iDreamPost
android-app
ios-app

Gmail: మీ జిమెయిల్ సేఫ్ గా ఉందా? ఇలా తెలుసుకోండి.

  • Published Sep 02, 2024 | 1:33 PM Updated Updated Sep 02, 2024 | 1:33 PM

Gmail: చాలా మంది ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, స్నాప్ చాట్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్లని ఉపయోగిస్తూ వీటిల్లోనే గడుపుతూ మునిగి తేలుతూ ఉంటారు. కానీ జిమెయిల్ అనేది చాలా ముఖ్యమైన అకౌంట్.

Gmail: చాలా మంది ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, స్నాప్ చాట్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్లని ఉపయోగిస్తూ వీటిల్లోనే గడుపుతూ మునిగి తేలుతూ ఉంటారు. కానీ జిమెయిల్ అనేది చాలా ముఖ్యమైన అకౌంట్.

Gmail: మీ జిమెయిల్ సేఫ్ గా ఉందా? ఇలా తెలుసుకోండి.

చాలా మంది ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, స్నాప్ చాట్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్లని ఉపయోగిస్తూ ఉంటారు. నిరంతరం వీటిల్లోనే గడుపుతూ మునిగి తేలుతూ ఉంటారు. కానీ వీటన్నికంటే జిమెయిల్ అనేది చాలా ముఖ్యమైన అకౌంట్. ఎందుకంటే దీనితోనే మన ముఖ్యమైన సమాచారం ముడిపడి ఉంటుంది. మన బ్యాంక్ ఖాతా, ఆఫీస్ కి సంబంధించిన విషయాలు అన్ని వీటితోనే ముడిపడి ఉంటాయి. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే ఇమెయిల్ సర్వీస్‌ జీమెయిల్‌. మనలో చాలా మందికి కూడా జీమెయిల్ ఐడి ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. చాలా మందికి కూడా సైబర్ సేఫ్టీ, ప్రైవసీకి సంబంధించి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

జీమెయిల్ ని ఎవరైనా హ్యాక్ చేస్తే, మీ గురించి దాదాపు ప్రతి సమాచారం వారికి తెలిసిపోతుంది. దీంతో మీకు చాలా ప్రమాదం ఉంటుంది. అందుకే జీమెయిల్‌ అకౌంట్ సేఫ్టీని చాలా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ముందు ముఖ్యంగా మీ మెయిల్‌ అకౌంట్‌ను మరెవరైనా ఉపయోగిస్తున్నారో లేదో తప్పక తెలుసుకోవాలి. అయితే గూగుల్ తన వినియోగదారులకు అలాంటి సదుపాయాన్ని కల్పిస్తుంది. ఈ సదుపాయం ద్వారా మీ జీమెయిల్ ని ఎవరైనా ఉపయోగిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. దీంతో మీ జీమెయిల్ అకౌంట్ ని సేఫ్ గా ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

ముందుగా మీరు మీ మెయిల్‌ అకౌంట్ ను ఓపెన్‌ చేయాలి. ఆ తరువాత మీ ప్రొఫైల్‌ లోకి వెళ్ళాలి. అందులో గూగుల్‌ అకౌంట్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయండి. అక్కడ మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో సెక్యూరిటీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే, మీ డివైజ్‌ల ఆప్షన్‌ అక్కడ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే, మ్యానేజ్ డివైజ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. మీ మెయిల్‌ అకౌంట్ ఎక్కడ లాగిన్ అయిందో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ, మీరు మీ డివైజ్ కాకుండా ఏదైనా డివైజ్‌ను చూసినట్లయితే లేదా మీ అనుమతి లేకుండా మీ అకౌంట్ వేరే డివైజ్‌లో లాగిన్ అయి ఉంటే వెంటనే దాన్ని తొలగించండి. ఇది మీ జిమెయిల్ ని సేఫ్ గా ఉంచుతుంది. ఎప్పుడైనా కానీ మీ జీమెయిల్‌ అకౌంట్ కి స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ను పెట్టుకోండి. పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు తప్ప ఎవరికీ గుర్తు లేని కష్టమైనా పాస్ వర్డ్ పెట్టుకోవాలి. పాస్ వర్డ్ లో చిన్న అక్షరాలతో పాటు పెద్ద అక్షరాలను, సంఖ్యలు, చిహ్నాలు వంటివి కచ్చితంగా పెట్టుకోవాలి. దీంతో మీ అకౌంట్ పాస్‌వర్డ్‌ను హ్యాకర్లు బ్రేక్ చేయడం కష్టం అవుతుంది. మీ పేరుతో మీ ఫోన్ నంబర్లతో సింపుల్ గా అస్సలు క్రియేట్ చేసుకోవద్దు. 5#3@d$fG%hJ*kL ఇలాంటి పాస్ వర్డ్స్ పెట్టుకుంటే మీ అకౌంట్ హ్యాక్ కి గురవ్వదు. మరి ఈ జీమెయిల్ సేఫ్టీ టిప్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.