Tirupathi Rao
ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు స్పామ్ కాల్స్, మెసేజెస్ వస్తూనే ఉంటాయి. అయితే చాలామంది ఈ స్పామ్ కాల్స్ వల్ల విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు వీటిని అరికట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది.
ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు స్పామ్ కాల్స్, మెసేజెస్ వస్తూనే ఉంటాయి. అయితే చాలామంది ఈ స్పామ్ కాల్స్ వల్ల విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు వీటిని అరికట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది.
Tirupathi Rao
స్పామ్ కాల్స్.. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యే ఇది. ఉదయం లేచిన దగ్గరి నుంచి మనకు కావాల్సిన ఫోన్లు, మెసేజ్ ల కంటే కూడా ఈ స్పామ్ కాల్సే ఎక్కువగా వస్తాయి. సార్ మీకు క్రెడిట్ కార్డు ఆఫర్ ఉంది. సార్ మీ పేరు మీద రూ.50 వేలు పర్సనల్ లోన్ ఉంది. సార్ మా కారు ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇలా ఒకటి కాదు రెండు కాదు తెల్లారిన దగ్గరి నుంచి నిద్రపోయే దాకా నాన్ స్టాప్ గా ఇదే మ్యూజిక్. ఒక్క భారతీయుడికి సగటున రోజులో 12 వరకు స్పామ్ మెసేజెస్ వస్తున్నాయని నివేదికలు కూడా ఉన్నాయి. అయితే వీటిని ఎలా ఆపాలి అంటూ అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ట్రాయ్ అందుకు కొత్త పరిష్కారం తీసుకొచ్చింది. నేరుగా మొబైల్ కంపెనీలకే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
స్పామ్ కాల్స్ ఎలా వస్తాయి?:
సాధారణంగా అందరికీ ఒక అనుమానం ఉంటుంది. మన నంబర్ వీళ్లకు ఎలా వెళ్లింది అని. నిజానికి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే వారికి మీ నంబర్ వివరాలు ఇస్తారు. అలాగే వారికి కాల్స్, మెసేజెస్ చేసేందుకు పర్మిషన్ కూడా ఇస్తారు. అయితే ఆ బ్యాంకుతో టైఅప్ అయిన ఒక ఇన్యూరెన్స్ కంపెనీ ఉంటుంది. వారికి కూడా ఈ డేటాకి యాక్సెస్ ఉంటుంది. వాళ్లు కూడా మీ వివరాలను వాడేస్తూ ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి మరో కంపెనీతో కనెక్షన్ ఉంటుంది. వాళ్లకి ఈ డేటా వెళ్తుంది. ఇలా మొత్తం ఒక చైన్ ప్రాసెస్ లో మీ నంబర్, వివరాలు అన్నీ ఒకరి దగ్గరి నుంచి మరొకరికి వెళ్తూ ఉంటాయి. వాళ్లు రోజూ కాల్స్ చేయడం, మెసేజ్ లు పెట్టడం చేస్తూ ఉంటారు. మీరు ఎన్ని నంబర్లు బ్లాక్ చేసినా కూడా మరో నంబర్ నుంచి మీకు కాల్స్, మెసేజెస్ వస్తూనే ఉంటాయి.
ఇప్పుడైతే కొంతమంది ట్రూకాలర్ అనే యాప్ ని వాడుతూ ఉన్నారు. అందులో స్పామ్ అని ఉంటే లిఫ్ట్ చేయడం మానేస్తున్నారు. లేదంటే స్పామ్ కాల్స్ ని అవాయిడ్ చేయమని ఆప్షన్ పెట్టుకుంటారు. అయితే వీటికి పరిష్కారాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియానే చూపించింది. నిజానికి 2023 జూన్ 2నే కొన్ని మార్గదర్శకాలను తీసుకొచ్చింది. స్పామ్ కాల్స్ విషయంలో టెలికాం సంస్థలకు షరతులు కూడా పెట్టింది. అయితే వాటిని ఖాతరు చేయలేదని ఎయిర్ టెల్, వీఐ కంపెనీలకు రూ.కోటీ జరిమానా కూడా విధించింది. తాజాగా డిజిటల్ కన్సెన్ట్ అక్విజేషన్ అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది. దీనిలో టెలికాం సంస్థలు తమ వినియోగదారుల నుంచి స్పామ్ కాల్స్, స్పామ్ మెసెజేస్ విషయంలో ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి. వాళ్లు అంగీకరించిన తర్వాతే ఫలానా కంపెనీల నుంచి వారికి మెసేజెస్, కాల్స్ వెళ్లాలి. అలా కాకుండా ఇష్టానురీతిలో స్పామ్ కాల్స్, మెసేజెస్ పంపితే టెలికాం సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఏదైతే సంస్థ మెసెజెస్ పంపాలి అనుకుంటుందో.. వాళ్లు మొదట టెలికాం సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. ఆ సంస్థ వినియోగదారుడికి ఒక మెసేజ్ పంపుతుంది. ఇలా ఒక కంపెనీ మీకు మెసేజెస్ పంపాలని అనుకుంటోంది అది మీకు అంగీకారమేనా అని అడుగుతుంది. మీరు ఓకే అని చెప్పిన తర్వాత వాళ్లు ఆ సందేశాలను మీకు పంపగలరు. అలాగే ఒకసారి.. ఒక బ్రాండ్ కు అనుమతి ఇచ్చిన తర్వాత కావాలంటే దానిని ఉపసంహరించుకునేందుకు వినియోగదారులకు వీలుండేలా చేయాలని కూడా కోరింది. అందుకు ఆన్ లైన్ పోర్టల్ తీసుకురావాలని సూచించింది. ట్రాయ్ తీసుకొచ్చిన ఈ రూల్స్ ద్వారా వినియోగదారులకు స్పామ్ కాల్స్ నుంచి కొంతైనా రక్షణ, ఉపశమనం లభించిందనే చెప్పాలి. మరి.. ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.