iDreamPost
android-app
ios-app

డీల్ అంటే ఇది.. 20 వేల స్మార్ట్ వాచ్ రూ.1799కే!

Fire Boltt Horizon Specifications And Price Details: ఒక మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? మీకోసం ఒక బెస్ట్ స్మార్ట్ వాచ్ ని తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటిది కాదు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ ఇది.

Fire Boltt Horizon Specifications And Price Details: ఒక మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? మీకోసం ఒక బెస్ట్ స్మార్ట్ వాచ్ ని తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటిది కాదు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ ఇది.

డీల్ అంటే ఇది.. 20 వేల స్మార్ట్ వాచ్ రూ.1799కే!

స్మార్ట్ వాచెస్ వాడకం ఇప్పుడు బాగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు ఈ స్మార్ట్ వాచ్ ని వాడేస్తున్నారు. అందుకే ఇప్పుడు స్మార్ట్ వాచెస్ తయారు చేసే కంపెనీలు కూడా పెరిగిపోయాయి. అమ్మేవాళ్లు ఎక్కువ అవ్వడం వల్ల స్మార్ట్ వాచెస్ బడ్జెట్ లో లభిస్తున్నాయి. ఇప్పుడు అందరూ బడ్జెట్ లో ఇస్తుండటంతో.. ప్రీమియం ఫీచర్స్ ఉన్న వాచెస్ ని ఎవరైతే తక్కువ ధరలో తీసుకొస్తున్నారో వారికే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. అలాంటి కేటగిరీలో కొత్తగా ఒక స్మార్ట్ వాచ్ రిలీజ్ అయ్యింది. అది లుక్స్ పరంగానే కాకుండా.. ఫీచర్స్ పరంగా కూడా సూపర్ ప్రీమియంగా ఉంది. మరి.. ఆ వాచ్ లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న స్మార్ట్ వాచ్ ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందింది. మార్కెట్ లో ఫైర్ బోల్ట్ కంపెనీకి మంచి గుడ్ విల్ క్రియేట్ అయ్యింది. ఎందుకంటే బడ్జెట్ రేంజ్ లో ప్రీమియం ప్రోడక్ట్స్ ఇవ్వడంలో వాళ్లు సక్సెస్ అయ్యారు. అందుకే వినియోగదారులు కూడా ఆ కంపెనీ నుంచి వచ్చే వాచెస్, ఇయర్ బడ్స్ కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఫైర్ బోల్ట్ నుంచి హారిజన్ అనే కొత్త స్మార్ట్ వాచ్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్లో సేల్స్ కూడా జరుగుతున్నాయి. ఈ స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.19,999 కాగా ప్రస్తుతం లాంఛింగ్ ఆఫర్ కింద కేవలం రూ. 1,799కే అందిస్తున్నారు. అయితే ఈ ధర ఎన్ని రోజులు ఉంటుంది అని మాత్రం చెప్పడానికి లేదు. ఎందుకంటే లాంఛింగ్ ఆఫర్ కాబట్టి కచ్చితంగా మారిపోయే ఆస్కారం ఉంటుంది.

అయితే ఈ స్మార్ట్ వాచ్ ని ఎందుకు కొనాలి? అందులో అంత చెప్పుకోదగ్గ ఫీచర్స్ ఏమున్నాయి? అనే ప్రశ్న కచ్చితంగా సగడు వినియోగదారునికి వస్తుంది. అయితే ఈ హారిజన్ స్మార్ట్ వాచ్.. 1.96 ఇంచెస్ ఆమోలెడ్ డిస్ ప్లేతో వస్తోంది. పైగా ఇది కర్వ్డ్ డిస్ ప్లే. ఇందులో 410*502 పిక్సల్స్ రెజల్యూషన్ ఉంది. ఇందులో ఇంకో బాగా చెప్పుకోదగిన ఫీచర్ ఏంటి అంటే.. వైర్ లెస్ ఛార్జింగ్. అలాగే ఇందులో ఆపరేటింగ్ క్రౌన్ కూడా ఉంది. అలాగే బ్లూటూత్ కాలింగ్ ఉంది. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.

ఫైర్ బోల్ట్ హెల్త్ సూట్ కూడా ఉంది. అంటే హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్పీఓ2 మానిటరింగ్, మహిళల కోసం పిరియడ్ సైకిల్ అలర్ట్ వంటి హెల్త్ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంది. అలాగే వెదర్ అప్ డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. మ్యూజిక్ వినచ్చు, అలారమ్ సెట్ చేసుకోవచ్చు, ఫోన్ నుంచి ఫొటో తీసుకోవడానికి దీనిని షట్టర్ లా కూడా వాడుకోవచ్చు. ఇలా అన్నీ ప్రీమియం ఫీచర్స్ ఈ వాచ్ లో ఉన్నాయి. ఈ వాచ్ ని రూ.1,799కే ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్ సైట్ లో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్ లో అయితే రూ.1,999కి అందుబాటులో ఉంది. మరి.. ఈ ఫైర్ బోల్ట్ హారిజన్ స్మార్ట్ వాచ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.