పెద్ద పెద్ద సినిమాలు ఎడిట్ చేసే సాఫ్ట్‌వేర్.. మీ వీడియోస్ కోసం ఫ్రీగా వాడుకోవచ్చు!

Davinci Resolve Video Editing Software For Free: మీరు షార్ట్స్, రీల్స్ చేస్తున్నారా? అయితే మీ వీడియోలను ప్రొఫెషనల్ గా వీడియో ఎడిటింగ్ చేయాలని అనుకుంటున్నారా? స్టైలిష్ గా.. మూవీ ట్రైలర్ లా మీ వీడియోస్ ని కట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ఫ్రీ ఫిల్మ్ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్. దీంతో మీరు మీ వీడియోలను ప్రొఫెషనల్ గా ఎడిట్ చేసుకోవచ్చు. సాఫ్ట్ వేర్ వాడడం కూడా సులువుగానే ఉంటుంది.

Davinci Resolve Video Editing Software For Free: మీరు షార్ట్స్, రీల్స్ చేస్తున్నారా? అయితే మీ వీడియోలను ప్రొఫెషనల్ గా వీడియో ఎడిటింగ్ చేయాలని అనుకుంటున్నారా? స్టైలిష్ గా.. మూవీ ట్రైలర్ లా మీ వీడియోస్ ని కట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ఫ్రీ ఫిల్మ్ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్. దీంతో మీరు మీ వీడియోలను ప్రొఫెషనల్ గా ఎడిట్ చేసుకోవచ్చు. సాఫ్ట్ వేర్ వాడడం కూడా సులువుగానే ఉంటుంది.

ఈ మధ్య కాలంలో వీడియోలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. స్మార్ట్ ఫోన్ లో వీడియోలు ఎడిట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. పోనీ సిస్టంలో ఎడిటింగ్ చేద్దామంటే ఫ్రీగా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ లు ఉండవు. డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే. అడోబ్ ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ప్రో వంటి ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ లు కొనాలంటే ముప్పై వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రీమియర్ ప్రో సాఫ్ట్ వేర్ కైతే నెల నెలా కనీసం రెండు మూడు వేలైనా పెట్టాల్సిందే. అయితే ఈ సాఫ్ట్ వేర్స్ ని మించిన తోపు సాఫ్ట్ వేర్ ని మీరు ఉచితంగా వాడుకోవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ ని పెద్ద పెద్ద సినిమాలను ఎడిటింగ్ చేసేందుకు వాడతారు. హాలీవుడ్ లో చాలా సినిమాలను ఈ సాఫ్ట్ వేర్ తోనే ఎడిటింగ్ చేస్తారు. కలర్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. మీ వీడియోలు ప్రొఫెషనల్ గా రావాలంటే కనుక ఈ సాఫ్ట్ వేర్ ని ట్రై చేయాల్సిందే. 

డావిన్సీ రిజాల్వ్:

దాని పేరు డావిన్సీ రిజాల్వ్. ప్రస్తుతం మార్కెట్లో డావిన్సీ రిజాల్వ్ 19 వెర్షన్ నడుస్తోంది. ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ వీడియో ట్రాన్సిషన్స్, ఆడియో ట్రాన్సిషన్స్ ఉన్నాయి. చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఫిల్మ్ ఎఫెక్ట్స్, గ్రీన్ స్క్రీన్ కీయింగ్ వంటివి చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీన్ని వాడడం చాలా సులువు. వీడియో ఎక్స్ పోర్ట్ అవ్వడం కూడా ఫాస్ట్ గా అవుతుంది. మీ కంప్యూటర్ మంచి కాన్ఫిగరేషన్ ఉంటే కనుక మీకు ఇది బాగా సూట్ అవుతుంది. మీరు యాపిల్ మ్యాక్ సిస్టం లేదా మ్యాక్ ల్యాప్ టాప్ వాడుతున్నట్లైతే కనుక ఈ డావిన్సీ సాఫ్ట్ వేర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.  

సిస్టం రిక్వైర్మెంట్స్:

విండోస్:

విండోస్ సిస్టం వాడుతున్నట్లైతే కనుక కనీసం 2 జీబీ గ్రాఫిక్ కార్డు, 16 జీబీ ర్యామ్ ఉండాలి. ఇంటెల్ కోర్ ఐ7 లేదా ఏఎండీ రైజన్ 7 ప్రాసెసర్ ఉండాలి. అలానే ఎస్ఎస్డీ హార్డ్ డ్రైవ్ ఉండాలి. స్టోరేజ్ స్పేస్ 250 జీబీ నుంచి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది.

మ్యాక్:

పిక్సెల్ లేదా ఆ తరువాత వచ్చిన ఆపరేటింగ్ సిస్టం ఉండాలి. 8 జీబీ ర్యామ్ ఉండాలి. ఇంటెల్ కోర్ ఐ7 లేదా ఎం1 చిప్ లేదా అంతకంటే ఎక్కువ ప్రాసెసర్ ఉండాలి. కనీసం 2 జీబీ గ్రాఫిక్ కార్డు ఉండాలి. 

లైనక్స్:

సెంట్ ఓఎస్ 7.3 ఆపరేటింగ్ సిస్టం ఉండాలి. 32 జీబీ ర్యామ్ ఉండాలి. ఇంటెల్ కోర్ ఐ7 లేదా ఏఎండీ రైజన్ 7 ప్రాసెసర్ ఉండాలి. 

హెచ్డీ వీడియోలు ఎడిటింగ్ చేసేందుకు అయితే 16 జీబీ ర్యామ్ సరిపోతుంది. ఒకవేళ మీరు కనుక 4కే, 8కే రిజల్యూషన్ వీడియోలు ఎడిటింగ్ చేస్తే కనుక మీ కంప్యూటర్ లేదా మ్యాక్ సిస్టంకి 32 జీబీ నుంచి 64 జీబీ ర్యామ్ అయితే ఖచ్చితంగా ఉండాలి.

ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?:

వెబ్ బ్రౌజర్ లో బ్లాక్ మ్యాజిక్ డిజైన్ డాట్ కామ్ (blackmagicdesign.com)అని టైప్ చేయాలి. లేదా డావిన్సీ రిజాల్వ్ (DaVinci Resolve) అని టైప్ చేస్తే స్టార్టింగ్ లోనే మీకు ఒక వెబ్ సైట్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి లోపలకు వెళ్ళాలి. లోపలకు వెళ్ళగానే ఒక వీడియో ప్లే అవుతుంది. దాని కింద ఫ్రీ డౌన్ లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నాలుగు రకాల సాఫ్ట్ వేర్లు కనిపిస్తాయి. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ని బట్టి.. మీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంని బట్టి ఎంచుకోవాలి. ఒక అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్, అడ్రస్ వంటి వివరాలు ఇస్తే సరిపోతుంది. రిజిస్టర్ అండ్ డౌన్ లోడ్ మీద క్లిక్ చేస్తే సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ అవుతుంది. ఇన్స్టాల్ చేసుకుని ఫ్రీగా వీడియోలు ఎడిట్ చేసుకోవచ్చు. 

  • వెబ్ సైట్ లోకి వెళ్లేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Show comments