iDreamPost
android-app
ios-app

ట్యాపింగ్ రచ్చ: మీ ఫోన్ కూడా ట్యాపింగ్ లో ఉందని అనుమానమా? ఇలా చెక్ చేసుకోండి!

  • Published Apr 02, 2024 | 8:57 AM Updated Updated Apr 02, 2024 | 8:57 AM

ప్రస్తుతం అందరు స్మార్ట్ ఫోన్ యుగంలో బ్రతుకుతున్నాం.. దీని వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్నే ప్రమాదాలు కూడా ఉన్నాయి.. ఈ క్రమంలో ప్రస్తుతం అందరు గురౌతున్న సమస్య ఫోన్ ట్యాపింగ్.. అసలు ఏంటి ట్యాపింగ్ అనే విషయాలు తెలుసుకుందాం.

ప్రస్తుతం అందరు స్మార్ట్ ఫోన్ యుగంలో బ్రతుకుతున్నాం.. దీని వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్నే ప్రమాదాలు కూడా ఉన్నాయి.. ఈ క్రమంలో ప్రస్తుతం అందరు గురౌతున్న సమస్య ఫోన్ ట్యాపింగ్.. అసలు ఏంటి ట్యాపింగ్ అనే విషయాలు తెలుసుకుందాం.

  • Published Apr 02, 2024 | 8:57 AMUpdated Apr 02, 2024 | 8:57 AM
ట్యాపింగ్ రచ్చ: మీ ఫోన్ కూడా ట్యాపింగ్ లో ఉందని అనుమానమా? ఇలా చెక్ చేసుకోండి!

ఇప్పుడు ఎవరి చేతిలో చుసిన స్మార్ట్ ఫోన్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా దీని వలన అందరికి ఎన్నో ఉపయోగాలు ఉన్నా కూడా.. స్మార్ట్ ఫోన్స్ కారణంగా.. టెక్నాలజీ కారణంగా మోసపోయిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు దీనిని అదునుగా తీసుకుని.. ఎంతో మంది అమాయకులను మోసం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సైబర్ నేరాల గురించి అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నా కూడా.. ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ,మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తున్న మరో సమస్య.. ఫోన్ ట్యాపింగ్.. అంటే, మనకు తెలీకుండా మన ఫోన్ ను ఎవరో హ్యాక్ చేస్తూ .. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ను దోచేయడం. ముఖ్యంగా ఇప్పుడు ఈ సమస్య అందరిని ఎంతో ఇబ్బంది పెడుతుంది. మరి, మీరు వినియోగిస్తున్న మొబైల్స్ కూడా ట్యాపింగ్ కు గురి అయ్యాయా లేదా అనే విషయాలను.. ఎలా చెక్ చేసుకోవాలో చూసేద్దాం.

ఇటీవల డెలాయిట్ నిర్వహించిన సర్వే ప్రకారం.. 67% వినియోగదారులు.. తమ ఫోన్ సేఫ్టీ విషయంలో ఆందోళన చెందుతున్నట్లుగా.. కనుగొన్నారు. 2023 తో పోలిస్తే.. ఈ ఏడాది 54% ఈ సంఖ్య అనేది పెరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదాలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు ఈ విషయంలో చాలా జాగ్రత్తహాలు వహించాలి. మరి ఈ క్రమంలో మీ ఫోన్ ట్యాపింగ్ కు గురైందా లేదా అని ఎలా గుర్తించాలో చూసేద్దాం.

1) మీరు మీ మొబైల్ లో కాల్ మాట్లాడుతున్న సమయంలో.. అనవసరమైన సౌండ్స్ రావడం, ఆటోమేటిక్ గా కెమెరా ఆన్ అవ్వడం లాంటివి జరగడం.. అదే ఐఫోన్, శాంసంగ్ ఫోన్స్ లో అయితే.. స్క్రీన్ పైన ఆరెంజ్, గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది.
2) బాటరీ ఫుల్ ఛార్జ్ ఉన్నా, బాటరీ కండీషన్ అంతా సరిగా ఉన్నా కూడా.. ఉన్నట్లుండి ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడం.. జరిగితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
3) ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉన్నా కూడా.. కాల్స్, నోటిఫికెషన్స్ రావడం. ఆటోమేటిక్ గా రీబూట్ అవ్వడం జరుగుతూ ఉంటె.. మీ ఫోన్ ను మరెవరో యాక్సెస్ చేస్తున్నారని అర్ధం.
4) ఇంకా మీ మొబైల్ లో మీరు ఇంస్టాల్ చేసిన యాప్స్ కాకుండా.. వాటితో పాటు అనవసరమైన అధిక యాప్స్ కనుక ఉన్నట్లయితే .. అది కూడా హ్యాకింగ్ కు సిగ్నల్ కావొచ్చు.
5) అంతేకాకుండా ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించకపోయినా కూడా.. విపరీతంగా వేడెక్కడం.. కనుక జరుగుతూ ఉంటే కనుక.. అది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే.

ఇలా మీ మొబైల్ ట్యాపింగ్ కు గురైందా లేదా అని చెక్ చేసుకుంటూ.. మొబైల్ సేఫ్టీ కోసం.. నమ్మదగిన యాంటీ వైరస్ ను ఇంస్టాల్ చేసుకోవాలి. అన్ నోన్ లింక్స్ పై క్లిక్ చేయకూడదు. ఇంకా ఫోన్ ట్యాపింగ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే.. ##4636## కోడ్ కు డయల్ చేయాలి. ఇది కూడా ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ను బట్టి ఈ కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే, ##197328640## లేదా ##4636## కు డయల్ చేయాలి. ఐఫోన్ యూజర్స్ అయితే.. 3001#12345# కు డయల్ చేయాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.