iDreamPost
android-app
ios-app

సబ్ స్క్రిపషన్ తో వాటర్ ప్యూరిఫయర్.. నెలకి రూ.350కే..

ప్రస్తుతం అందరూ మినరల్ వాటర్ కొనుక్కోవడానికే అలవాటు పడిపోయారు. చాలామంది ఇంట్లోనే వాటర్ ప్యూరిఫయర్ ని అమర్చుకున్నారు. కానీ, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు సబ్ స్క్రిప్షన్ విధానంలో వాటర్ ప్యూరిఫయర్ మార్కెట్ లో ఉంది.

ప్రస్తుతం అందరూ మినరల్ వాటర్ కొనుక్కోవడానికే అలవాటు పడిపోయారు. చాలామంది ఇంట్లోనే వాటర్ ప్యూరిఫయర్ ని అమర్చుకున్నారు. కానీ, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు సబ్ స్క్రిప్షన్ విధానంలో వాటర్ ప్యూరిఫయర్ మార్కెట్ లో ఉంది.

సబ్ స్క్రిపషన్ తో వాటర్ ప్యూరిఫయర్.. నెలకి రూ.350కే..

అందరికీ తెలుసు నీళ్లే జీవనాధారం. నీరు లేనిదే మనిషి మనుగడ ఉండదు. అలాంటి నీటిని ప్రస్తుతం నేరుగా తాగే పరిస్థితి ఉండటం లేదు. కచ్చితంగా కాచి చల్లార్చుకుని తాగాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. అయితే అది అన్ని సందర్భాల్లో, పరిస్థితుల్లో వర్కౌట్ అవ్వదని అందరికీ తెలుసు. అందుకే బయట నుంచి మినరల్ వాటర్ క్యాన్లు కొనుక్కుంటూ ఉంటారు. ఏరియాని బట్టి వాటి ధర రూ.10 నుంచి రూ.20గా ఉంది. ఒకవేళ మీకు ఇంటికి తీసుకొచ్చి డెలివర్ చేయాలి అంటే క్యాను ధర రూ.30 వరకు ఉంటుంది. రోజుకు మీరు ఒక క్యాన్ గనుక వాడితే నెలకు రూ.900 ఖర్చు అవుతుంది. కానీ, కేవలం రూ.350కే మీరు వాటర్ ప్యూరిఫయర్ ని ఇంట్లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

బయటి నుంచి మినరల్ వాటర్ కొనుగోలు చేయాలి అంటే ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే అందరూ RO వాటర్ సిస్టమ్స్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ, మార్కెట్ లో వాటి ధర రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటున్నాయి. మధ్యతరగతి వారికి వాటిని కొనుగోలు చేయడం కాస్త భారంగానే ఉంటుంది. అలాగని వాటర్ క్యాన్ తెచ్చుకున్నా కూడా నెలకు రూ.600 వరకు ఖర్చు అవుతుంది. అయితే లివ్ ప్యూర్ అనే కంపెనీ ఇప్పుడు వాటర్ ప్యూరిఫయర్ ని మంత్లీ సబ్ స్క్రిప్షన్ మీద అందిస్తోంది. అది కూడా వాటి సబ్ స్క్రిప్షన్ కేవలం రూ.350 నుంచే మొదలవుతుంది. ఈ వాటర్ ప్యూరిఫయర్ ని తీసుకోవడం కూడా చాలా సులభం. మీరు లివ్ ప్యూర్ కంపెనీ అధికారిక వెబ్ సైటే లేదా యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. అందులో మీ వివరాలతో సైనప్ అవ్వాలి ఆ తర్వాత మీకు కావాల్సిన ప్లాన్ ని ఎంచుకోవాలి.

ఆ తర్వాత మీరు సేఫ్టీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఇవి మీరు ప్యూరిఫయర్ వద్దు అనుకున్న రోజు మీకు వెనక్కి ఇచ్చేస్తారు. మీరు 7 రోజులు ఫ్రీ ట్రైల్ కూడా చేయచ్చు. ఈ ప్యూరిఫయర్ లో ఫిల్టర్ క్వాలిటీ, ఆటోమేటిక్ సర్వీస్ అలర్ట్, కనెక్ట్ సపోర్ట్ టీమ్, రియల్ టైమ్ డేటా ఆధారంగా మిషన్ హెల్త్, రియల్ టైమ్ వాటర్ కన్జప్షన్ ని తెలియజేస్తుంది. అలాగే మీరు మీ ఫోన్ ద్వారా ఈ ప్యూరిఫయర్ ని రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. మీరు బేసిక్ ప్లాన్ రూ.349 తీసుకుంటే నెలకు 125 లీటర్లను పొందవచ్చు. ఆ తర్వాత అదనంగా వాడుకునే లీటరుకు రూ.3 చెల్లించాలి. అన్ లిమిటెడ్ ప్లాన్ తీసుకోవాలి అంటే నెలకు రూ.549 వరకు అవుతుంది. అలాగే ఇందులోనే ప్రీమియం ప్యూరిఫయర్ కూడా ఉంటుంది.

జింజెర్ కాపర్ హాట్ ప్యూరిఫయర్ తీసుకుంటే మీకు నెలకు ప్లాన్ రూ.499 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్లాన్ తో మీకు 999 లీటర్లు లభిస్తాయి. అదనంగా వాడుకునే ఒక్కో లీటరుకు రూపాయి ఖర్చు అవుతుంది. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే.. మీరు ఈ లివ్ ప్యూర్ వాటర్ ప్యూరిఫయర్ తీసుకుంటే ఎలాంటి ఇన్ స్టాలేషన్ ఛార్జెస్ కూడా తీసుకోరు. అలాగే మీరు ఇల్లు మారుతూ ఆ ప్యూరిఫయర్ ని మార్చుకోవాలన్నీ కూడా ఎలాంటి అదనపు డబ్బు వసూలు చేయరు. అలాగే మీకు వాడిన ప్యూరిఫయర్ కాకుండా కొత్త మిషన్ తీసుకొచ్చి ఇన్ స్టాల్ చేస్తారు. యాప్ సపోర్ట్, ఫ్రీ లైఫ్ టైమ్ మెయిన్టినెన్స్ ఉంటుంది. మరి.. ఈ లివ్ ప్యూర్ నెలవారీ సబ్ స్క్రిప్షన్ విధానం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.