iDreamPost
android-app
ios-app

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక విమానంలో మాదిరిగా కొత్త సదుపాయం!

  • Published Apr 22, 2024 | 3:02 PM Updated Updated Apr 22, 2024 | 3:02 PM

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన తరుచు రైలు ప్రమాదాలు అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు పొగొట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర రైల్వే శాఖ వాటిని పరిష్కారించేందుకు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇంతకి అందేమిటంటే..

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన తరుచు రైలు ప్రమాదాలు అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు పొగొట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర రైల్వే శాఖ వాటిని పరిష్కారించేందుకు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇంతకి అందేమిటంటే..

  • Published Apr 22, 2024 | 3:02 PMUpdated Apr 22, 2024 | 3:02 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక విమానంలో మాదిరిగా కొత్త  సదుపాయం!

ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన తరుచు రైలు ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గత ఏడాది ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అనేది యావత్ దేశాన్ని కుదిపేసింది. కాగా, ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటన తర్వాత మళ్లీ విజయనగరం జిల్లా వద్ద కూడా రైలు ప్రమాదం చోటు చేసుకోగా.. ఈ ఘటనలో కొంతమంది ప్రాణాలు పొగొట్టుకోగా, మరి కొందరు గాయలతో బయటపడిన విషయం విధితమే.. ఇక అడుగడుగున జరుగుతున్న ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకున్న భారతీయ రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై ఆ ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించే సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన తరుచు రైలు ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు పొగొట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర రైల్వే శాఖ వాటిని పరిష్కారించేందుకు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇంతకి అందేమిటంటే.. తరుచు ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్న రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించేందుకు.. విమానంలో మాదిరిగా రైల్‌ లోనూ బ్లాక్‌ బాక్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాగా, ఇకపై ఎక్కడైనా ప్రమాదం జరిగితే.. అసలు ఆ ప్రమాదానికి కారణమేమిటి..? అలాగే ప్రమాదం జరిగినప్పుడు అసలేం జరిగింది..? అనే కచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు రైళ్లలో కూడా క్రూ వాయిస్ వీడియో రికార్డింగ్ సిస్టమ్ (సీవీవీఆర్ఎస్) ను ఏర్పాటు చేయనున్నట్లు ఇండియన్ రైల్వే తాజాగా ప్రకటించింది. అయితే త్వరలోనే రైలులోని ఇంజిన్లలో ఈ బ్లాక్ బాక్స్‌ లను ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

అయితే ఈ బ్లాక్ బాక్స్‌ ‌ను రైళ్లలో పెడితే ఉపయోగం ఏమిటంటే.. రైలు ఇంజిన్ లో బ్లాక్ బాక్స్ అమర్చడం వలన అది ప్రమాదానికి ముందు జరిగే పొరపాట్లు, రైలు ప్రయాణించే మార్గానికి సంబంధించిన లోపాలపై ఎప్పటికప్పుడు లోకో పైలట్‌ ను అలర్ట్ చేస్తుంది. దీని వలన ప్రమాదాలు జరిగడం తగ్గడమే కాకుండా.. ప్రయాణికుల భద్రతకు ముప్పు లేకుండా ఉంటుంది.  ఇక ప్రస్తుతం బ్లాక్ బాక్స్ అమర్చే అంశంపై  రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా, త్వరలోనే దీనిని రైళ్లలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

అసలు ఇంతకి ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటంటే..?

ఈ బ్లాక్ బాక్స్ అనేది విమానాల్లో  ఉంటుంది. అలాగే విమానాల్లో  ప్రమాదాలు జరిగినప్పుడు  ఈ బ్లాక్ బాక్స్ గురించే చర్చ జరుగుతుంది. తద్వారా అసలేం జరిగిందో అనేది తెలిసి పోతుంది. అందుకే ఈ విధానాన్ని రైళ్లలో కూడా ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించారు. అయితే, విమానంలో ఉన్న బ్లాక్ బాక్స్‌ ను అప్‌గ్రేడ్ చేసి రైళ్లలో ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ బ్లాక్ బాక్స్ అనేది లోకో పైలట్‌ల మాటలు, రైలు కార్య కలాపాల వీడియో, ఆడియోను రికార్డ్ చేస్తుంది. అలాగే ఇది రైలు గమనాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. అలాగే వేగం, బ్రేక్స్, ఇంజిన్ స్థితి సహా పలు కీలక అంశాలను గమనిస్తుంది. ఈ కారణంగా బ్లాక్ బాక్స్‌ లను రైళ్లలో ఏర్పాటు చేయడం వలన ప్రమాదాలు దాదాపుగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇక బ్లాక్ బాక్స్‌తో పాటు.. రైళ్లలో సీసీ కెమెరా లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి రైల్ ఇంజిన్‌ లో 4 డిజిటల్ కెమెరా లను ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఈ కెమెరాల్లో రెండు కెమెరాలు అనేవి ట్రైన్ లోకో పైలట్స్‌ కదలికలను ఫోకస్ చేస్తే.. మరొకటి ఇంజిన్ బయట ట్రాక్‌ కు ఎదురుగా ఉండి, ట్రాక్‌ ను ఫోకస్ చేస్తుంది.  అయితే నాలుగో కెమెరాను ఇంజిన్ పై భాగంలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద నార్త్ ఈస్టర్న్ రైల్వే ఇంజిన్‌ లలో ఈ బ్లాక్ బాక్స్‌ ను ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఎనిమిది ఇంజిన్లలో ఈ బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేశామని..  త్వరలోనే మరిన్ని రైల్వే ఇంజిన్లకు కూడా ఈ వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.  మరి, రైలు ప్రమాదాల ముప్పును నివారించేందుకు రైల్వే శాక అమలు చేస్తున్నా బ్లాక్ బాక్స్ సిస్టమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet