iDreamPost
android-app
ios-app

మిడ్ రేంజ్ ధరలో.. ట్రిపుల్ 50MP కెమెరాతో హానర్ నుంచి న్యూ స్మార్ట్ ఫోన్

Honor 200 5G: స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ హానర్.. హానర్ 200 5జీ ఫోన్ ను భారత్ లో లాంఛ్ చేసింది. దీని ధర ఎంతంటే?

Honor 200 5G: స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ హానర్.. హానర్ 200 5జీ ఫోన్ ను భారత్ లో లాంఛ్ చేసింది. దీని ధర ఎంతంటే?

మిడ్ రేంజ్ ధరలో.. ట్రిపుల్ 50MP కెమెరాతో హానర్ నుంచి న్యూ స్మార్ట్ ఫోన్

ఇటీవల మొబైల్ తయారీ కంపెనీలు వరుసపెట్టి న్యూ మొబైల్స్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. యూజర్ల అభిరుచులకు తగిన విధంగా లేటెస్ట్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లను రూపొందించి రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఇటీవల అమెజాన్ ఇండియా ప్రైమ్ డే సేల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ సందర్భంగా ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ క్రమంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ హానర్ సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్ లోకి లాంఛ్ చేసింది. ఇదివరకు గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేయగా ఇప్పుడు భారత్ లో ప్రారంభించింది. హానర్ కంపెని.. హానర్ 200 5జీ మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

మిడ్ రేంజ్ ధరలో హానర్ న్యూ 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. హానర్ 200 5జీ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభించనున్నది. 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్, 12జీబీ+512జీబీ స్టోరేజ్ తో వస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 34,999, రూ. 39,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ కు సంబంధించిన సేల్ జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో ట్రిపుల్ 50 ఎంపి స్టూడియో లెవల్ పోట్రైట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ పై అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఆఫర్లు ఉన్నాయి. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డుల ద్వారా రూ. 3 వేల వరకు రాయితీ పొందొచ్చు.

హానర్ 200 5జీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.7 అంగుళాల అమోలెడ్‌ క్వాడ్‌ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, 4 వేల నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్‌ 8.0 వర్షన్ అందించారు. 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 906 వైడ్+ 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 856 టెలిఫోటో+ 12ఎంపీ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. 100వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 5200ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. వైఫై, బ్లూటూత్‌ 5.3, ఓటీజీ, జీపీఎస్‌, ఏజీపీఎస్‌, గ్లోనాస్‌, బైడూ, గెలీలియో, యూఎస్‌బీ టైప్‌-సి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.