అదిరిపోయే ఫీచర్లు.. eSIM సపోర్టుతో తొలి OnePlus స్మార్ట్‌ వాచ్‌.. ధర ఎంతంటే?

OnePlus Watch 2: స్మార్ట్ వాచ్ యూజర్లకు గుడ్ న్యూస్. వన్ ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. వన్ ప్లస్ నుంచి తొలిసారిగా ఈ-సిమ్ సపోర్ట్ తో స్మార్ట్ వాచ్ విడుదలైంది.

OnePlus Watch 2: స్మార్ట్ వాచ్ యూజర్లకు గుడ్ న్యూస్. వన్ ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. వన్ ప్లస్ నుంచి తొలిసారిగా ఈ-సిమ్ సపోర్ట్ తో స్మార్ట్ వాచ్ విడుదలైంది.

స్మార్ట్ వాచ్ లు ప్రస్తుతం ట్రెండీగా మారాయి. చిన్న వాళ్ల దగ్గర్నుంచి పెద్ద వయసు కలిగిన వాళ్ల వరకు స్మార్ట్ వాచ్ లను వినియోగిస్తున్నారు. స్మార్ట్ వాచ్ కేవలం టైమ్ మాత్రమే చూసుకోవడానికి కాకుండా హెల్త్ ట్రాకింగ్, కాల్, మెసేజ్ నోటిఫికేషన్స్ ఇంకా ఇతర ఫీచర్లు స్మార్ట్ వాచ్ లలో ఉంటుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. అయితే ఇప్పటి వరకు ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీలు కిర్రాక్ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. వన్ ప్లస్ నుంచి తొలిసారిగా ఈ-సిమ్ సపోర్ట్ తో స్మార్ట్ వాచ్ విడుదలైంది.

వన్‌ప్లస్‌ వాచ్‌ 2ను లాంచ్ చేసింది. ఈ వాచ్‌ అల్యూమినియం కేస్‌ సహా ఈసిమ్ సపోర్టుతో విడుదల అయింది. ఈ సిమ్ సపోర్ట్ తో వచ్చిన ఏకైక స్మార్ట్ వాచ్ వన్ ప్లస్ వాచ్2. ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు, ఐపీ68 రేటింగ్‌ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. అమోలెడ్‌ డిస్‌ప్లే ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ వాచ్‌ మెటోరైట్‌ బ్లాక్, నెబ్యులా గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర భారత కరెన్సీలో రూ.20,650లుగా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ వృత్తాకర డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 466*466 పిక్సల్‌ రిజల్యూషన్‌ తో 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. దీంతోపాటు 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ తో అందుబాటులోకి వచ్చింది.

వన్‌ప్లస్‌ వాచ్ 2 క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ W5 చిప్‌ సెట్‌ పైన పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్‌ మరియు 32జీబీ అంతర్గత స్టోరేజీపై పనిచేస్తుంది. ఈ వాచ్‌ హెల్త్‌ ట్రాకర్లతోపాటు 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్‌ మోడ్స్‌ ను కలిగి ఉంది. ఇందులో హార్ట్‌ రేట్‌ సెన్సార్‌, SpO2 మానిటర్‌ తో సహా మరిన్ని ఫీచర్‌ లను కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్‌ వాచ్‌ 2 500ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జ్ తో 4 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. కేవలం 60 నిమిషాల్లో ఈ వన్‌ ప్లస్‌ వాచ్‌ 2 ను 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చు.

Show comments