iDreamPost
android-app
ios-app

కారులో కచ్చితంగా ఉండాల్సిన వస్తువు.. జస్ట్ రూ.95 మాత్రమే!

  • Published Jun 20, 2024 | 8:16 PM Updated Updated Jun 20, 2024 | 8:16 PM

కార్లను రెగ్యులర్​గా యూజ్ చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే చిన్న చిన్న వస్తువులతో వాటికి చెక్ పెట్టొచ్చు. ఈ వస్తువు కూడా అలాంటిదే.

కార్లను రెగ్యులర్​గా యూజ్ చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే చిన్న చిన్న వస్తువులతో వాటికి చెక్ పెట్టొచ్చు. ఈ వస్తువు కూడా అలాంటిదే.

  • Published Jun 20, 2024 | 8:16 PMUpdated Jun 20, 2024 | 8:16 PM
కారులో కచ్చితంగా ఉండాల్సిన వస్తువు.. జస్ట్ రూ.95 మాత్రమే!

కార్లను రెగ్యులర్​గా వాడేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కోట్లు వెచ్చించి కొన్న వాహనాలను నడిపితే సరిపోదు. వాటిని అంతే బాగా మెయింటెయిన్ చేయాలి. ప్రతి వాహనానికి సంబంధించి క్లీనింగ్ అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. అయితే కొంతమంది పైపైనే శుభ్రం చేసి వదిలేస్తారు. కానీ కార్లలో ఇంటీరియర్​, అలాగే ఔట్ సైడ్ కూడా అంతే క్లీనింగ్​గా ఉంచుకోవాలి. బయటి వైపు అంటే వాటర్‌‌ కొట్టి క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఇంటీరియర్​ ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చూసుకోవడం అందరికీ రాదు. కారు అలా బయటకు తీస్తే చాలు లోపల చెత్త, దుమ్ము పేరుకుపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ కార్లలో దీన్ని ఎక్కువగా చూడొచ్చు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ వస్తువును తెచ్చుకుంటే సరిపోతుంది.

కారు ఇంటీరియర్​లో ముఖ్యంగా డ్యాష్​బోర్డ్, ఏసీ వెంట్​లో దుమ్ము ఎక్కువగా పేరుకుపోతుంది. దీన్ని బట్టతో తుడిచినా పోదు. ఎంత క్లీన్ చేసినా ఇంకా ఏదో లోపల ఉన్నట్లే కనిపిస్తుంది. అయితే ఇలాంటి మూలల్లో పేరుకుపోయిన చెత్తను ఈజీగా క్లీన్ చేయడానికి మార్కెట్​లో ఓ అద్భుతమైన వస్తువు వచ్చేసింది. అదే లజీ క్లీనింగ్ స్లైమ్. సాధారణంగా చెత్తను తీసేసే వస్తువుల్లో క్లాత్ రిమూవర్స్ లేదా బ్యాటరీ సాయంతో నడిచే రిమూవర్స్​ను చూడొచ్చు. కానీ ఇది అలా కాదు. లజీ సంస్థ కారులో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి ఓ జెల్లీని రూపొందించింది. ఈ క్లీనింగ్ జెల్​తో కారు ఇంటీరియర్​లో ఏసీ గానీ డ్యాష్​బోర్డ్ గానీ ఇతర భాగాల్లో ఎక్కడైనా సరే ఉన్న డస్ట్ ఇట్టే క్లీన్ చేసేయొచ్చు.

లజీ కంపెనీ రూపొందించిన జెల్​ను చేతితో పట్టుకొని ఎక్కడైతే చెత్త ఉందో అక్కడ క్లీన్ చేస్తూ పోవాలి. చెత్త ఉన్న భాగంలో ఆ జెల్​ను రుద్దితే చాలు అది దాన్ని పీల్చుకుంటుంది. ఈ జెల్​ను కార్లలో ఇంటీరియర్​ను శుభ్రం చేయడంతో పాటు ఇంకో పనికి కూడా వాడొచ్చు. ల్యాప్​టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్​కు ఉండే కీబోర్డు, మౌస్​ను క్లీన్ చేయడానికి ఈ జెల్​ను వినియోగించొచ్చు. ఈ జెల్​ను కొన్నాక బాగా మిక్స్ చేయాలి. ఎక్కడైతే చెత్త ఉందో అక్కడ ఈ జెల్​ను ఉంచి రెండు నుంచి మూడుసార్లు ప్రెస్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ జెల్​ను వాడిన తర్వాత గాలి తగలకుండా ఓ బాటిల్​లో ఉంచాలి. ఈ జెల్​ను బయోడీగ్రేడబుల్ మెటీరియల్​తో తయారు చేశామని సదరు సంస్థ చెబుతోంది. దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అంటోంది. దీని ధర కూడా చాలా తక్కువ. కేవలం 95 రూపాయలు పెడితే చాలు ఈ జెల్ మీ ఇంటికి వచ్చేస్తుంది. అమెజాన్​తో పాటు పలు ఈ-కామర్స్ ప్లాట్​ఫామ్స్​లో ఇది అందుబాటులో ఉంది. ఈ కారు ఇంటరీయర్ క్లీనింగ్ జెల్​ను కొనుగోలు చేయడానికి ఈ లింక్​ పై క్లిక్ చేయండి.