iDreamPost
android-app
ios-app

అతి తక్కువ ఖర్చుతో బుల్లెట్‌ బైక్‌ తయారుచేసిన సామాన్యుడు! టాలెంట్‌ ఎవడి సొత్తు కాదు!

  • Published Jun 21, 2024 | 3:22 PM Updated Updated Jun 21, 2024 | 3:40 PM

Bullet Bike: అతి తక్కువ ఖర్చుతో బుల్లెట్‌ బైక్‌ తయారు చేశాడు ఓ వ్యక్తి. దీని ఖరీదు కేవలం లక్ష రూపాయల లోపే ఉండటం గమనార్హం. ఆ వివరాలు..

Bullet Bike: అతి తక్కువ ఖర్చుతో బుల్లెట్‌ బైక్‌ తయారు చేశాడు ఓ వ్యక్తి. దీని ఖరీదు కేవలం లక్ష రూపాయల లోపే ఉండటం గమనార్హం. ఆ వివరాలు..

  • Published Jun 21, 2024 | 3:22 PMUpdated Jun 21, 2024 | 3:40 PM
అతి తక్కువ ఖర్చుతో బుల్లెట్‌ బైక్‌ తయారుచేసిన సామాన్యుడు! టాలెంట్‌ ఎవడి సొత్తు కాదు!

టూ వీలర్‌.. ఇప్పుడు నిత్యవసరంగా మారింది. బండి లేకపోతే బయటకు కాలు పెట్టే పరిస్థితి లేదు. ఇక నేటి కాలంలో ఇంటికో బైక్‌ అన్నట్లుగా మారింది పరిస్థితి. కుటుంబానికి ఒక టూవీలర్‌ తప్పనిసరిగా ఉంటుంది. కొందరికి అయితే మనిషికో బండి అన్నట్లుగా.. ఇంటికి 2, 3 టూవీలర్స్‌ ఉంటున్నాయి. ఇక యువత ఎక్కువగా ఇష్టపడే బైక్‌లలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ముందు వరుసలో ఉంటుంది. బైక్‌ కొనాలనుకునే యువత ఫస్ట్‌ ఛాయిస్‌ ఇదే అవుతుంది. రాయల్‌ లుక్కుతో, అదిరిపోయే ఫీచర్లతో వస్తుండటంతో.. రోజురోజుకు దీనికి క్రేజ్‌ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే ధర కూడా అలానే ఉంటుంది. 2 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయకుండా బుల్లెట్‌ బైక్‌ కొనడం దాదాపు అసాధ్యం. సెకండ్‌ హ్యాండ్‌లో తీసుకోవాలన్నా.. లక్ష రూపాయలకు పైగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఓ యువకుడు మాత్రం లక్ష రూపాయల లోపే బుల్లెట్‌ బైక్‌ను తయారు చేసి.. అందరి చేత ఔరా అనిపిస్తున్నాడు. ఆ వివరాలు..

హరియాణాకు చెందిన ఓ యువకుడు లక్ష రూపాయల లోపు వచ్చేలా.. అది ఎలక్ట్రిక్‌ బుల్లెట్‌ బైక్‌ను రూపిందించాడు. తన దగ్గర ఉన్న కొన్ని పరికరాలతో, కలపను ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్‌ బుల్లెట్‌ బైక్‌ను తయారు చేశాడు. దీని ఖరీదు 70 వేల రూపాయలు మాత్రమే కాక.. ఇది ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కావడం విశేషం. సదరు యువకుడు ఈ బైక్‌ తయారీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా తెగ వైరల్‌ అయ్యాయి. వీటికి 5.7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 2 లక్షల మందికి పైగా లైక్ చేయగా, వందలాది మంది కామెంట్స్‌ చేశారు. ఈ విజువల్స్‌ని మద్దతు ఇద్దాం అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేయడంతో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. అతడి ప్రతిభకు దేశం ఫిదా అవుతుంది. వాటే టాలెంట్‌ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

70వేల ఖర్చుతో బుల్లెట్‌..

ఇక సదరు యువకుడు ఈ బైక్ తయారీకి సుమారు రూ.70 వేలు ఖర్చు చేశాడు. కలపను ఉపయోగించి, దీని ఇంధన ట్యాంకులో సౌండ్‌ సిస్టమ్‌ని ఏర్పాటు చేశాడు. ఇది అచ్చం బుల్లెట్ లాంటి ధ్వని వస్తుంది. పైగా ఇది బ్యాటరీతో నడుస్తున్నట్లు ఎవరూ గుర్తించలేరు. సైలెన్సర్ లోపల స్పీకర్ (లౌడ్ స్పీకర్) జతచేశాడు. ఛార్జర్లు, వాటర్ బాటిల్స్, ఇతర వస్తువుల కోం సీటు దిగువన పెద్ద బూట్ స్పేస్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బుల్లెట్‌కి శక్తిని ఇచ్చేందుకు 4 బ్యాటరీలను జత చేశాడు. దీనిని సులభంగా ఛార్జింగ్ చేయడానికి ఆన్‌బోర్డ్‌ ఛార్జర్ ఆప్షన్‌ని కూడా అందుబాటులో ఉంచాడు. ఈ మోటార్ సైకిల్ తయారీకి పాత బుల్లెట్ లోని కొన్ని భాగాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో, ఫొటోలు చూసిన వారు.. సదరు యువకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది సామాన్యుడి సక్సెస్‌.. టాలెంట్‌ ఎవరి సొత్తు కాదని కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kusum Goyat (@kusum_goyat_1)