వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే.. భారీ నష్టం తప్పదు!

పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్యం వంటి కారణాల వల్ల ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈవీల మీద కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తన సబ్సిడీ ఇస్తుండటంతో.. చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలకు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఈవీల వాడకం పెరిగింది. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నప్పటికి.. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా వానాకాలంలో ఈవీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈవీలకు నీరే ప్రధాన శత్రువు. కనుక మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అది భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వివరాలు..

ఛార్జింగ్ పరికరాలను జాగ్రత్తగా వాడుకోండి..

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను కాపాడుకోవడంలో.. మొదటి, ప్రధానమైన దశ ఛార్జింగ్ పరికరాలను సురక్షితంగా ఉంచడం. ఛార్జింగ్‌ పరికరాలకు ఏమాత్రం నీరు తగిలినా.. షార్ట్‌ సర్క్యూట్‌కు కారణం వుతుంది. మీ ఈవీకి సంబంధించి బయట ఛార్జింగ్ స్టేషన్‌ని సెటప్ చేసి ఉంటే లేదా పోర్టబుల్ ఛార్జర్‌ని ఉపయోగించినట్లయితే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. లేదంటే పరికరంలోకి నీరు చేరి షార్ట్ సర్క్యూట్‌కు కారణమవుతుంది. కనుక ఛార్జింగ్‌ పరికరాలను ఎప్పుడు పొడిగా ఉంచుకోవాలి.. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

బ్యాటరీ హెల్త్‌ చెక్‌ చేయడం తప్పనిసరి..

మీ ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ ముఖ్యమైన భాగం కాబట్టి దాని హెల్త్‌ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా ఇన్సులేషన్, కనెక్టర్ నష్టం వాటిల్లకుండా ఉండాలంటే.. బ్యాటరీని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తుండాలి. మీరు అసాధారణంగా ఏదైనా గమనించినట్లయితే, వాహనాన్ని ప్రారంభించకుండా సర్వీస్‌ సెంటర్‌కు కాల్‌ చేయాలి.

కారు ఇంటీరియర్ శుభ్రంగా ఉంచండి

మీరు ఎలక్ట్రిక్‌ కారు వాడుతున్నట్లితే.. ఛార్జింగ్‌ పరికరాలు, బ్యాటరీలతో పాటు.. కారు లోపలి భాగం కూడా అంతే ముఖ్యమైనది. కారు లోపల నీరు, తేమ ఉంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ కారు లోపలి భాగాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచండి. తలుపులు, కిటికీలు సరిగ్గా క్లోస్‌ అవుతున్నాయా, లేదా అని చెక్‌ చేసుకోవాలి. అలానే లీక్‌లు లేవని నిర్ధారించుకోవాలి.

నీరు నిండిన రోడ్లపైకి వెళ్లకపోవడం ఉత్తమం..

వానా కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలతో రెట్టింపు జాగ్రత్తగా ఉండాలి. ఈవీలు చాలా సున్నితమైన ఎలక్ట్రానిక్స్, సెన్సార్‌లను కలిగి ఉంటాయి. కాబట్టి నీరు వాటిని పాడు చేయడం సులభం. అలాగే, మీ బ్యాటరీ ప్యాక్ ఐపీ రేటింగ్‌ను తెలుసుకోండి. మీరు ప్రయాణించాల్సిన రోడ్లపై నీటి ముంపు ఉంటే ఆ మార్గంలో వెళ్లకుండా.. మరొక మార్గంలో వెళ్లడం ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు.

Show comments