iDreamPost
android-app
ios-app

ఆ యాప్స్‌ వాడొద్దు.. యూజర్లకు గూగుల్‌ పే సూచనలు!

గూగుల్ పే తమ యూజర్లుకు తాజాగా కీలక సూచలను చేసింది. అలాంటి యాప్స్ అస్సలు వాడొద్దని సూచించింది. ఇంతకు విషయం ఏంటంటే?

గూగుల్ పే తమ యూజర్లుకు తాజాగా కీలక సూచలను చేసింది. అలాంటి యాప్స్ అస్సలు వాడొద్దని సూచించింది. ఇంతకు విషయం ఏంటంటే?

ఆ యాప్స్‌ వాడొద్దు.. యూజర్లకు గూగుల్‌ పే సూచనలు!

మారిన ఈ సాంకేతిక యుగంలో అంతా స్మార్ట్ ఫోన్ లు వాడుతున్నారు. ఇటు స్కూల్ కు వెళ్లే పిల్లల నుంచి అటు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వరకు ఇలా అందరి చేతులో మొబైల్ తప్పకా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా ఏం జరిగినా… క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ లెక్కన చూసుకుంటే మాత్రం.. ప్రపంచం అరి చేతిలో ఉన్నట్టే. ఇకపోతే.. గత కొన్నేళ్ల నుంచి స్మార్ట్ ఫోన్ ఉన్న అందరూ లిక్విడ్ మనీ వాడడమే పూర్తిగా మానేశారు. ఏదో అత్యవసర సమయాల్లో తప్పా.. ఎక్కువగా డబ్బును చేతిలో పెట్టుకుని తిరగడం లేదు. చేతిలో సెల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటే చాలు.. రూపాయి అవసరం లేకుండా ఎక్కడైనా ఏదైన కొనుగోలు చేస్తున్నారు. అలా అందరూ ఫోనే పే, గూగుల్ పే, పేటీఎంతో పాటు ఆమెజాన్ వంటి ఆన్ లైన్ పేమెంట్స్ యాప్స్ ను వాడుతున్నారు. ఇక వీటితో కొనుగోలు చేస్తూ చిల్లరతో అవసరం లేకుండా తిరుగుతున్నారు.

ఇలా యూనిఫైట్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) తీసుకొచ్చిన ఈ మార్పు విప్లవాత్మకమైనదని చెప్పక తప్పదు. ఈ రోజుల్లో గూగుల్ పే వాడే వారి సంఖ్య క్రమ క్రమ పెరుగుతూ వస్తుంది. అయితే, యూజర్లకు తాజాగా గూగుల్ పే కీలక సూచలను చేసింది. ఆ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఇంతకు ఆ యాప్స్ ఏంటి? అసలు గూగుల్ పే యూజర్లు చేసిన సూచనలు ఏంటంటే? ఈ రోజుల్లో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్నే కొందరు సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుని అమాయకులను నిండా ముంచేస్తున్నారు. అదేంటంటే? గూగుల్ పే నుంచి ఆన్ లైన్ లావాదేవీలు చేసే క్రమంలో స్క్రీన్ షేరింగ్ యాప్ ను ఉపయోగిస్తుంటాము. ఇలా వాడడం చాలా డేంజర్ అంటుంది గూగుల్ పే.

తాజాగా తమ యూజర్లను అలెర్ట్ చేస్తూ అలాంటి స్క్రీన్ షేరింగ్ యాప్ ఉపయోగించొద్దంటూ సూచించింది. ఈ యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఆర్థిక వివరాలు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తారు. ఇంతే కాకుండా మీ ఖాతాలో ఉన్న డబ్బును అంతా ఖాళీ చేసే ఆస్కారం లేకపోలేదని గూగుల్ పే తమ యూజర్లకు గూగుల్ పే సూచనలు చేసింది. ఇలాంటి సైబర్ నేరగాళ్ల మీ అకౌంట్ నుంచి డబ్బులు లాగేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇందు కోసం మీరు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యాప్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ యాప్ అస్సలు వాడొద్దని, కొన్ని సందర్భాల్లో గూగుల్ పే ప్రతినిధులమని చెప్పి ఏదైన థర్డ్ పార్టీ యాప్ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోమని చెబితే అస్సలు చేసుకోవద్దని కోరింది. ఇలా చేసుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇలామోసపూరిత ట్రాన్సాక్షన్లు జరగకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని గూగుల్ పే తెలిపింది. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే గూగుల్ పేకు ఫిర్యాదు చేయాలని కోరింది.