iDreamPost

మీ స్మార్ట్ ఫోన్ లో గ్రీన్ లైన్ ఎర్రర్ వచ్చిందా? ఇలా జాగ్రత్త పడండి!

Green Line Error: నేటికాలంలో ప్రతి ఒక్కరి చేతిల్లో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. అయితే వాటిల్లో వచ్చే కొన్ని ఎర్రర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐటీ నిపుణలు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్క్రీన్ పై గ్రీన్ లైన్ ఎర్రర్ వస్తే..జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

Green Line Error: నేటికాలంలో ప్రతి ఒక్కరి చేతిల్లో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. అయితే వాటిల్లో వచ్చే కొన్ని ఎర్రర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐటీ నిపుణలు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్క్రీన్ పై గ్రీన్ లైన్ ఎర్రర్ వస్తే..జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

మీ స్మార్ట్  ఫోన్ లో గ్రీన్ లైన్ ఎర్రర్ వచ్చిందా? ఇలా జాగ్రత్త పడండి!

నేటికాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అనేక రకాల మొబైల్స్ మార్కెట్ లో లభిస్తున్నాయి. తరచూ ఫోన్లలో వివిధ రకాల ఇష్యూలు వస్తుంటాయి. అలాంటి సమస్యలపై ఆయ ఫోన్ల కంపెనీలు స్పందించి..పరిష్కరిస్తుంటాయి. తాజాగా చాలా ఫోనల్లో గ్రీన్ లైన్ ఎర్రర్ ఇష్యూ ఎక్కువగా వస్తోంది. అత్యధికంగా విక్రయిస్తున్న బ్రాండ్లతో పాటు దేశీయంగా ఉత్పత్తవుతున్న విదేశీ బ్రాండ్ ఫోన్లలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. గత కొంత కాలం నుంచి ఫోన్ స్క్రీన్ మధ్యలో నిలువున గీత ఏర్పడటం వంటి సమస్యలు ఫోన్లలో ఎదురవుతున్నాయి. అయితే ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు జాగ్రత్త పడ్డాలని సాంకేతిక నిపుణలు తెలియజేస్తున్నారు. మరి.. ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

స్మార్ట్ ఫోన్ల కంపెనీలు తరచూ వాటి సాఫ్ట్ వేర్లను అప్ డేట్ చేస్తుంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ లో తలెత్తే బగ్ ఇష్యూలను క్లియర్ చేస్తుంటారు. అయితే ఇటీవల అలాంటి బగ్ సమస్యల  వల్లే డిస్ ప్లే ఎర్రర్ స్తున్నట్లు గుర్తించిన వాటిని క్లియర్ చేయలేకపోయారు. ఏడాది క్రితం తొలిసారి వన్‌ప్లస్‌ మొబైల్ లో ఈ సమస్య కనిపించింది. దీంతో సమస్య ఏర్పడిన ఫోన్లలో ఫ్రీగానే డిస్‌ప్లే రిప్లేస్‌మెంట్ చేశారు. సాఫ్ట్‌వేర్‌ ప్యాచ్‌లతో ఈ సమస్యను సరిచేసినా పూర్తిగా  క్లియర్ చేయలేకపోయారు.

ఇటీవల స్మార్ట్ ఫోన్లలో గ్రీన్ లైట్ ఎర్రర్ కనిపిస్తుంది. అలానే ఆటోమెటిక్ గా స్క్రీన్ ఆన్ అవ్వడం, అలానే డిస్ ప్లే బోర్డు పై గ్రీన్ లైట్ వెలిగి, ఆరిపోవడం జరగుతుంటాయి. అయితే ఇలాంటి టెక్నికల్ ఇష్యూతో పాటు మాల్ వేర్ చొరబడినప్పుడు కూడా జరుగుతుందని  సైబర్ సెల్ నిపుణులు ఒకరు తెలిపారు. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసే క్రమంలో వాటిలో మాల్‌ వేర్‌ చొప్పించే ప్రయత్నాలు జరిగే ఛాన్స్ లు  ఉన్నాయని సాంకేతి నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే హ్యాండ్ సెట్ ల ను రిపేర్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నరు.

రిపేర్ చేయించుకునే సమయంలో మొబైల్ లో ఉన్న డేటాను భద్రతను, వ్యక్తిగత గోప్యతను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హ్యాండ్ సెట్ లను మార్చుకునే సమయంలో సెక్యూరిటీ పాస్‌వర్డ్‌లను రిపేరింగ్ కేంద్రాల్లో చెప్పకూడదు. అలానే టెక్నిషియన్లకు మీ పాస్ వార్డులు చెప్పి ఫోన్లను అప్పగించొద్దని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హ్యాండ్ సెట్‌ను రిపేర్‌  చేయడానికి లేదా రిప్లేస్‌మెంట్ కోసం ఇవాల్సి వస్తే డేటాను పూర్తిగా బ్యాకప్ తీసుకుని రిసెట్ చేసి మాత్రమే అప్పగించాలని ఐటీ నిపుణలు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి