‘జియో ఎయిర్ ఫైబర్’ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. కొద్దిరోజులు మాత్రేమే..

Good News for Jio Air Fiber Users: దేశంలో టెలికాం రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న జియో సంస్థ జియో ఎయిర్ ఫైబర్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. కొత్తగా కనెక్షన్స్ పొందాలనుకునే వారికి ఇది గొప్ప ఆఫర్ అంటున్నారు.

Good News for Jio Air Fiber Users: దేశంలో టెలికాం రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న జియో సంస్థ జియో ఎయిర్ ఫైబర్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. కొత్తగా కనెక్షన్స్ పొందాలనుకునే వారికి ఇది గొప్ప ఆఫర్ అంటున్నారు.

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది కొత్త కొత్త ఆవిష్కరణలు పుటుకువస్తున్నాయి. టెక్నాలజీ పుణ్యమా అని కమ్యూనికేషన్ రంగంలో భారీ మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలా ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్లు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. టెలికాం కంపెనీలు అందుకు తగ్గట్టు రక రకాల ప్లాన్లు యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. స్మార్ట్ గాడ్జెట్ లను వాడాలంటే ఇంటర్నెట్ సౌదుపాయం ఉండాల్సిందే.. తాజాగా టెలికాం దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ వినియోదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.వివరాల్లోకి వెళితే.

జియో ఎయిర్ ఫైబర్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇటీవల జియో రీచార్జ్ ప్లాన్లు భారీగా పెంచిన విషయం తెలిసిందే. అయితే జియో ఎయిర్ ఫైబర్ పేరిట ఇన్ స్ట్రాలేషన్ ఛార్జీలు లేకుండా కొత్త జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్స్ ఇవ్వనున్నట్లు జియో ప్రకటించింది. కొత్తగా కనెక్షన్స్ పొందాలనుకునే వారికి ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్ గా మాత్రమే అని చెబుతుంది. ఇప్పటికే ఈ కనెక్షన్ తీసుకున్న యూజర్లతో పాటు కనెక్షన్ చేసుకున్న వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని జియో పేర్కొంది. ఈ ఆఫర్ కింద కస్టమర్లకు 30 శాతం వరకు రాయితీ ఉంటుందని తెలిపింది.

శుక్రవారం (జులై 26) నుంచి ఆగస్టు 15 మధ్య కొత్తగా చేరే వినియోగదారులకు ఇన్ స్ట్రాలేషన్ చార్జీలు వెయ్యి రూపాయలు మాఫీ అవుతాయని గురువారం వెల్లడించింది జియో సంస్థ. ఎయిర్ ఫైబర్ సర్వీసు పొందే వారు కనీసం మూడు నెలల ప్లాన్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 3,6,12 నెలల 5జీ, 5జీ ప్లస్ ప్లాన్లు వార్షిక ప్లాను అమల్లో ఉన్నాయి. ఇక జీయో ఫ్రీడమ్ ఆఫర్ అయితే మూడు నెలలు ఆల్ ఇన్ ప్లాన్ కోసం రూ.3,121 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులోనే వెయ్యి రూపాల విలువైన ఇన్‌స్టలేషన్ ఫీజు కలిపి ఉంటుందని జియో తెలిపింది. అంటే జియో ఎయిర్ ఫైబర్ కస్టమర్లు ఇప్పుడు రూ.2,121 తోనే కనెక్షన్ పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్ కొద్ది రోజుల మాత్రమే ఉంటుందని తెలిపింది.

Show comments