iDreamPost
android-app
ios-app

ఇది సామాన్యుల మ్యాక్‌బుక్! కేవలం 17 వేలే! లిమిటెడ్ పీరియడ్ ఆఫర్

  • Published May 28, 2024 | 7:35 PM Updated Updated May 28, 2024 | 7:35 PM

Middle Class MacBook: సామాన్యుల మ్యాక్ బుక్ ల్యాప్ టాప్ గా దీనికి పేరుంది. మ్యాక్ బుక్ కొనాలంటే లక్ష రూపాయలు అవుతుంది. అదే ఈ మ్యాక్ బుక్ లాంటి ల్యాప్ టాప్ కేవలం 17 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇది ఆల్ రౌండర్ ల్యాప్ టాప్ గా ఉంది.

Middle Class MacBook: సామాన్యుల మ్యాక్ బుక్ ల్యాప్ టాప్ గా దీనికి పేరుంది. మ్యాక్ బుక్ కొనాలంటే లక్ష రూపాయలు అవుతుంది. అదే ఈ మ్యాక్ బుక్ లాంటి ల్యాప్ టాప్ కేవలం 17 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇది ఆల్ రౌండర్ ల్యాప్ టాప్ గా ఉంది.

ఇది సామాన్యుల మ్యాక్‌బుక్! కేవలం 17 వేలే! లిమిటెడ్ పీరియడ్ ఆఫర్

ల్యాప్ టాప్ ల వాడకం అనేది బాగా పెరిగిపోయింది. ఎంటర్టైన్మెంట్ పర్పస్, స్టడీ పర్పస్, గేమింగ్ పర్పస్, ఎడిటింగ్ పర్పస్ ఇలా కస్టమర్ పర్పస్ ని బట్టి ల్యాప్ టాప్ ని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కలిపి ఒకే ల్యాప్ టాప్ లో రావాలంటే కనీసం లక్ష రూపాయలు అయినా పెట్టాల్సిందే. మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాప్ టాప్ అయితే లక్ష రూపాయలు ఉంటుంది. అయితే దీన్ని చూసి కాపీ కొట్టారో ఏమో గానీ అచ్చం మ్యాక్ బుక్ ఎయిర్ ని పోలినట్టు ఉండే ల్యాప్ టాప్ ని అయితే జిరాక్స్ దింపేసింది చువి కంపెనీ. చువి హీరో బుక్ ప్రో పేరుతో సామాన్యులకు అందుబాటులోకి ఒక ల్యాప్ టాప్ ని తీసుకొచ్చింది. ఆల్ రౌండర్ ల్యాప్ టాప్ గా కంపెనీ దీన్ని క్లెయిమ్ చేస్తుంది.

ఈ చువి హీరో బుక్ ప్రో.. 14.1 అంగుళాల స్క్రీన్ సైజ్ తో వస్తుంది. ఫుల్ హెచ్డీ ఐపీఎస్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో ఇంటెల్ సెలిరాన్ ఎన్4020 ప్రాసెసర్ ని ఉంచారు. 2.6 జిగా హెట్జ్ సీపీయూ స్పీడ్ తో ఇది పని చేస్తుంది. ఇక ర్యామ్ విషయంలో కంపెనీ రాజీ పడలేదు. 8 జీబీ డీడీఆర్4 ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఎస్ఎస్డీ డ్రైవ్ ని అందిస్తున్నారు. ఈ స్టోరేజ్ ని 1 టీబీ వరకూ ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. ఇందులో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంని ఇంస్టాల్ చేశారు. గ్రాఫిక్స్ కోసం యూహెచ్డీ 600 డీడీఆర్ 4 ఎస్డీ ర్యామ్ ని ఇందులో వినియోగించారు. హెవీ పెర్ఫార్మెన్స్ గేమ్స్ మినహాయిస్తే మిగతా గేమ్స్ ఇందులో స్మూత్ గా ప్లే అవుతాయని కంపెనీ చెబుతుంది. గేమ్స్ కి, వర్క్ కి ఇలా అన్ని రకాల పనులకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతుంది.

24 వాట్ ఫాస్ట్ ఛార్జ్, 38 వాట్ హవర్ హై కెపాసిటీ బ్యాటరీ, 9 గంటల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. 46 శాతం మంది 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. అపీరెన్స్, పెర్ఫార్మెన్స్ నచ్చిందని.. చాలా ఉపయోగకరంగా ఉందని.. లుక్ వైజ్ బాగుందని రివ్యూలు ఇచ్చారు. బేసిక్ గేమ్స్ ని రన్ చేయచ్చు కానీ హెవీ గేమ్స్ ని ఆడడం కుదరదని.. ఇది స్టూడెంట్స్ కి, బేసిక్ ఆఫీస్ వర్క్ కి బాగా యూజ్ అవుతుందని కొంతమంది రివ్యూలు ఇచ్చారు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 34,990 ఉండగా.. ఆఫర్ లో రూ. 16,990కే వస్తుంది. మీ పాత ల్యాప్ టాప్ ని ఎక్స్ ఛేంజ్ చేస్తే రూ. 12,350 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇదే కాకుండా క్రెడిట్ కార్డుల మీద 30 రకాల బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. దీంతో రూ. 1699 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. దీన్ని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.