P Venkatesh
iQOO Z9 Lite 5G: స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. బడ్జెట్ ధరలో మరో కొత్త ఫోన్ లాంఛ్ అయ్యింది. 10 వేలలోపే క్రేజీ ఫీచర్లతో కూడిని స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
iQOO Z9 Lite 5G: స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. బడ్జెట్ ధరలో మరో కొత్త ఫోన్ లాంఛ్ అయ్యింది. 10 వేలలోపే క్రేజీ ఫీచర్లతో కూడిని స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
P Venkatesh
స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడంతా 5జీ ఫోన్లనే యూజ్ చేస్తున్నారు. యూజర్ల అభిరుచులకు తగ్గట్టుగా మొబైల్ తయారీ కంపెనీలు క్రేజీ ఫీచర్లతో 5జీ ఫోన్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. 5జీ ఫోన్లకు వస్తున్న డిమాండ్ తో అన్ని కంపెనీలు 5జీ ఫోన్లను రూపొందించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి పండగే. 10 వేలలోపే దుమ్మురేపే ఫీచర్లతో 5జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఐకూ.. ఐకూ జెడ్9 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్ లో విడుదల చేసింది.
5జీ స్మార్ట్ ఫోన్లకు ధర కాస్త ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. స్మార్ట్ ఫోన్లపై ఆఫర్స్ ఉంటే బాగుండనుకుంటుంటారు. ఆఫర్లలో అయితే డిస్కౌంట్ పోను తక్కువ ధరకే సొంతం చేసుకునే వీలుంటుంది. మరి మీరు కూడా కొత్త ఫోన్ కొనాలనుకుంటే ఐకూ జెడ్9 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో స్పెషల్ లాంచ్ ఆఫర్ కింద ఈ ఫోన్ ను మీరు రూ. 9,999కే దక్కించుకోవచ్చు. ఐకూ జెడ్9 లైట్ 5జీ 4 జీబీ+ 128 జీబీ, 6 జీబీ+ 128 జీబీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసినవారికి రూ.500 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ లో జులై 20 మధ్యాహ్నం పన్నెండు నుంచి సేల్ ప్రారంభంకానున్నది. భారత్‌లో రూ.10వేల ధరల శ్రేణిలో లభిస్తోన్న అతికొన్ని 5జీ ఫోన్లలో ఇదొకటి.
ఐకూ జెడ్9 లైట్ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్ ని అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14తో వస్తోంది. ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్ రంగుల్లో లభిస్తోంది. 90హెచ్ జెడ్ రీఫ్రెష్ రేటు, 840 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.57 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 5.జీ డ్యుయల్ సిమ్ ఆప్షన్ అందించారు. ఐపీ 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ను అందించారు. వెనక ఎఫ్/1.8 అపెర్చర్‌తో కూడిన 50ఎంపీ + 2 ఎంపీ ప్రధాన కెమెరా, ముందుభాగంలో 8ఎంపీతో సెల్ఫీ కెమెరా అందించారు. వైఫై 5, బ్లూటూత్ 5.4, టైప్- సి యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.