iDreamPost
android-app
ios-app

Hero Vida V1 Pro: ఈ EVపై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీ.. రూ.24 వేల వరకు..!

హీరో కంపెనీకి చెందిన వీడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ.24 వేల వరకు భారీ డిస్కౌంట్స్, బెనిఫిట్స్ ని ప్రకటించారు.

హీరో కంపెనీకి చెందిన వీడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ.24 వేల వరకు భారీ డిస్కౌంట్స్, బెనిఫిట్స్ ని ప్రకటించారు.

Hero Vida V1 Pro: ఈ EVపై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీ.. రూ.24 వేల వరకు..!

విద్యుత్ వాహనాలకు ఇండియన్ మార్కెట్ లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఇప్పుడు ఈవీలను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొత్త కంపెనీలు మాత్రమే కాకుండా.. ఇప్పటికే టూవీలర్ మార్కెట్ ను ఏలుతున్న కంపెనీలు కూడా విద్యుత్ వాహనాలను తయారు చేయడం ప్రారంభించాయి. వాటిలో హీరో మోటో కార్ప్ కూడా ఒకటి. ఈ కంపెనీ నుంచి హీరో విడా వీ1 మోడలక్ చాలా మంచి డిమాండ్ ఏర్పడింది. పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు హీరో కంపెనీ కూడా తన విడా వీ1 ప్రో మోడల్ పై ఆఫర్స్ ప్రకటించింది. మరి.. ఆ ఆఫర్స్ ఏంటి? ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తోందో చూడండి.

హీరో కంపెనీ తమ విడా వీ1 ప్రో మోడల్ పై అద్భుతమైన ఆఫర్స్ ని అందిస్తోంది. ఈ వీ1 ప్రోపై అత్యధికంగా రూ24 వేల వరకు డిస్కౌంట్ బెనిఫిట్స్ ని అందిస్తోంది. అందులో రూ.2,500 క్యాష్ డిస్కౌంట్, రూ.6,600 వరకు ఈఎంఐ బెనిఫిట్స్, బ్యాటరీ వారెంటీ ఎక్స్ టెన్షన్ పై 50 శాతం డిస్కౌంట్, ఎక్స్ ఛేంజ్ బోనస్ కింద రూ.2,500 అందిస్తున్నారు. వీటికి అదనంగా వినియోగదారులకు లాయల్టీ బోనస్ కింద రూ.5 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.2,500 అందజేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా.. రూ.1,125 విలువైన సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను ఫ్రీగానే అందిస్తున్నారు. ఇంక ఈ విడా వీ1 ప్రో మోడల్ ధర విషయానికి వస్తే.. పోర్టబుల్ ఛార్జర్, ఫేమ్-2 సబ్సిడీతో కలిపి దీని ధర రూ.1.45 లక్షలుగా ఉంది. ఢిల్లీలో మాత్రం దీని ధర రూ.1.25 లక్షలుగా ఉంది.

వీ1 ప్రో స్పెసిఫికేషన్స్:

హీరో విడా వీ1 ప్రో లుక్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధంగా ఈ మోడల్ ని డిజైన్ చేశారు. ఈ వీ1 ప్రో మోడల్ 110 కిలోమీటర్ల రేంజ్ తో వస్తోంది. ఇది గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణించగలదు. ఈ బండిలో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా ఉంది. అదేంటంటే.. మీరు వెనుక సీటును తొలగించుకోవచ్చు. అంతేకాకుండా బ్యాటరీని కూడా మీరు తొలిగించి ఇంట్లోనే సౌకర్యవంతంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

ఇంక విడా వీ1 ప్రో మోడల్ ఫీచర్స్ చూస్తే.. ఇందులో టచ్ స్క్రీన్ డిస్ ప్లే కూడా ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, బ్లూటూత్, వైఫై, నావిగేషన్, 4జీ కనెక్టివిటీ, జియో ఫెన్స్, ఎమర్జెన్సీ అలర్ట్ స్విచ్ వంటి ఫీచర్స్ మీకు లభిస్తాయి. ఇందులో మీకు 26 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తోంది. ఇంక వారెంటీ విషయానికి వస్తే.. ఈ మోడల్ మీద మీకు ఐదేళ్లు లేదంటే 50 వేల కిలోమీటర్ల వరకు వెహికల్ వారెంటీ లభిస్తుంది. అలాగే బ్యాటరీ మీద మూడేళ్లు లేదంటే 30 వేల కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారెంటీ లభిస్తుంది. మీకు కావాలంటే బ్యాటరీ వారెంటీని ప్లాన్ తీసుకోవడం ద్వారా పొడిగించుకోవచ్చు. మరి.. హీరో మోటోకార్ప్ కు చెందిన విడా వీ1 ప్రో ఆఫర్స్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.