iDreamPost
android-app
ios-app

FlipKart రిపబ్లిక్ డే సేల్ లో ఐఫోన్- స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

  • Published Jan 10, 2024 | 6:44 PM Updated Updated Jan 10, 2024 | 6:44 PM

Flipkart Republis Day Sale 2024: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తోంది. ఈ సేల్ లో ఏ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయో చూడండి.

Flipkart Republis Day Sale 2024: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తోంది. ఈ సేల్ లో ఏ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయో చూడండి.

  • Published Jan 10, 2024 | 6:44 PMUpdated Jan 10, 2024 | 6:44 PM
FlipKart రిపబ్లిక్ డే సేల్ లో ఐఫోన్- స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

ప్రస్తుతం అందరూ ఆన్ లైన్ లోనే షాపింగ్ చేస్తున్నారు. ఇంట్లోకి కావాల్సిన ఏ వస్తువైనా ఇప్పుడు ఇ-కామర్స్ సైట్లలో దొరుకుతోంది. గతంలో అంటే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు వంటివి మాత్రమే నెట్టింట కొనుగోలు చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు దుస్తులు, చెప్పులు మాత్రమే కాకుండా ఆఖరికి కూరగాయలు, పాల ప్యాకెట్లు కూడా ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇ-కామర్స్ సైట్లు బాగా పెరిగిపోయాయి. అంతేకాకుండా వారిలో వారికి ఉండే పోటీ దృష్ట్యా స్పెషల్ సేల్స్, డిస్కౌంట్స్, ఫెస్టివల్ స్పెషల్ సేల్స్ వంటివి చేస్తూ ఉంటారు. వాటిలో రిపబ్లిక్ డే సేల్ కూడా ఒకటి. ఈ సమంయలో సాధారణంగా ఇచ్చే డిస్కౌంట్స్ కంటే అధికంగా తగ్గింపు లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ కి సంబంధించిన వివరాలు, డిస్కౌంట్స్ గురించి తెలుసుకుందాం.

ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ కోసం వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రిపబ్లిక్ డే సేల్ వివరాలు మాత్రమే కాకుండా.. ఏ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఉండబోతున్నాయో కూడా సమాచారం వచ్చేసింది. ఈ ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14 నుంచి 19 వరకు జరగబోతున్నట్లు వెల్లడించారు. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకైతే జనవరి 13 నుంచే ఎర్లీ యాక్సెస్ లభిస్తుంది. ఈసారి సేల్ లో కూడా ఫోన్స్, ల్యాప్ ట్యాప్స్, స్మార్ట్ వాచెస్ వంటి గ్యాడ్జెట్స్ మీద మాత్రమే కాకుండా.. హోమ్ అప్లయన్సెస్, కిచెన్ వేర్, క్లోతింగ్, ఫుట్ వేర్ వంటి అన్ని కేటగిరీల వస్తువులపై ఈ సేల్ లో భారీ నుంచి అతి భారీ డిస్కౌంట్స్ ఉండబోతున్నాయి. ఈ అంశాలపై ఫ్లిప్ కార్ట్ క్లారిటీ కూడా ఇచ్చింది.

ఈ సేల్ లో ఏ వస్తువులపై ఎంత శాతం వరకు డిస్కౌంట్స్ ఉండబోతున్నాయో చూద్దాం. ఈ సేల్ కోసం ఫ్లిప్ కార్ట్ స్పెషల్ ల్యాండింగ్ పేజ్ ని కూడా ఏర్పాటు చేసింది. అక్కడే అన్ని వివరాలను స్పష్టంగా వెల్లడించింది. ఫ్యాషన్ అండ్ యాక్ససెరీస్ పై గరిష్టంగా 80 శాతం వరకు డిస్కౌంట్ లభించబోతున్నాయి. పూమా, ఉడ్ ల్యాండ్ వంటి టాప్ బ్రాండెడ్ ఫుట్ వేర్ పై 50 శాతం నుంచి 80 శాతం వరకు ధరలు తగ్గించబోతున్నారు. ఎథ్నిక్ జ్యూయలరీపై 90 శాతం వరకు డిస్కౌంట్స్ ఉండబోతున్నాయి. అంతేకాకుండా టైటాన్, టైమెక్స్ వంటి వాచెస్ పై మీకు 50 నుంచి 80 శాతం వరకు తగ్గింపు లభించబోతోంది. టీవీలు, ఎలక్ట్రనిక్ డివైజెస్ పై 80 శాతం వరకు, హోమ్ అప్లయన్సెస్ పై 75 శాతం వరకు ప్రైస్ లో డిస్కౌంట్స్ ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా బ్యూటీ ప్రొడక్టస్, టాయ్స్ మీద గరిష్టంగా 85 శాతం వరకు ధరల్లో తగ్గింపు పొందచ్చు. కిచెన్ వేర్ లో స్పెషల్ ప్రైసెస్ ఉండబోతున్నాయి. ఇవి కేవలం రూ.49 నుంచే ప్రారంభంకాబోతున్నాయి.

ఫర్నీచర్- మ్యాట్రసెస్ పై కూడా 85 శాతం వరకు డిస్కౌంట్స్ ఉండబోతున్నాయి. స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే.. మోటరోలా ఎడ్జ్ 40 నియో, మోటో జీ54, గూగుల్ పిక్సల్ 7ఏ, రియల్ మీ 11 ఎక్స్ 5జీ, రియల్ మీ సీ 53, శాంసంగ్ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ, శాంసంగ్ ఎఫ్ 14 5జీ, వంటి ఫోన్లపై డిస్కౌంట్స్ ఉండబోతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఐఫోన్లపై కూడా స్పెషల్ డిస్కౌంట్ ని అందించబోతున్నారు. ఎంత అనేది స్పష్టం చేయలేదు. కానీ, రెండంకెల్లో ఆ తగ్గింపు ఉండబోతోంది అంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ సేల్ లో కూడా బ్యాంకు ఆఫర్లు ఉంటాయి. సెలక్టెడ్ డెబిట్, క్రెడిట్ కార్డులపై అడిషనల్ డిస్కౌంట్స్ ఉండబోతున్నాయి. మరి.. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024 లో మీరు ఏ వస్తువులు కొనాలని ఎదురుచూస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş