ఫుల్లీ లోడెడ్ పెర్ఫార్మెన్స్ తో, స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో ఫాస్టెస్ట్ ఫోన్ అని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. 4 నానో మీటర్ ప్రాసెస్ టెక్నాలజీతో, 8 కోర్ సీపీయూ ఆర్కిటెక్చర్, స్నాప్ డ్రాగన్ 6త్ జెన్ 1 ఓఎస్ తో వస్తుంది. ఐకూ జడ్9ఎక్స్ స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా చాలా స్టైలిష్ లుక్ లో.. స్లిమ్ గా ఉంది.

6.72 అంగుళాల 120 హెడ్జెస్ ఫుల్ హెచ్డీ+ఎల్సీడీ డిస్ప్లేతో ఇది వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ రెండు రోజులు వస్తుంది. గేమ్స్ ఆడితే 7.9 గంటలు, వీడియోలు చూస్తే 21.26 గంటలు బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. సోషల్ మీడియా కోసం వినియోగిస్తే 30 గంటలు వస్తుందని.. కంటిన్యూగా మ్యూజిక్ వింటే 71.5 గంటల సేపు బ్యాకప్ వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే 10 గంటల సేపు వీడియోలు చేసుకోవచ్చునని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. 8 జీబీ+8 జీబీ ఎక్స్టెండెడ్ ర్యామ్ తో, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 1 టీబీ వరకూ స్టోరేజ్ ఎక్స్ ప్యాండ్ చేసుకునేలా ఫీచర్ ని ఈ ఫోన్ లో ఉంచారు.

ఐపీ64* డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ తో ఈ ఫోన్ ని తయారు చేశారు. 50 ఎంపీ ఏఐ కెమెరా, ఆండ్రాయిడ్ ఓఎస్ 14తో వస్తుంది. 2 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్ తో, 3 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్ తో వస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఐకూ నుంచి వచ్చిన స్మార్ట్ ఫాన్స్ అన్నీ 15 వేల లోపు బడ్జెట్ లో వచ్చినవే. ఇప్పుడు రాబోతున్న ఐకూ జడ్9ఎక్స్ కూడా ఇదే బడ్జెట్ లో ఉండబోతుందని తెలుస్తోంది. మే 16న విడుదలవుతున్న నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. ఇది రెండు రంగుల్లో రానుంది. సెట్ టోర్నడో గ్రీన్, స్ట్రోమ్ గ్రే కలర్స్ లో అందుబాటులోకి రానుంది.