iDreamPost
android-app
ios-app

Google Gemini: AI మోడల్స్ లోనే అడ్వాన్స్డ్ వర్షన్.. ప్రత్యేకతలు వింటే మతిపోతుంది!

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వెనుకే పరుగులు పెడుతోంది. ఇప్పటికే చాలానే ఏఐ మోడల్స్ వచ్చాయి. ఇప్పుడు గూగుల్ మరో కొత్త తరం ఏఐ మోడల్ కి శ్రీకారం చుట్టింది.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వెనుకే పరుగులు పెడుతోంది. ఇప్పటికే చాలానే ఏఐ మోడల్స్ వచ్చాయి. ఇప్పుడు గూగుల్ మరో కొత్త తరం ఏఐ మోడల్ కి శ్రీకారం చుట్టింది.

Google Gemini: AI మోడల్స్ లోనే అడ్వాన్స్డ్ వర్షన్.. ప్రత్యేకతలు వింటే మతిపోతుంది!

ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. మైక్రోసాఫ్ట్ బింగ్ వచ్చిన కొత్తలో పెద్ద పెద్ద డిబేట్లే జరిగాయి. కానీ, ప్రజలు మళ్లీ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ని మర్చిపోయారు. ఇలాంటి తరుణంలో మల్లీ కృత్రిమ మేథను వార్తల్లోకి తీసుకొచ్చింది గూగుల్ కంపెనీ. తాము తీసుకొచ్చిన బార్డ్ ఏఐకి యూజర్ల నుంచి అంత మంచి రెస్పాన్స్ అయితే రాలేదు. కానీ, ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చిన జెమిని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మాత్రం తప్పకుండా యూజర్లను మెప్పిస్తుందని గూగుల్ కంపెనీ బలంగా చెబుతోంది. మరి.. ఈ గూగుల్ జెమినీ ఏఐ ప్రత్యేకతలేంటో చూద్దాం.

గూగుల్ జెమినీ పేరుతో మోస్ట్ అడ్వాన్డ్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ని గూగుల్ కంపెనీ ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ గూగుల్ జెమినీ 1.0 వర్షన్ లో మొత్తం 3 వేరియంట్స్ ఉన్నాయి. అవి.. జెమిని అల్ట్రా, జెమిని ప్రో, జెమిని నానో. వీటిలో చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఫొటోలు, ఆడియో, వీడియో, టెక్ట్స్, కోడింగ్ సమాచారాలను వెంటనే 90 శాతం కచ్చితత్వంతో తమ యూజర్లకు అందిస్తుందని చెబుతున్నారు. దీనిని మీరు కేవలం డేటా సెంటర్లలోనే కాదు.. మెబైల్స్ కూడా వాడుకోవచ్చు. ఇది శాస్త్రవేత్తలు, టెక్నాలజీకి సంబంధించి మాత్రమే కాదు.. పిల్లల హోంవర్క్ లో కూడా సహాయం చేయగలదంట. ఉదాహరణకు పిల్లాడి మ్యాథ్స్ హోంవర్క్ ఫొటో తీసి జెమినీలో అప్ లోడ్ చేస్తే వెంటనే అది సరైన సమాధానాన్ని సూచిస్తుంది.

అంతేకాదు.. కోడింగ్ వంటి కష్టమైన పనుల్లో కూడా గూగుల్ జెమినీ సహాయం చేయగలదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని ఎంతో ఈజీగా యూజర్లకు అర్థమయ్యే రీతిలో వివరించగలదని గూగుల్ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ గూగుల్ జెమినీ కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అన్నీ భాషల్లోకి తీసుకొస్తాని గూగుల్ వెల్లడించింది. మీరు ఈ జెమినీ ఏఐ మోడల్ ని గూగుల్ సెర్చ్ ఇంజిన్, గూగుల్ క్రోమ్ లో మాత్రమే కాకుండా.. ఇతర గూగుల్ సర్వీసుల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. జెమినీలో ఉన్న 3 మోడల్స్ లో జెమిని అల్ట్రా అనేది ఎంతో పవర్ ఫుల్ వర్షన్ అని గూగుల్ చెబుతోంది. డేటా సెంటర్లు, కార్పొరేట్ సంస్థల వ్యాపార అవసరాల కోసం జెమిని అల్ట్రా మోడల్ ని ఉపయోగించుకోవచ్చు.

జెమిని ప్రో వర్షన్ ని గూగుల్ బార్డ్ కి అడ్వాన్స్డ్ వర్షన్ గా తీసుకొస్తున్నారు. ఈ మోడల్ ఎంతో కచ్చితంగా సరైన సమాచారాన్ని అందిస్తుందని గూగుల్ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనిని డిసెంబర్ 13 నుంచి డెవలపర్స్, గూగుల్ ప్రొడక్ట్స్ కమర్షియల్ యూజర్స్ కి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంక జెమిని నానో వర్షన్ ని మొబైల్ డివైజ్ ల కోసం డిజైన్ చేశారు. గూగుల్ పిక్సల్ ఫోన్ లో మాత్రమే కాకుండా.. ఆండ్రాయిడ్ 14 వర్షన్ వారికి ఇది అందుబాటులోకి వస్తుంది. దీనిని డిసెంబర్ 13 నుంచే యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మీరు దీనిని ఆఫ్ లైన్ లో కూడా వాడుకోవచ్చు. మరి.. గూగుల్ తీసుకొస్తున్న ఈ గూగుల్ జెమిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.