iDreamPost
android-app
ios-app

సూపర్.. వాట్సాప్ లోనే బస్సు టికెట్లు జారీ!

Bus Ticket Service In WhatsApp: సాధారణంగా బస్సు ప్రయాణం చేయాలి అంటే మీ దగ్గర టికెట్ కు సరిపడా చిల్లర అయితే ఉండాలి. బస్సు ప్రయాణంలో చిల్లర అనేది చాలా పెద్ద సమస్య. అందుకు పరిష్కారం వాట్సాప్ లో టికెట్ సేవలని చెబుతున్నారు.

Bus Ticket Service In WhatsApp: సాధారణంగా బస్సు ప్రయాణం చేయాలి అంటే మీ దగ్గర టికెట్ కు సరిపడా చిల్లర అయితే ఉండాలి. బస్సు ప్రయాణంలో చిల్లర అనేది చాలా పెద్ద సమస్య. అందుకు పరిష్కారం వాట్సాప్ లో టికెట్ సేవలని చెబుతున్నారు.

సూపర్.. వాట్సాప్ లోనే బస్సు టికెట్లు జారీ!

ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కూడా తాము అందిస్తున్న సర్వీసులను డిజిటల్ చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలకు సులభమైన సేవలు, కచ్చితంగా అందిచగలమని భావిస్తున్నారు. అందుకు వారికి ఉన్న ప్రధాన మార్గం వాట్సాప్ అని చెప్పచ్చు. అందుకే చాలా సర్వీసులను ఇప్పుడు వాట్సాప్ లోకి తీసుకొస్తున్నారు. అందుకు ఉదాహరణగా మెట్రో టికెట్ గురించి చెప్పచ్చు. మీరు వాట్సాప్ ద్వారా మెట్రో రైలు టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి తరహాలోనే బస్సు టికెట్ ను కూడా బుక్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

వాట్సాప్ లో కూడా మీరు బస్సు టికెట్ బుక్ చేసుకునే అకాశాన్ని కూడా చాలా త్వరగానే తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్నా వార్తలను బట్టి చూస్తే చాలా త్వరగానే ఆ సేవలు ప్రారంభం కావచ్చు. కాకపోతే ఈ చర్యలు తీసుకుంటోది తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. ఢిల్లీ ప్రభుత్వం ఈ తరహా సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో మెట్రో రైలు టికెట్లను వాట్సాప్ లో బుక్ చేసుకోవచ్చు. మొదట ఒక లైన్ లో ఈ సేవలను ప్రారంభించారు. వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసి మీరు మెట్రో రైలు టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. లేదంటే మెట్రే స్టేషన్ లో ఉండే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కూడా మెట్రో రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ఆ సర్వీస్ కి రెస్పాన్స్ బాగుండటంతో మరిన్ని లైన్లకు ఈ వాట్సాప్ టికెట్ సేవలను విస్తరించారు. కాకపోతే ఢిల్లీలో వాట్సాప్ ద్వారా లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే మీరు టికెట్ ని బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే తరహాలే బస్సు సర్వీసులకు కూడా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. అతి త్వరలోనే ఈ వాట్సాప్ టికెటింగ్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామంటూ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి సేవలను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకొస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలు టికెట్లను ప్రయాణికులు యూపీఐ యాప్స్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు.

అలాగే వాట్సాప్ ద్వారా కూడా మీరు హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బస్సులకు కూడా ఇలాంటి ఒక సేవలను అందుబాటులోకి తీసుకొస్తే ప్రయాణికులు సులభంగా టికెట్స్ ని బుక్ చేసుకునేందుకు వీలవుతుంది. అలాగే ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేసిన పేరు కూడా వస్తుంది. అలాగే బస్సుల్లో ప్రయాణికులకు, కండెక్టర్లకు చిల్లరకు సంబంధించిన సమస్య కూడా తీరుతుంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ వాట్సాప్ టికెటింగ్ సేవల గురించి ఆలోచన చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. వాట్సాప్ లో బస్సు టికెట్ బుక్ చేసుకునేందుకు వీలు కల్పించే ఈ సేవలు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుబాటులోకి రావాలి అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.