iDreamPost
android-app
ios-app

రూ.16 వేల స్మార్ట్ వాచ్ రూ.1200కే.. అదిరిపోయే ఫీచర్స్ కూడా..

Fire boltt Cyclone Smartwatch Price And Specifications: బడ్జెట్ లో స్మార్ట్ వాచ్ కొనాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక క్రేజీ డీల్ తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి డీల్ కాదండోయ్.. బడ్జెట్ లో ప్రీమియం వాచ్ ఫీచర్స్ ఉన్నాయి.

Fire boltt Cyclone Smartwatch Price And Specifications: బడ్జెట్ లో స్మార్ట్ వాచ్ కొనాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక క్రేజీ డీల్ తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి డీల్ కాదండోయ్.. బడ్జెట్ లో ప్రీమియం వాచ్ ఫీచర్స్ ఉన్నాయి.

రూ.16 వేల స్మార్ట్ వాచ్ రూ.1200కే.. అదిరిపోయే ఫీచర్స్ కూడా..

మీరు ఒక మంచి స్మార్ట్ వాచ్ ని కొనాలి అనుకుంటుంటే మాత్రం ఈ డీల్ మీకోసమే. ఒకవేళ మీకు ఇప్పటికే స్మార్ట్ వాచ్లు ఉన్నా కూడా ఇది పెద్ద పర్సుకు భారం కాదు. కానీ, చేతికి మాత్రం మంచి లుక్ ఇస్తుంది. అలాగే చాలా మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్మార్ట్ వాచ్ రౌండ్ డయల్ మీ మనసును దోచేస్తుంది. ఇంక దీని స్ట్రాప్ చూస్తే అచ్చం యాపిల్ వాచ్ తరహాలోనే ఉంటుంది. ఇందులో మీకు చాలానే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంక ధర మాత్రం పాకెట్ ఫ్రెండ్లీ అనే చెప్పాలి. కేవలం రూ.1,199కే మీరు ఈ స్మార్ట్ వాచ్ ని కొనుగోలు చేయచ్చు. ధర చూసి ఫీచర్స్ ని మాత్రం తక్కువ అంచనా వేయద్దు. ఇందులో మంచి ప్రీమియం వాచ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.

మీకు పరిచయం చేసిన ఈ వాచ్ ను తీసుకొచ్చింది.. ప్రముఖ స్మార్ట్ వాచ్ కంపెనీ ఫైర్ బోల్ట్. ఈ కంపెనీ వాచ్ లకు భారత్ లో మంచి డిమాండ్ ఉంది. కానీ, వీళ్లు మాత్రం బడ్జెట్ లోనే వాచెస్ ని తీసుకురావడం విశేషం. ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ వాచ్ మోడల్ పేరు ఫైర్ బోల్ట్ సైక్లోన్. ఈ వాచ్ ఎమ్మార్పీ రూ.15,999 కాగా కేవలం రూ.1,199కే అందిస్తున్నారు. అయితే ఈ ధర ఎన్ని రోజులు ఉంటుంది అనేది మాత్రం చెప్పలేం. ప్రస్తుతానికి ఆఫర్ లో ఈ ధరను ప్రకటించారు. ఇంక లుక్స్ పరంగా ఈ వాచ్ కి 10కి 8 మార్కులు వేసేయచ్చు. చూడటానికి ఎంతో స్టైలిష్ గా క్యూట్ గా రౌండ్ డయల్ తో ఉంది. అలాగే ఇందులో బ్లాక్, సిల్వర్ బ్లాక్, ఎల్లో, ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

సైక్లోన్ ఫీచర్స్:

ఫైర్ బోల్ట్ సైక్లోన్ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది 1.6 ఇంచెస్ బిగ్ హెచ్ డీ స్క్రీన్, 400*400 పిక్సెల్ రెజల్యూషన్ తో వస్తోంది. ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ ప్లే ఉంది. మీకు ఈ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ కూడా లభిస్తుంది. ఇందులో NFC యాక్సెస్ డోర్ కంట్రోల్ కూడా ఉంది. అలాగే మీరు ఈ వాచ్ లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అలాగే మోషన్ సెన్సార్ గేమ్స్ కి దీనిని ఒక కంట్రోలర్ గా కూడా మీరు వాడుకోవచ్చు. మీరు పేపాల్ పేమెంట్స్ రిసీవింగ్ కి ఈ వాచ్ ని వాడుకోవచ్చు. ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇందులో 390 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 రోజుల బ్యాటరీ స్టాండ్ బై సామర్థ్యంతో వస్తోంది. వాచ్ ని వాడుతుంటే మాత్రం 8 రోజుల వరకు ఛార్జింగ్ బ్యాకప్ లభిస్తుంది. ఈ వాచ్ ఫుల్ మెటల్ కేస్ తో వస్తోంది. దీనిలో ఫంక్షనింగ్ క్రౌన్ కూడా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.