Google Maps New Features: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్! ఇక ట్రాఫిక్‌లో ఇరుక్కునే సమస్య ఉండదు!

గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్! ఇక ట్రాఫిక్‌లో ఇరుక్కునే సమస్య ఉండదు!

New Features Unlocked In Google Maps To Save Time From Huge Unnecessary Traffic: గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అనవసరంగా ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే?

New Features Unlocked In Google Maps To Save Time From Huge Unnecessary Traffic: గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అనవసరంగా ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే?

గూగుల్ మ్యాప్స్ సహాయంతో తెలియని ప్రదేశాలకు కూడా సులువుగా వెళ్లిపోవచ్చు. ఫ్లై ఓవర్లను, ట్రాఫిక్ ప్రాంతాలను హైలైట్ చేస్తూ గైడ్ చేస్తుంటుంది. అయితే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక చోట భారీ ట్రాఫిక్ అయితే మనకు ఎలా తెలుస్తుంది? కారు ప్రమాదానికి గురవ్వడం వల్లనో, ఆగిపోవడం వల్లనో ట్రాఫిక్ జామ్ అయితే ఎలా తెలుస్తుంది. మార్గాలు క్లోజ్ అయినా, రోడ్డు పనులు జరుగుతున్నా, లేదా రోడ్డు మీద అడ్డంగా ఏదైనా వస్తువు ఉన్నా రద్దీ అనేది ఏర్పడుతుంది. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి గంటల సమయం పడుతుంది. అలాంటప్పుడు ముందుగానే తెలిసుంటే ఇటు వైపు వచ్చేవాళ్ళం కాదు కదా అనిపిస్తుంది కదా. ఈ సమస్యను పరిష్కరించడానికే గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ ని అందుబాటులోకి వచ్చింది.

రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతుంటాయి. దీని వల్ల ట్రాఫిక్ కి భారీ అంతరాయం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రహదారి మీద రద్దీ ఎక్కువగా ఉంది. ఇటువైపు ఎవరూ రాకండి అని ఎవరు చెప్తారు? పోలీసులు ఆపుతుంటే వాట్సాప్ గ్రూపుల్లో అప్డేట్ చేసుకునే మనుషులున్న ఈ సమాజం ఆఫ్ ఇండియాలో పలానా రోడ్డు మీద ప్రమాదం జరిగింది.. రద్దీగా ఉంది.. మీరు వస్తే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది అని చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ఉంటే మాత్రం తెలియని వాళ్ళకి ఎలా చెప్పగలరు? ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన కొత్త సదుపాయంతో మ్యాప్స్ ని వాడే వినియోగదారులే తోటి ప్రయాణికులకు గైడ్ చేయచ్చు. ప్రమాదాలు జరిగినా.. మరేదైనా కారణంగా వాహనదారులను వేరే రూట్లోకి మళ్లించినా, జనం భారీ సంఖ్యలో గుమిగూడడం వల్ల వాహనాలు నిలిచిపోయినా.. వీటికి సంబంధించి అప్డేట్స్ ని స్వయంగా గూగుల్ మ్యాప్స్ వినియోగదారులు ఇవ్వచ్చు.

ఇలా ఇవ్వడం వల్ల అటుగా వచ్చే వారు వేరే రూట్లలో వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక రూట్లో వెళ్తున్నారనుకుందాం. ఆ సమయంలో మీరు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. కనీసం మిగతా వారైనా ఇరుక్కుపోకుండా ఉండాలంటే మీరు మ్యాప్స్ ఓపెన్ చేసి అందులో అప్డేట్ చేస్తే మిగతా వాళ్ళు వేరే రూట్లో వెళ్తారు. దీని వల్ల మీకు లాభం ఉండకపోవచ్చు. కానీ అందరూ చేస్తే అందరూ శ్రమ లేకుండా ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. దీని కోసం మీరు గూగుల్ మ్యాప్స్ ని ఓపెన్ చేసి మీరు వెళ్లే గమ్యాన్ని ఎంచుకుని నావిగేషన్ ప్రారంభించాలి. నావిగేషన్ ని స్టార్ట్ చేశాక కింద ఉన్న బార్ ని పైకి స్వైప్ చేయాలి. ‘యాడ్ ఏ రిపోర్ట్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో క్రాష్, కంజెషన్, రోడ్ వర్క్స్, లేన్ క్లోజర్, స్టాల్డ్ వెహికల్స్, ఆబ్జెక్ట్ ఆన్ ద రోడ్ అనే ఆప్షన్స్ కనబడతాయి. ఎదురైన సమస్యను బట్టి రిపోర్ట్ చేస్తే ఆ రూట్లో వచ్చేవారిని అలర్ట్ చేస్తుంది.

Show comments