iDreamPost
android-app
ios-app

అమ్మాయిలను వెంటాడుతున్న సీక్రెట్ కెమెరా భయం! గుర్తించడం ఎలా?

  • Published Aug 30, 2024 | 1:44 PM Updated Updated Aug 31, 2024 | 11:23 AM

Secret Camera: అమ్మాయిలని ప్రస్తుతం వెంటాడుతున్న భయం సీక్రెట్ కెమెరా. బయటకి వెళ్ళాక ఎక్కడ ఏ సీక్రెట్ కెమెరా ఉంటుందో చెప్పలేం. ప్రైవేట్ ఏరియాల్లో కూడా సీక్రెట్ కెమెరాలు దర్శనం ఇస్తున్నాయి. ఇలాంటి కెమెరాల వలన అమ్మాయిలు ఎక్కడికి వెళ్లిన భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.

Secret Camera: అమ్మాయిలని ప్రస్తుతం వెంటాడుతున్న భయం సీక్రెట్ కెమెరా. బయటకి వెళ్ళాక ఎక్కడ ఏ సీక్రెట్ కెమెరా ఉంటుందో చెప్పలేం. ప్రైవేట్ ఏరియాల్లో కూడా సీక్రెట్ కెమెరాలు దర్శనం ఇస్తున్నాయి. ఇలాంటి కెమెరాల వలన అమ్మాయిలు ఎక్కడికి వెళ్లిన భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.

అమ్మాయిలను వెంటాడుతున్న సీక్రెట్ కెమెరా భయం! గుర్తించడం ఎలా?

ప్రస్తుతం అమ్మాయిల అందరిని వెంటాడుతున్న భయం సీక్రెట్ కెమెరా. ఇంట్లో నుంచి బయటకి వెళ్ళాక ఎక్కడ ఏ సీక్రెట్ కెమెరా ఉంటుందో చెప్పలేం. బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతి నిమిషం కూడా అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. షాపింగ్ మాల్స్, హోటళ్లు, స్కూల్స్, కాలేజీ హాస్టల్స్ .. ఇలా ఎక్కడ ఏ కెమెరా ఉంటుందో చెప్పలేం. ముఖ్యంగా బెడ్ రూమ్, బాత్రూం వంటి ప్రైవేట్ ఏరియాల్లో కూడా సీక్రెట్ కెమెరాలు దర్శనం ఇస్తున్నాయి. ఇలాంటి కెమెరాల వలన అమ్మాయిలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడికి వెళ్లిన భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని హోటల్స్, కాలేజీ హాస్టల్స్, షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ బాత్ రూమ్, ట్రైల్ రూంలలో కంటికి కనిపించకుండా ఇలాంటి కెమెరాలు ఉంటాయి. కాబట్టి కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇలాంటి కెమెరాలని గుర్తించాలంటే ఇప్పుడు చెప్పే టిప్స్ పాటించండి. మీ ప్రైవసీని కాపాడుకోండి.

చాలా మంది అమ్మాయిలు టూర్ల కోసం, ఆఫీస్ పని మీదా లేదా తమ లవర్లతో ఏకాంతంగా గడపడం కోసం బయట ప్రదేశాలకు వెళుతుంటారు. అప్పుడు కచ్చితంగా హోటల్స్ బుక్ చేసుకుంటారు. కానీ ఆ గదులు సురక్షితంగా ఉంటాయో ఉండవో తెలీవు. కాబట్టి ముందుగా.. బుక్ చేసుకున్న రూమ్ అంతా జాగ్రత్తగా చెక్ చెయ్యాలి. ఆ గదిలో లైట్లు అన్ని ఆఫ్ చేసి, స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌ లైట్ ని ఆన్ చేసి రూమ్ అంతా పరిశీలించండి. అప్పుడు మీకు సీక్రెట్ కెమెరాకి సంబంధించిన లెన్సులు కానీ, లైట్లు కానీ కనిపిస్తే అప్పుడు సీక్రెట్ కెమెరా ఉన్నట్లని అర్ధం. దాంతో వెంటనే అప్రమత్తం అవ్వండి. లేదా వాటిని గుర్తించడానికి కొన్ని స్మార్ట్ ఫోన్ యాప్స్ ఉంటాయి. వాటిని ఇన్ స్టాల్ చేసుకొని వాటి సాయంతో గుర్తించవచ్చు.

Girls must know about spy camers

గడియారాలు, వైఫై పరికరాలు, టెలిఫోన్, బాత్రూం, ఫ్యాన్స్, అలమరాలు, అద్దాలు,ఏసీలు.. ఇలా అన్ని చోట్ల జాగ్రత్తగా పరిశీలించండి. ఒకవేళ మీకు చెక్ చెయ్యడం కుదరకపోతే హోటల్ కి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బందికి లేదా మ్యానేజర్ కి చెప్పండి. వారు వచ్చి మీ ముందే గదిని పరిశీలిస్తారు. వారితో గదిలో అన్ని చోట్లా చెక్ చేయించుకోండి. అలా మీరు హోటల్ సిబ్బందితో కూడా గదిని పరిశీలించుకోవచ్చు. ఇక షాపింగ్ మాల్స్ ట్రైల్ రూంలలోకి వెళ్ళినప్పుడు అక్కడ అద్దాలను జాగ్రత్తగా చెక్ చెయ్యండి. అద్దంపై వేలు పెట్టి ప్రెస్ చేసినప్పుడు మీ వేలుకు అద్దంలో ప్రతిబింభించే వేలుకు మధ్య గ్యాప్ ఉంటే అందులో సీక్రెట్ కెమెరా లేనట్టు. ఒకవేళ గ్యాప్ లేకుండా మీ వేలు అద్దంలో వేలుకు టచ్ అయ్యిందంటే సీక్రెట్ కెమెరా ఉండే ఛాన్స్ కచ్చితంగా ఉంటుంది. అలాగే అద్దం బ్యాక్ సైడ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా చెక్ చెయ్యండి.