iDreamPost
android-app
ios-app

అడ్వాన్డ్స్ ఫీచర్లతో.. భారత్ లో రిలీజ్ అయిన iPhone 16.. ధర ఎంతంటే?

  • Published Sep 10, 2024 | 11:29 AM Updated Updated Sep 10, 2024 | 11:29 AM

Apple iPhone 16: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఆపిల్ నుంచి ఐఫోన్ 16 భారత్ తో సహా ప్రపంచ మార్కెట్ లో రిలీజ్ అయ్యింది. కిర్రాక్ ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది. ఐఫోన్ 16 ధరలు ఎలా ఉన్నాయంటే?

Apple iPhone 16: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఆపిల్ నుంచి ఐఫోన్ 16 భారత్ తో సహా ప్రపంచ మార్కెట్ లో రిలీజ్ అయ్యింది. కిర్రాక్ ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది. ఐఫోన్ 16 ధరలు ఎలా ఉన్నాయంటే?

అడ్వాన్డ్స్ ఫీచర్లతో.. భారత్ లో రిలీజ్ అయిన iPhone 16.. ధర ఎంతంటే?

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆపిల్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఆపిల్ నుంచి విడుదలయ్యే ఐఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. ధర ఎక్కువైనా సరే కొనేందుకు వెనకాడరు టెక్ ప్రియులు. కొంటే ఐఫోన్ మాత్రమే కొనాలి అని అనుకునే వారు కూడా బోలెడుమంది ఉంటారు. క్వాలిటీ, సెక్యూరిటీ ఫీచర్లు, అద్భుతమైన పనితీరు కారణంగా ఐఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్డ్స్ ఫీచర్లు కలిగిన ఐఫోన్లకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆపిల్ నుంచి ఇప్పటికే 15 సిరీస్ లు రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ సేల్స్ తో దుమ్మురేపాయి. ఇక ఇప్పుడు ఆపిల్ లవర్స్ ఐఫోన్ 16 కోసం చూస్తున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. తాజాగా ఆపిల్ కంపెనీ ఐఫోన్ 16 సిరీస్ ను భారత్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ ప్రో, ప్రో మాక్స్ లను భారత్ సహా ప్రపంచ మార్కెట్ లో రిలీజ్ చేసింది. మరి వీటి ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

స్పెసిఫికేషన్‌లు:

ఆపిల్ ఐఫోన్ 16 అనేక అప్ గ్రేడ్ లతో వచ్చాయి. ప్రీ-బుకింగ్ సెప్టెంబర్ 10 నుండి ఆపిల్‌ వెబ్‌సైట్‌లో, భారతదేశంలోని ఆపిల్‌స్టోర్‌లలో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు మొత్తం అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను అందించింది. ఆపిల్ స్టాండర్డ్ మోడల్‌లకు యాక్షన్ బటన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 16ఎంపీ, 18ఎంపీ కెమెరాలను కలిగి ఉంటాయి. దీనితో పాటు, ఈ రెండు ఐఫోన్‌లు ఇంటెలిజెన్స్ కంట్రోల్ కెమెరా ఫీచర్‌ను కలిగి ఉంటాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ లలో కూడా శాటిలైట్ ఫీచర్‌ను అందించారు.

ధరలు:

యాపిల్ ఐఫోన్ 16 ధరల విషయానికి వస్తే.. ఐఫోన్‌-16 128జీబీ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.79,900. 512జీబీ వేరియంట్‌ ధర రూ.1,09,900, ఐఫోన్‌-16 ప్లస్‌ 128జీబీ వేరియంట్‌ ధర రూ.89,900 ఉండగా, 256జీబీ ధర రూ.99,900 ఉండనుంది. అలాగే 512 వేరియంట్‌ ధర రూ.1,19,900 ఉండగా, ఐఫోన్‌ 16 ప్రో 128జీబీ ధర రూ.1,19,900 ఉండగా, 1టీబీ వరకు ఉన్న ఈ ఫోన్‌ ధర రూ.1,69,900 ఉంది. ఇక ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ 256 జీబీ వేరియంట్‌ ధర రూ.1,44,900 ఉంది.

అమెరికా, దుబాయ్, భారత్ లో ఐఫోన్ సిరీస్ ధరలు:

భారత్ లో:

  • ఐఫోన్ 16 ధర రూ. 79,900
  • ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900
  • ఐఫోన్ 16 ప్రో ధర రూ. 1,19,900
  • ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర రూ. 1,44,900

దుబాయ్ లో:

  • ఐఫోన్ 16 ధర రూ. 77693
  • ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 86836
  • ఐఫోన్ 16 ప్రో ధర రూ. 98265
  • ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర రూ. 116550

అమెరికాలో:

  • ఐఫోన్ 16 ధర రూ. 67087
  • ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 75485
  • ఐఫోన్ 16 ప్రో ధర రూ. 83880
  • ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర రూ. 1,00673