iDreamPost
android-app
ios-app

యాక్టివా ఫ్యాన్స్ కు శుభవార్త.. త్వరలో విడుదల కానున్న EV స్కూటర్!

హోండా యాక్టివా ఫ్యాన్స్ కు శుభవార్త. త్వరలోనే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి హోండా కీలక అప్ డేట్ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం..

హోండా యాక్టివా ఫ్యాన్స్ కు శుభవార్త. త్వరలోనే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి హోండా కీలక అప్ డేట్ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం..

యాక్టివా ఫ్యాన్స్ కు శుభవార్త.. త్వరలో విడుదల కానున్న EV స్కూటర్!

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే హోండా కంపెనీ నుంచి తయారై అత్యంత ఆధరణ పొందిన స్కూటర్ హోండా యాక్టివా స్కూటర్. ఇప్పటికీ యాక్టివాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కాగా ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, కాలుష్యం నుంచి విముక్తి కోసం ఈవీలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని హోండా కూడా యాక్టివా స్కూటర్లలో ఎలక్ట్రిక్ వర్షన్ తెచ్చేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ఓలా దూసుకెళ్తోంది. ఓలా ఈవీ స్కూటర్ల సేల్స్ పరంగా కూడా టాప్ లో ఉంది. ఇదేగాక టీవీఎస్​ ఐక్యూబ్​, బజాజ్​ చేతక్, ఏథర్​ వంటి కంపెనీలు ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో యాక్టివా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చినట్లైతే వీటన్నింటికీ గట్టిపోటీ ఇవ్వనుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దీనికి గల కారణం కస్టమర్లకు యాక్టివా పట్ల ఉన్న ఆధరణే. ఇక ఇప్పుడు.. ఈ యాక్టివా ఈ-స్కూటర్​పై కీలక విషయం​ చెక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో 2024 జనవరి 9న.. అమెరికా లాస్​ వేగాస్​లో జరగనున్న కన్జ్యూమర్​ ఎలక్ట్రానిక్స్​ షో (సీఈఎస్​)లో హోండా యాక్టివ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని సంస్థ రివీల్​ చేస్తుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

హోండా యాక్టివా ఈవీ ఫీచర్లు

ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​ గురించి ప్రస్తుతం పూర్తి వివరాలు అందుబాటులో లేవు. బ్యాటరీ ప్యాక్​, రేంజ్​, ఫీచర్స్​తో పాటు ధరకు సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది. సమాచారం మేరకు ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఫిక్స్​డ్​ బ్యాటరీ సెటప్​ ఉంటుందట. ఈ ఈవీ టాప్​ స్పీడ్​ 50 కేఎంపీహెచ్​ అని తెలుస్తోంది. మరి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వర్షన్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న హోండా యాక్టివా ఈవీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి