iDreamPost

ల్యాప్‌టాప్స్ కోసం ప్రత్యేక డివైజ్! మానిటర్, పెన్‌డ్రైవ్, ఎస్డీ కార్డ్, ఫోన్ ఛార్జింగ్ ఆప్షన్స్!

Honeywell Newly Launched 7-in-1 TypeC Docking Station: ల్యాప్ టాప్ కి ఒకేసారి 3 పెన్ డ్రైవ్ లు, ఎస్డీ కార్డు, అదనపు మానిటర్ వంటివి కనెక్ట్ చేసే డివైజ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన 7 ఇన్ వన్ టైప్ సీ డాక్ స్టేషన్ డివైజ్ మీ కోసమే. దీన్ని మీరు 7 రకాలుగా వాడుకోవచ్చు.

Honeywell Newly Launched 7-in-1 TypeC Docking Station: ల్యాప్ టాప్ కి ఒకేసారి 3 పెన్ డ్రైవ్ లు, ఎస్డీ కార్డు, అదనపు మానిటర్ వంటివి కనెక్ట్ చేసే డివైజ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన 7 ఇన్ వన్ టైప్ సీ డాక్ స్టేషన్ డివైజ్ మీ కోసమే. దీన్ని మీరు 7 రకాలుగా వాడుకోవచ్చు.

ల్యాప్‌టాప్స్ కోసం ప్రత్యేక డివైజ్! మానిటర్, పెన్‌డ్రైవ్, ఎస్డీ కార్డ్, ఫోన్ ఛార్జింగ్ ఆప్షన్స్!

ఇప్పుడొచ్చే ల్యాప్ టాప్స్ కి యూఎస్బీ పోర్ట్స్ తక్కువగా ఉంటున్నాయి. మూడు మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి వైర్ లెస్ కీబోర్డ్, వైర్ లెస్ మౌస్ కి కనెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు మౌస్, కీబోర్డ్ సెపరేట్ గా ఉంటే రెండు యూఎస్బీ పోర్ట్స్ ఉండాల్సిందే. ఇక ఉండేది ఒకే ఒక్క యూఎస్బీ పోర్ట్. పెన్ డ్రైవ్, వేరే ఏదైనా కనెక్ట్ చేయాలంటే అవ్వదు. రెండు పెన్ డ్రైవ్ లు ఒకేసారి ల్యాప్ టాప్ కి కనెక్ట్ చేయాలంటే పోర్టులు ఖాళీగా ఉండవు. ఇలాంటి సమయంలో మీరు మల్టీ యూఎస్బీ పోర్టు డివైజ్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ మైక్రో ఎస్డీ, ఎస్డీ కార్డులు ల్యాప్ టాప్ కి కనెక్ట్ చేయాలంటే కార్డ్ రీడర్ ని కొనుక్కోవాలి. ఒకవేళ మ్యాక్ బుక్ వాడుతున్నట్లైతే అదనంగా మరో మానిటర్ ని కనెక్ట్ చేయాల్సి వస్తే దాని కోసం మరో డివైజ్ కొనాల్సి ఉంటుంది. ఇన్ని డివైజ్ లు కొనే కంటే వీటన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్ చూపించే ఒకే ఒక్క డివైజ్ కొనుక్కోవడం మేలు కదా. 

ప్రత్యేకతలు:

హనీవెల్ కంపెనీకి చెందిన ‘7 ఇన్ వన్ టైప్ సీ డాకింగ్ స్టేషన్’ పేరుతో ఒక డివైజ్ వస్తుంది. ఇదొక్కటి ఉంటే 7 రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. 4కే రిజల్యూషన్ తో హెచ్డీఎంఐ కనెక్టివిటీ వస్తుంది. దీంతో మీరు అదనంగా మరొక మానిటర్ ని సులువుగా కనెక్ట్ చేసుకోవచ్చు. 3.0 యూఎస్బీ పోర్టు ఒకటి, 2.0 యూఎస్బీ పోర్టులు 2 వస్తున్నాయి. టైప్ సీ 3.0 పీడీ ఛార్జింగ్ 100 వాట్ పోర్టు ఒకటి ఉంటుంది. అలానే ఎస్డీ కార్డు స్లాట్, మైక్రో ఎస్డీ కార్డు స్లాట్స్ ఉన్నాయి. మ్యాక్ బుక్ ల్యాప్ టాప్, మ్యాక్ బుక్ మినీ పీసీ, కంప్యూటర్, థండర్ బోల్ట్ 3 సహా టైప్ సీ డివైజెస్ అన్నిటికీ ఇది బాగా యూజ్ అవుతుంది. 

One Device

అసలే మ్యాక్ బుక్ ల్యాప్ టాప్స్ కి పోర్టులు తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఈ డివైజ్ బాగా ఉపయోగపడుతుంది.  పైగా ఇది 5 జీబీపీఎస్ డేటా ట్రాన్స్ఫర్ తో వస్తుంది. ఒకే ఒక్క డివైజ్ తో మీరు 3 పెన్ డ్రైవ్ లు, ఒక ఎస్డీ కార్డు, ఒక మైక్రో ఎస్డీ కార్డు, ఒక ఎక్స్టర్నల్ మానిటర్, టైప్ సీ పోర్టుతో మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో దీని అసలు ధర రూ. 7,999 ఉంది. కానీ ఆఫర్ లో మీరు దీన్ని కేవలం రూ. 2,199 కే సొంతం చేసుకోవచ్చు. ఇందులోనే 4 ఇన్ వన్ అల్ట్రా స్లిమ్ మల్టీపోర్టు డివైజ్ ఉంది. దీని ధర రూ. 449 ఉంది. 

  • 7 ఇన్ వన్ టైప్ సీ డాకింగ్ స్టేషన్ ని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
  • 4 ఇన్ వన్ అల్ట్రా స్లిమ్ మల్టీపోర్టు డివైజ్ ని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి